For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డెలివరీకి ముందు మిమ్మల్ని, మీ శరీరాన్ని ప్రిపేర్ చేసుకునే టిప్స్..!

ముఖ్యంగా డెలివరీ సమయంలో.. భయం, ఆందోళన ఎక్కువగా ఉంటాయి. అయితే డెలివరీకి ముందు కొన్ని టిప్స్ ఫాలో అవడం, మిమ్మల్ని, మీ శరీరాన్ని ప్రిపేర్ చేసుకోవడం మంచిది.

By Swathi
|

మహిళల లైఫ్ లో ప్రెగ్నన్సీ అనేది చాలా ఛాలెంజింగ్ లాంటిది. అయితే ఇది చాలా భయం, ఆందోళనను తల్లిలో కలిగిస్తుంది. ముఖ్యంగా డెలివరీ సమయంలో.. భయం, ఆందోళన ఎక్కువగా ఉంటాయి. అయితే డెలివరీకి ముందు కొన్ని టిప్స్ ఫాలో అవడం, మిమ్మల్ని, మీ శరీరాన్ని ప్రిపేర్ చేసుకోవడం మంచిది.

Best Tips To Prepare Yourself For Childbirth!

చైల్డ్ బర్త్ లేదా లేబర్ అనేది కొన్ని రిస్క్ లతో కూడినది. ఇది గర్భిణీల్లో ఆందోళనను కలిగిస్తుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. డెలివరీ సమయంలో ఎదురయ్యే పరిస్థితులు తల్లీ, బిడ్డ ఇద్దరి ఆరోగ్యానికి హాని చేయవచ్చు. కాబట్టి గర్భిణీలోనూ, ఆమె ఫ్యామిలీలోనూ ఆందోళన ఉండటం సహజం.

అలాగే ప్రెగ్నంట్ ఉమెన్ ఖచ్చితంగా ఆందోళన తగ్గించుకోవాలి. హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి. అప్పుడు డెలివరీ సమయంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవచ్చు. డెలివరీ సమయంలో ఒత్తిడి లేకుండా ఉండాలంటే.. కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవేంటో చూద్దాం..

టిప్ 1

టిప్ 1

ముందుగా డెలివరీ ప్రాసెస్ ఎలా ఉంటుందని కొంత నాలెడ్జ్ పొందాలి. ముఖ్యంగా ఒకవేళ మీరు ఫస్ట్ టైం ప్రెగ్నంట్ అయి ఉంటే.. ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏం జరుగుతుందనేది తెలుసుకోవాలి.

టిప్ 2

టిప్ 2

డెలివరీకి ప్రిపేర్ అయ్యే సమయంలో.. కాజెల్ ఎక్సర్ సైజ్ లు ప్రాక్టీస్ చేయడం మంచిది. టైట్ గా ఉన్న పెల్విక్ కండరాలను లూజ్ గా మార్చుకునే విధంగా వ్యాయామం చేయాలి. వ్యాయామం వల్ల డెలివరీ సమయంలో పెయిన్ తగ్గుతుంది.

టిప్ 3

టిప్ 3

ప్రతిరోజూ ప్రొఫెషనల్స్ తో.. మసాజ్ చేయించుకోవాలి. పొట్ట, పెల్విక్ ప్రాంతాల్లో కాంసంట్రేట్ చేయాలి. దీనివల్ల చైల్డ్ బర్త్ చాలా తేలికగా మారుతుంది.

టిప్ 4

టిప్ 4

డెలివరీకి కొన్ని రోజుల ముందు డైట్ లో కొద్దిగా మార్పులు చేసుకోవాలి. తక్కువ స్పైస్, సోడియం తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.

టిప్ 5

టిప్ 5

డెలివరీకి ముందు మీరు కొన్ని బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ లు కూడా చేయడం మంచిది. దీనివల్ల డెలివరీ సమయంలో నొప్పి తక్కువగా ఉంటుంది. సంకోచాలు తక్కువ పెయిన్ కలిగిస్తాయి.

టిప్ 6

టిప్ 6

మీ డాక్టర్ తో డెలివరీ ఆప్షన్స్ గురించి మాట్లాడాలి. ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, నార్మల్ డెలివరీ అయితే ఎలాంటి జాగ్రత్తలు, సిజేరియన్ అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అడిగి తెలుసుకోవాలి.

టిప్ 7

టిప్ 7

ధ్యానం, యోగా వంటి వాటిని డెలివరీ డేట్ కి కొన్ని వారాల ముందు చేయడం మంచిది. దీనివల్ల నరాలకు మంచిది. ఆందోళన, టెన్షన్ తగ్గుతాయి.

టిప్ 8

టిప్ 8

చివరగా.. మీ భాగస్వామి లేదా మీకు ఇష్టమైన వాళ్లు మీ పక్కనే ఉండేలా జాగ్రత్తపడండి. ఎమోషనల్ సపోర్ట్ చాలా అవసరం.

English summary

Best Tips To Prepare Yourself For Childbirth!

Best Tips To Prepare Yourself For Childbirth. Here are a few expert tips that you can follow to prepare yourself for childbirth!
Desktop Bottom Promotion