For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డెలివరీ డేట్ కంటే ముందుగా డెలివరీ అవడానికి కారణాలేంటి ?

By Swathi
|

గర్భధారణ అనేది.. మగువలకు అత్యంత ప్రత్యేకమైన సమయం. అలాగే.. అనేక రిస్క్ లు, శరీరంలో మార్పులు ఎదురయ్యే సమయం కూడా. కొత్త అనుభవాలు, అనుభూతులు నేర్పుతూనే.. అనుకోని పరిణామాలు, ఆలోచనలు, భయం, ఆందోళనకు కారణమవుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో.. ప్రతి అడుగు కీలకమే. అన్నీ సజావుగా సాగితే.. పండంటి బిడ్డకు జన్మనివ్వడం మధురానుభూతిగా మిగిలిపోతుంది.

అలర్ట్: సిజేరియన్ తర్వాత ఎట్టిపరిస్థితుల్లో చేయకూడని పనులు !

అయితే అబార్సన్, ప్రీటర్మ్ లేబర్ ( డెలివరీ డేట్ కంటే ముందే ప్రసవం ), ఇన్ఫెక్షన్స్, వాజినల్ డిశ్చార్డ్ వంటి రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటిలో ఏ సమస్య ఉన్నా.. గర్భిణీ స్త్రీలకు ఆందోళనకరంగా ఉంటుంది. అయితే గర్భిణీ స్త్రీకి ఉండే కొన్ని రకాల అలవాట్లు, లక్షణాలు డెలివరీ డేట్ కంటే ముందే ప్రసవం అవడానికి కారణమవుతాయి. ఇలాంటి రిస్క్స్ తో కూడిన అలవాట్లు, లక్షణాలకు దూరంగా ఉండటం వల్ల.. ప్రీటర్మ్ లేబర్ ని ఎలా నిరోధించవచ్చో తెలుసుకుందాం..

స్మోకింగ్

స్మోకింగ్

మీకు స్మోకింగ్ చేసే అలవాటు ఉంటే.. మీరు దాదాపు 4వేల చెడు కెమికల్స్ ని మీ శరీరంలోకి పంపించినట్టే. ఆ పొగ పీల్చినప్పుడల్లా.. పొట్టలో బేబీపై ఎక్కువ మొత్తంలో డ్యామేజ్ అవుతుంది. బేబీకి ఆక్సిజన్, నూట్రియంట్ సప్లై చేసే.. నాళాలపై దుష్ర్పభావం చూపుతుంది. అలాగే కార్బన్ డైయాక్సైడ్ ఎర్రరక్తకణాల్లో పేరుకుపోవడం వల్ల.. ప్రీటర్మ్ డెలివరీ రిస్క్ ఎక్కువగా ఉంటుంది.

రెండు కప్పుల కంటే ఎక్కువ కాఫీ

రెండు కప్పుల కంటే ఎక్కువ కాఫీ

కాఫీ మాత్రమే కాదు, ఏ ఉత్పత్తి నుంచి అయినా కెఫీన్ అంటే చాక్లెట్స్, హెల్త్ డ్రింక్స్ ద్వారా కెఫీన్ ను ఎక్కువ పరిమాణంలో తీసుకోవడం వల్ల బేబీ గర్భాశయంలో ఎక్కువ సమయం ఉండలేడు. కెఫీన్ వల్ల తల్లి హార్ట్ రేట్ పెంరగడం, ఎసిడిటీ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఎక్కువగా ఫస్ట్ ట్రైమ్ స్టర్ లో కెఫీన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల అబార్షన్, ప్రీటర్మ్ లేబర్ కి కారణమవుతుంది.

అధిక బరువు

అధిక బరువు

ప్రెగ్నెన్సీ సమయంలో మీ ఆహారపు అలవాట్లపై చాలా జాగ్రత్త వహించాలి. క్యాలరీలు, స్వీట్స్ తక్కువగా తీసుకోవాలి. ఇవి ఎక్కువగా తినడం వల్ల గెస్టేషనల్ డయాబెటిస్ రిస్క్ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు.. ప్రీటర్మ్ లేబర్ కి దారితీస్తాయి.

ఎక్కువ వ్యాయామం

ఎక్కువ వ్యాయామం

ప్రెగ్నెన్సీ సమయంలో రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల.. ఎలాంటి సమస్యా ఉండదు. దీనివల్ల గెస్టేషనల్ డయాబెటిస్ వంటి రిస్క్ లు తక్కువగా ఉంటాయి. అయితే.. వ్యాయామం మరీ ఎక్కువగా చేస్తే మాత్రం డేంజరే. పొత్తికడుపుపై ఒత్తిడి, రన్నింగ్ వంటి వ్యాయామాలు చేయడం వల్ల గర్భంపై ఒత్తిడి పెరిగి.. సమయానికంటే ముందే డెలివరీ అవడానికి ఛాన్స్ ఉంటుంది.

ఒత్తిడి

ఒత్తిడి

గర్భిణీ స్త్రీలో స్ట్రెస్ హార్మోన్ లెవెల్ పెరగడం వల్ల.. ఆకలి తగ్గుతుంది. దీనివల్ల పోషకాలు సరిగా అందక బేబీ బరువు తగ్గుతుంది. గర్భస్త శిశువు డెవలప్ మెంట్ తగ్గి.. ప్రీటర్మ్ లేబర్ కి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఆల్కహాల్

ఆల్కహాల్

గర్భధారణ సమయంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల.. తరచుగా తీసుకున్నా కూడా బేబీ గ్రోత్ పై దుష్ర్పభావం పడుతుంది. ప్లేసంటా ద్వారా బేబీకి అందుతుంది. దీనివల్ల అనేక సమస్యలు ఏర్పడి.. ప్రీటర్మ్ లేబర్, అబార్షన్ ల రిస్క్ ఉంటుంది.

దుర్వాసన

దుర్వాసన

శరీరం విడుదల చేసే హార్మోన్లదే నోటి ఇన్ఫెక్షన్ల బాధ్యత. కాబట్టి నోటి పరిశుభ్రత సరిగా లేకపోయినా.. ప్రీటర్మ్ లేబర్ కి కారణమవుతుంది. ఓరల్ ఇన్ఫెక్షన్స్, క్వావిటీస్, ఇన్ల్ఫమేషన్, చిగుళ్ల నుంచి రక్తస్రావం, నోటి అల్సర్లు ప్రీటర్మ్ లేబర్ కి కారణమవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

English summary

7 things that could lead to preterm labour and you can prevent it!

7 things that could lead to preterm labour and you can prevent it! There are certain factors that put an expectant mother at a risk of miscarriage and preterm labour.
Story first published:Monday, April 25, 2016, 14:42 [IST]
Desktop Bottom Promotion