Latest Updates
-
కోడిగుడ్డుతో రొటీన్ కూరలు బోర్ కొట్టాయా? అయితే ఈ రెస్టారెంట్ స్టైల్ ఎగ్ బటర్ మసాలా ట్రై చేయండి! -
జుట్టు రాలడాన్ని తగ్గించి, ఒత్తుగా పెరిగేలా చేసే బయోటిన్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ప్లఫ్ఫీగా, జ్యూసీగా.. ఈ చిల్లీ ఆమ్లెట్ ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు.. -
పెళ్లి వేడుకలకు వరుణుడి గండం! మే నెలలో పెళ్లిళ్లు చేసుకునే వారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే -
నోట్లో కరిగిపోయే గులాబ్ జామున్ కావాలా? అయితే స్వీట్ షాపుల సీక్రెట్ ఇదే! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణీలు ఈ తప్పులు చేస్తే బిడ్డకు ప్రమాదమేనా? -
రొటీన్ చికెన్ కూరతో బోర్ కొట్టిందా? అయితే ఈ సండే మధురై చికెన్ కొత్తు కర్రీ ట్రై చేయండి -
పెళ్లైన ఏడు నెలలకే నవ దంపతుల విషాదాంతం… అసలు ఏం జరిగింది? షాకింగ్ నిజాలు! -
పరగడుపున ఈ జ్యూస్ తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు..కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోతుంది! -
NEET రాసేటప్పుడు పీరియడ్స్ వస్తున్నాయా? కంగారు వద్దు, ఈ చిట్కాలు పాటిస్తే చాలు!
ప్రెగ్నెన్సీ టైంలో ఎట్టిపరిస్థితుల్లో తినకూడని హెల్తీ ఫుడ్స్..
గర్భం దాల్చిన తర్వాత ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తీసుకునే ఆహారం గురించి ప్రతీది గమనించాలి. ఏం తింటున్నాం, ఎప్పుడు తింటున్నాం అనేదానితో పాటు, వాటిలో ఏం పోషకాలు ఉన్నాయి., అవి ఎంతవరకు తల్లికి, బిడ్డకు సురక్షితమనేది చాలా జాగ్రత్త పరిశీలించి తీసుకోవాలి.
గర్భదారణ సమయంలో బ్యాలెన్డ్స్ డైట్ ఫాలో అవడం వల్ల కడుపులోని బిడ్డ పెరుగుదల చాలా హెల్తీగా ఉంటుంది. అలాగే కొన్ని శరీరంలో వేడి కలిగించే ఆహారాలు, పదార్థాలకు దూరంగా ఉండాలి. ఒకవేళ అవి హెల్తీ అని తెలిసినా.. కూడా వాటిని తినకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
బాడీలో హీట్ పెంచే ఆహారాలు తీసుకోవడం వల్ల.. టెంపరేచర్ బ్యాలెన్స్ చేయడం చాలా కష్టంగా మారుతుంది. అయితే పెద్ద ప్రమాదమేమీ లేకపోయినా.. శరీరంలో ఎలాంటి కొత్త మార్పులు, ప్రభావాలకు గురికాకుండా జాగ్రత్త పడటం చాలా అవసరం. కాబట్టి హెల్తీ ఫుడ్స్ అని మనం భావించే కొన్ని ఆహారాలను మాత్రం గర్భధారణ సమయంలో దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మరి అవేంటో చూద్దాం..

పపాయ
బాగా పండిన బొప్పాయి పండు తినడం వల్ల ఎలాంటి హాని కలుగదు. కానీ.. పచ్చిగా ఉన్న బొప్పాయి, కొద్దిగా పండిన బొప్పాయిని గర్భధారణ సమయంలో తీసుకోవడం మంచిది కాదు. గ్రీన్ పపాయలో ల్యాటెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది గర్భాశయ సంకోచాలకు కారణం అవుతుంది. ఇది తినడం వల్ల అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది.

పైనాపిల్
హెల్తీ ఫ్రూట్ గా భావించే పైనాపిల్ కి కూడా గర్భధారణ సమయంలో దూరంగా ఉండటం మంచిది. హీట్ ఇండ్యూసింగ్ ఫుడ్స్ టాప్ లో ఉంటుంది పైనాపిల్. దీన్ని తినడం వల్ల శరీరంలో టెంపరేచర్ ఎక్కువ అవడమే కాకుండా, గర్భాశయంలో సంకోచాలకు అవకాశం ఉంటుంది. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ముందుగానే ప్రసవం అవడానికి కారణమవుతుంది.

వంకాయ
శరీరంలో వేడి కలగడానికి కారణమయ్యే వాటిలో వంకాయ ఒకటి. గర్భధారణ సమయంలో తరచుగా వంకాయ తినడం వల్ల.. అబార్షన్, ఇతర అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది.

స్పైసీ ఫుడ్స్
స్పైసీ ఫుడ్స్ అయిన రెడ్ చిల్లీస్, డ్రై జింజర్ ని గర్భధారణ సమయంలో దూరంగా ఉంచడం మంచిది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో టెంపరేచర్ పై దుష్ర్పభావం పడుతుంది.

ఆయిలీ ఫుడ్స్
పకోడి, బర్గర్, ఫ్రై ఫుడ్స్ ని ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకోకూడదు. ఇవన్నీ శరీరంలో వేడి పుట్టించడానికి కారణమవుతాయి. దీనివల్ల జీర్ణక్రియ సమస్యలతో పాటు, ఇతర సమస్యలు ఎదురై.. అన్ హెల్తీగా మారడానికి కారణమవుతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రెగ్నెన్సీ టైంలో ఆయిలీ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి.

నువ్వులు
నువ్వులను అబార్షన్ అవడానికి ఉపయోగిస్తారు. గర్భం దాల్చిన మొదటి రోజుల్లో వీటిని ఎట్టిపరిస్థితుల్లో తీసుకోకూడదు. మొదటి ట్రైమ్ స్టర్ లో నువ్వులను తీసుకోకపోవడం మంచిది.

సీతాఫలం
సీతాఫలంలో పోషకాలు ఎన్నో ఉంటాయి. అద్భుతమైన రుచి కలిగిన ఈ పండుని గర్భధారణ సమయంలో తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే.. ఇది తినే వారి శరీరాన్ని వేడిగా తయారు చేస్తుంది. అందువల్ల సీతాఫలాన్ని గర్భిణీ స్త్రీలు తినకపోవడం మంచిది.



Click it and Unblock the Notifications