For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో వచ్చే సాధారణ చర్మ సమస్యలు..!!

గర్భధారణ సమయంలో సరైన డైట్ ను ఫాలో అవ్వడంతో స్కిన్ కండీషన్ ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సహాయపడుతుంది. ముందుగా గర్భిణీల్లో వచ్చే వివిధ రకాల చర్మ సమస్యల గురించి తెలుసుకుందాం..ఈ సమస్యలు ఏర్పడకుండా ముందు జాగ్రత

|

మహిళ గర్భం పొందిన తర్వాత డెలివరీ అయిందంటే స్త్రీల హార్మోన్లలో గణనీయమైన మార్పులు వస్తాయి. హార్మోన్ల అసమతుల్యత, మొటిమలు, స్ట్రెచ్ మార్కులు, దురద, నల్లటి మచ్చలు మొదలైనవి వస్తూంటాయి

గర్భధారణకు ముందు ఉన్న చర్మ సమస్యలే కాకుండా ప్రెగ్నెన్సీలో వచ్చే చర్మ సమస్యలకు కూడా హార్మోనల్ బ్యాలెన్స్ వల్లే వచ్చేవే. ఇవి శరీరంలో అనేక మార్పులను తీసుకొస్తుంది. హార్మోనుల ప్రభావం చర్మం చర్మ మీద మాత్రమే కాదు, జుట్టు, గోళ్ళ మీద కూడా చూపుతుంది.

గర్భధారణలో హార్మోనుల మార్పుల వల్ల ఇవన్నీ జరుగుతాయి. అయితే ఈ మార్పుల వల్ల పుట్టబోయే బిడ్డ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపవు. తల్లి చర్మంలో వచ్చే మార్పులు లేదా చర్మ సమస్యలు పుట్ట బోయే బిడ్డమీద ఎలాంటి ప్రభావం చూపదు.

గర్భధారణ సమయంలో సరైన డైట్ ను ఫాలో అవ్వడంతో స్కిన్ కండీషన్ ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సహాయపడుతుంది. ముందుగా గర్భిణీల్లో వచ్చే వివిధ రకాల చర్మ సమస్యల గురించి తెలుసుకుందాం..ఈ సమస్యలు ఏర్పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకుందాం..

స్ట్రెచ్ మార్క్స్ :

స్ట్రెచ్ మార్క్స్ :

హార్మోన్ల మార్పు, గణనీయంగా బరువు తగ్గటం వలన ఇవి ఏర్పడతాయి. అయితే మంచి పోషక విలువలు కల ఆహారం తీసుకుంటూ శరీరంపై జాగ్రత్త వహిస్తే వీటిని నివారించవచ్చు. ఆలివ్, జోజోబా, రోస్ మేరీ లేదా ఆల్మండ్ నూనెలతో ప్రతిదినం మర్దన చేసి కూడా ఈ స్ట్రెచ్ మార్కులను సహజంగా తొలగించవచ్చు.

వీర్కోస్ వీన్స్ :

వీర్కోస్ వీన్స్ :

చర్మ మీద లైన్స్ రూపంలో దద్దుర్లు కనబడుతాయి. ఇవి పర్పుల్ కలర్ మరియు బ్లూ కర్లో ఉంటాయి . ముఖ్యంగా ఇవి కాళ్ళ మీద ఎక్కువగా కనబడుతాయి. ఇవి ఎక్స్ ట్రా బ్లడ్ ఫ్లో వల్ల వస్తుంది. ఇది నొప్పి , అసౌకర్యం కలిగిస్తాయి. ఈ సమస్యను నివారించుకోవడానికి విటమిన్ సి అధికంగా ఉండే ఆహారలు తీసుకోవాలి.

మొటిమలు:

మొటిమలు:

కాన్పు తర్వాత మహిళ తన సౌందర్యంపై శ్రధ్ధ చూపదు. అందుకని చర్మంపై మొటిమలు మొదలైనవి వస్తాయి. నివారణకై చర్మం ఆయిల్ లేకుండా పొడిగా వుండేలా చూసుకుంటూ నీరు పుష్కలంగా తాగండి. పచ్చని ఆకు కూరల ఆహారం చర్మ సంరక్షణలో బాగా సహకరిస్తుంది. ఆరోగ్యకర ఆహారం ఈ సమయంలో వచ్చే మనోవ్యధను కూడా దూరం చేస్తుంది.

 చర్మంలో దురద:

చర్మంలో దురద:

ఈస్ట్రోజన్ స్ధాయి తగ్గటం వలన చర్మంపై దద్దుర్లు వస్తాయి. చర్మాన్ని క్రీములు రాయటం ద్వారా తేమగా వుంచండి. రోజుకు రెండు సార్లు ఈ క్రీములు రాస్తే దద్దుర్లు తగ్గుతాయి. చర్మంలో తేమ నిలువచేయటానికిగాను సరళమైన హెర్బల్ సోప్ వాడండి.

డార్క్ స్కిన్ :

డార్క్ స్కిన్ :

గర్భధారణ సమయంలో చర్మం నల్లగా మారడం సహజం. డార్క్ ప్యాచెస్ ఫోర్ హెడ్ మరియు బుగ్గల మీద ఎక్కువగా కనబడుతుంటాయి. అందుకు మన్నికైన సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేస్తే సరిపోతుంది,

డెలివరీ అయిన తర్వాత

డెలివరీ అయిన తర్వాత

డెలివరీ అయిన తర్వాత మహిళలలో ఈ చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. విటమిన్లు, మినరల్స్, ఇతర పోషకాలు కల సంపూర్ణ ఆహారం తీసుకుంటూ, వైద్యుని సలహా మేరకు చిన్నపాటి వ్యాయామాలు చేస్తూ వుంటే మహిళలకు పూర్వపు సౌందర్యం మరోమారు చేకూరుతుందనటంలో సందేహం లేదు.

English summary

Common Skin Problems That Occur In Pregnancy

During pregnancy, a lot of changes may take place in a woman's body. Skin problems are the most obvious changes that happen during pregnancy.
Story first published: Friday, December 9, 2016, 15:32 [IST]
Desktop Bottom Promotion