For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ స్త్రీలకు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ తప్పనిసరి ఎందుకు?

By Super
|

గర్భధారణ కాలంలో హెల్తీ మరియు న్యూట్రీషియన్ మీల్స్ తీసుకోవడం చాలా అవసరం. అటువంటి న్యూట్రీషియన్ ఫుడ్స్ లో ఫోలిక్ యాసిడ్ ఫుడ్స్ ఒకటి. దీన్ని తప్పనిసరిగా తీసుకోవల్సి ఉంటుంది . గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా తీసుకోవాలి.

గర్భధారణ సమయంలో ఫోలిక్ యాసిడ్ ముఖ్యపాత్రను పోషిస్తుంది . గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా 40యంసిం ఫోలిక్ యాసిడ్ ను రోజూ తీసుకోవాలి . విటమిన్ సి మరియు ఫోలిక్ యాసిడ్ ముఖ్యపాత్రను పోషిస్తుంది . ఫోలిక్ యాసిడ్ ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల పుట్టుకలో లోపాలు, ప్రమాదకరమైన పుట్టుక సంబందిత స్పైనల్ కార్డ్ మరియు బ్రెయిన్ లోపాలను నివారిస్తుంది.

Benefits Of Folic Acid During Pregnancy

పరిశోధనల ప్రకారం ఫోలిక్ యాసిడ్ క్లిప్ట్ లిప్ మరియు ఇతర గుండె సంబంధిత వ్యాధుల ప్రమాధం నుండి రక్షిస్తుంది . ఫోలిక్ యాసిడ్ అనీమియాను నివారిస్తుంది . మరియు పునరుత్పత్తికి సహాయపడే డిఎన్ కణాలను రిపేర్ చేస్తుంది . అంతే కాదు మూసికు పోయిన కణాలను పునరుత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. అదే విధంగా గర్భదారణ సమయంలో ఫోలిక్ యాసిడ్ ఫుడ్స్ ను డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలున్నాయి . గర్భిణీలు ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల పొందే ప్రయోజనాలేంటో చూద్దాం...

ఎర్రరక్తకణాల ఏర్పాటుకు సహాయపడుతుంది : గర్భధారణ సమయంలో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉన్న ఆహారాలను తినడం వల్ల శరీరంలో ఎర్రరక్త కణాల ఏర్పాటుకు సహాయపడుతుంది. ఎర్రరక్త కణాలు శరీరంలో ఆర్ బిసి కణాల యొక్క రేంజ్ ను నిర్వహించడానికి సహాయపడుతుంది.

Benefits Of Folic Acid During Pregnancy

పిండం ఎదుగుదలకు సహాయపడుతుంది: ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండే ఆహారాలను తినడం వల్ల పిండం ఎదుగుదలకు గ్రేట్ గా సహాయపడుతుంది. శిశువు బ్రెయిన్, వెన్నుముఖ ఏర్పాటుకు గ్రేట్ గా సహాయపడుతుంది . అలాగే పిండంలో గర్భధారణ సమయంలో ఎలాంటి లోపాల తలెత్తకుండా కాపాడుతుంది.

బేబీ ఆరోగ్యానికి మంచిది : ఫోలెట్ బేబీ స్పైన్ బిఫిడ, వంటి ప్రాణాంతక వ్యాధినుండి రక్షింపబడుతుంది. స్పైనల్ కార్డ్ ప్రీనేటల్ సమయంలో ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పడుటకు సహాయపడుతుంది. అంతే కాదు ఫోలిక్ యాసిడ్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల తక్కువ నెలల్లోనే పుట్టుకకుండా ఉంటారు.

Benefits Of Folic Acid During Pregnancy

తల్లి ఆరోగ్యానికి మంచిది: ఫోలిక్ యాసిడ్ బిడ్డకు మాత్రమే కాదు , కాబోయే తల్లులకు కూడా చాలా మేలు చేస్తుంది. వివిధ రకాల గర్భధారణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఇది ప్రీ ఎక్లిప్సియా, గుండె సంబంధిత సమస్యలును మరియు వివిధ రకాల క్యాన్సర్ , స్ట్రోక్ మరియు ఆల్జైమర్స్ వంటి వ్యాధులను నివారిస్తుంది.

English summary

Benefits Of Folic Acid During Pregnancy

Consuming a healthy and nutritious meal is a necessary step to be taken during pregnancy. Folic acid-rich foods are one of the must-have foods that a pregnant woman must include in her diet.
Story first published:Wednesday, April 27, 2016, 17:34 [IST]
Desktop Bottom Promotion