For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలు కాకరకాయ తినవచ్చా? తింటే పొందే ప్రయోజనాలు ఏంటి..?

గర్భిణీలు ఏ ఆహారం తీసుకున్నా మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. పరిమితికి మించి తీసుకుంటే ఏదైనా విషంగా మారే ప్రమాదం. గర్భిణిలలో యుటేరియన్ బ్లీడింగ్ సమస్య మరియు ఇతర సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి, గర

|

కాకరకాయ అంటే మూతి ముడుచుకునే వాళ్ళు చాలా మందే ఉంటారు. అందుకు కారణం అందులో ఉండే బిట్టర్ టేస్ట్. కాకరకాయ చేదుగా ఉండటం వల్ల చాలా మంది కారకాయను తినరు. అయితే ఇందులో ఉండే అద్భుతమైన ఔషధగుణాల వల్ల బిట్టర్ మెలోన్ గా ప్రపంచ వ్యాప్తంగా దీనికి మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా డయాబెటిస్ వారు కంపల్సరీ ఈ బిట్టర్ గార్డ్ ను తింటుంటారు.

కేవలం డయాబెటిస్ పేషంట్స్ మాత్రమే కాదు, ఇందులో ఉండే అమేజింగ్ లక్షణాలు, నేచురల్ మెడిసినల్ ప్రభావం వల్ల సాధారణ వ్యక్తులు కూడా ఎక్కువగా తింటుంటారు. ముఖ్యంగా సౌత్ ఈస్ట్ ఏషియాలో కాకరకాయను నేచురల్ డ్రగ్ (మెడిసిన్ )గా తీసుకుంటారు. వీరిసంగతి అటుంచి, గర్భిణీలు కాకరకాయను తినడం సురక్షితమేనా అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. గర్భిణీలు బొప్పాయి, పైనాపిల్ వంటివి, కొన్ని రకాల వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కు దూరంగా ఉంటారు. గర్భధారణ సమయంలో బిట్టర్ గార్డ్ తినవచ్చని కొన్ని పరిశోధనలు నిర్ధారించారు.

అయితే, గర్భిణీలు ఏ ఆహారం తీసుకున్నా మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. పరిమితికి మించి తీసుకుంటే ఏదైనా విషంగా మారే ప్రమాదం. గర్భిణిలలో యుటేరియన్ బ్లీడింగ్ సమస్య మరియు ఇతర సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి, గర్భిణీలు కాకరకాయ తినడం వల్ల పొందే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

ఫొల్లెట్ కంటెంట్ అధికంగా ఉంటుంది:

ఫొల్లెట్ కంటెంట్ అధికంగా ఉంటుంది:

గర్భిణీ స్త్రీలకు ఫొల్లెట్ చాలా అవసరం. ఈ మినిరల్స్ పుట్టబోయే బిడ్దకు చాలా సురక్షితమైనది. న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ను నివారిస్తుంది. బిట్టర్ గార్డ్ లో ఉండే హై ఫొల్లెట్ కంటెంట్ కాబట్టి, గర్భిణీలు మితంగా తినడం మంచిదే.

ఫైబర్ కంటెంట్ :

ఫైబర్ కంటెంట్ :

కాకర కాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది సంత్రుప్తి పరుస్తుంది. హైక్యాలరీ , జంక్ ఫుడ్స్ మీద కోరికలను తగ్గిస్తుంది. ఈ వెజిటేబుల్ ను రెగ్యులర్ గా తింటుంటే బరువు కంట్రోల్లో ఉంటుంది.

జీర్ణ సంబంధిత సమస్యను నివారిస్తుంది:

జీర్ణ సంబంధిత సమస్యను నివారిస్తుంది:

చాలా మంది గర్భిణీ స్త్రీలు మలబద్దకం, హెమరాయిడ్స్ సమస్యను ఫేస్ చేస్తుంటారు, ఈ సమయంలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉన్న ఆహారాలు తినడం వల్ల మలబద్దకం, హెమరాయిడ్స్ సమస్యను నివారించుకోవచ్చు.

యాంటీ డయాబెటిక్:

యాంటీ డయాబెటిక్:

బిట్టర్ గార్డ్ లో యాంటీ డయాబెటిక్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి దీన్ని తప్పనిసరిగా రోజూ తినడం మంచిది. కాకరకాయలో కెరోటిన్, పాలిపెప్టైడ్ జస్టేషనల్ డయాబెటిస్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

యాంటీఆక్సిడెంట్:

యాంటీఆక్సిడెంట్:

కాకరకాయ విటమిన్ సి అనే యాంటీఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఇది హానికరమైన బ్యాక్టీరియా నుండి రక్షణ కల్పిస్తుంది. ఇమ్యూనిటి పవర్ ను పెంచుతుంది.

బౌల్ మూమెంట్ ను రెగ్యులేట్ చేస్తుంది:

బౌల్ మూమెంట్ ను రెగ్యులేట్ చేస్తుంది:

కాకరకాయ బౌల్ మూమెంట్ ను రెగ్యులేట్ చేస్తుంది. దాంతో జీర్ణ సమస్యలుండవు.

ఫీటస్ కు అవసరమయ్యే న్యూట్రీషియన్స్ ను ఎక్కువగా అందిస్తుంది:

ఫీటస్ కు అవసరమయ్యే న్యూట్రీషియన్స్ ను ఎక్కువగా అందిస్తుంది:

కాకరకాయలో విటమిన్స్ మరియు మినిరల్స్ అధికంగా ఉంటాయి. ఇందులో ఐరన్, నియాసిన్, పొటాసియం, ప్యాంటోథెనిక్ యాసిడ్, జింక్, పెరిడాక్సిన్, మెగ్నీషియం, మాంగనీస్, వంటివి అధికంగా ఉంటాయి. అందుకే కాకరకాయను సూపర్ వెజిటేబుల్ అని పిలుస్తారు.

ఇతర న్యూట్రీషియన్స్ :

ఇతర న్యూట్రీషియన్స్ :

కాకరకాయలో విటమిన్స్, మినిరల్స్ తో పాటు, రిబోఫ్లెవిన్, థైయమిన్, విటమిన్ బి1, బి2, బి3 అధికంగా ఉన్నాయి. క్యాల్షియం, బీటా కెరోటిన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి.

English summary

8 Benefits Of Eating Bitter Gourd During Pregnancy

The properties of bitter gourd point to a definite advancement of health, if it is regularly eaten. But these pungent vegetables can sometimes cause uterine bleeding and other side effects during pregnancy.
Story first published: Friday, December 16, 2016, 17:10 [IST]
Desktop Bottom Promotion