For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో గర్భిణీ రొమ్ముల్లో జరిగే 7 మార్పులు

By Super Admin
|

మీరు కనుక గర్భవతులయితే మీ శరీరంలో జరిగే రకరకాల మార్పులు మీకు తెలుస్తూ ఉండే ఉంటాయి.మీ శరీరంలో ఇతర భాగాల్లగే మీ స్తనాలలో కూడా మార్పులు వస్తాయి.గర్భం ధరించినప్పుడు స్త్రీ శరీరం అనేక మార్పులకి లోనవుతుంది.హార్మోన్ల వల్ల శారీరకంగా మరియూ మానసికంగా మార్పులు కలుగుతాయి. గర్భవతులు బరువు పెరగడాన్ని చాలా మందిలో మనం చూస్తుంటాము.తనలో ఇంకొక ప్రాణిని ఇముడ్చుకోవడానికే ఈ మార్పులన్నీను.బరువు పెరగడమే కాకుండా కటి భాగం విశాలమవ్వడం, పిరుదులలు, తొడల భాగాల్లో ఓ క్రొవ్వు చేరడం వంటి మార్పులు కూడా వస్తాయి.

కాబోయే తల్లులలో మూడ్ స్వింగ్స్ అధికంగా ఉండి, కోప తాపాలు,వేళా పాళా లేని ఆకలి, డిప్రెషన్‌కి గురి కావ్డం వంటివి జరుగుతుంటాయి.వీటికి తోడు ఆమె శరీరంలో జరిగే మరో ముఖ్య మార్పు ఆమె స్తనాలు,వాటి పరిమాణం,ఆకారం తదితర అంశాలలో మార్పులు చోటు చేసుకుంటాయి.స్త్రీ గర్భం ధరించినప్పుడు మరియూ పిల్లలకి స్తన్యమిచ్చి కావాల్సిన పోషకాలని అందించడంలోనూ స్తనాలు ముఖ్య భూమికని పోషిస్తాయి. ఇంకా గర్భం ధరించినప్పుడు స్త్రీ స్తనాలలో జరిగే 7 ముఖ్య మార్పులివిగో.

1.బరువుగా అనిపించడం:

1.బరువుగా అనిపించడం:

గర్భం ధరించినప్పుడు స్త్రీలలో ప్రెగ్నెన్సీ హార్మోన్ల వల్ల మరియూ ఇతర కణజాలాలవల్లా స్తనాలు విశాలమయ్యి బరువుగా ఉన్నట్లనిపిస్తాయి.

2.సున్నితంగా ఉండటం:

2.సున్నితంగా ఉండటం:

గర్భం ధరించగానే స్తనాలలోకి రక్త ప్రసరణ పెరగడంతో పాటు కణజాలాలు వాచడం అమ్రియూ ఇతర హార్మోనల్ తేడాలవల్ల స్తనాలు నెప్పిగా సున్నితంగా అనిపిస్తాయి.

3.ఉబికి పైకి కనిపించే సిరలు:

3.ఉబికి పైకి కనిపించే సిరలు:

మీ స్తనాలలోని నీలిరంగు సిరలు మీరు గర్భవతులుగా ఉన్నప్పుడు పైకి కనిపిస్తూ ఉండటాన్ని గమనించే ఉంటారు.గర్భం ధరించినప్పుడు పెరిగిన రక్త ప్రసారానికనుగుణంగా సిరలు వ్యాకోచించడం వల్ల స్పష్టంగా పైకి కనపడుతుంటాయి.

4.పెద్దవయ్యే చనుమొనలు:

4.పెద్దవయ్యే చనుమొనలు:

కొంత మంది గర్భవతులలో చనుమొనలు గట్టిపడి పెద్దవవడాన్ని గమనించవచ్చు.అక్కడ ఉన్న కణజాలం వ్యాకోచించడం వల్ల ఈ మార్పు చోటు చేసుకుంటుంది.

5.చనుబాలు ఊరడం:

5.చనుబాలు ఊరడం:

రెండవ లేదా మూడవ త్రైమాసికంలో గర్భవతులు తమ చనుమొనల నుండి ఒక చిక్కటి ద్రవం స్రవించడాన్ని గమనిస్తారు.పిల్లలు ఇంకా గర్భంలో ఉండగానే చనుమొనల నుండి ఊరే పాలని "కొలోస్ట్రం" అంటారు.

6.స్ట్రెచ్ మార్క్స్:

6.స్ట్రెచ్ మార్క్స్:

గర్భవతులలో స్తనాల పరిమాణం, వైశాల్యం పెరగడం వల్ల అక్కడి చర్మం కూడా వ్యాకోచించి స్తనాల మీద స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడతాయి.

7.సాగడం:

7.సాగడం:

పైన చెప్పినట్లుగానే గర్భం ధరించినప్పుడు స్తనాలు వ్యాకోచించడంవల్ల పిల్లలు పుట్టిన తరువాత స్తనాలు సాగినట్లుగా ఉంటాయి.

English summary

7 Surprising Changes Your Breasts Experience During Pregnancy

Pregnancy is a phase in a woman's life in which she experience a whole lot of changes, both emotional and physical, mostly triggered by the hormonal changes. As we may have noticed, most pregnant woman gain weight during pregnancy, as they have to accommodate another human being inside them!
Story first published:Monday, September 12, 2016, 12:47 [IST]
Desktop Bottom Promotion