Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
డేంజర్ : సన్ స్క్రీన్ లోషన్ వాడితే స్పెర్మ్ క్వాలిటీ తగ్గుతుందా...?!
మగవారిలో సంతానం లేకపోవడానికి స్పెర్మ్ కౌంట్ తక్కువగా వుండడం కూడా ఒక కారణం. మగవారిలో సంతాన సాఫల్యత కలగకపోయేందుకు పలు రకాల కారణాలు ఉండవచ్చు. వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండేందుకు, వాటి మొబిలిటీ (చలనం) తక్కువగా ఉండేందుకు లేదా అండాన్ని ఫలదీకరించే శక్తి తక్కువగా ఉండేందుకు ఎన్నో రకాల కారణాలు ఉండవచ్చు.

వీర్యం ఉత్పత్తిలో లేదా పనితీరులో చోటు చేసుకునే అసాధరణత్వాలు, సాధారణ ఆరోగ్యం, జీవనశైలి సంబంధిత అంశాలు, కొన్ని రకాల పరిస్థితులకు ఎక్కువగా లోను కావడం, వాడే నూతన ఉత్పత్తులు ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. చాలా వరకు సమస్యలు వీర్యానికి సంబంధించినవే ఉంటాయి.

రీసెంట్ గా జరిపిన కొన్ని పరిశోధనల్లో పురుషులు సన్ స్క్రీన్ లోషన్ వాడటం వల్ల స్పెర్మ్ క్వాలిటి తగ్గుతుందని కనుగొన్నారు. పురుషులు యూవీ రేస్ నుండి చర్మం రక్షించుకోవడానికి సన్ స్క్రీన్ ను వారి శరీరానికి అప్లై చేయడం వల్ల, లోషన్ లోని కెమికల్స్ శరీరంలోనికి ఇంకి అవి రక్తంలో శరీరభాగాలన్నింటికి వ్యాప్తి చెండంతో స్పెర్మ్ మీద ప్రభావం చూపుతుందని కనుగొన్నారు.

కానీ అన్ని రకాల సన్ స్క్రీన్ లోషన్ బ్రాండ్ ఇలా ఉండవు, కొన్ని ప్రత్యేకమైన లోషన్స్ లో మాత్రమే కెమికల్స్ పురుషుల స్పెర్మ్ మీద ప్రభావం చూపుతుంది. కెమికల్స్ తో నిండిన రక్తం పునరుత్పత్తి అవయావాలకు చేరడం వల్ల ఆ ప్రదేశంలో నీరు చేరుతుంది.
సన్ స్క్రీన్ లో ఉపయోగించే కొన్ని ప్రత్యేకమైన కెమికల్స్ సంతానానికి సహాయపడే స్పెర్మ్ సెల్స్ , ఎగ్స్ మీద ప్రభావం చూపుతుంది. ఇది నమ్మశక్యం కాకపోయినా...చాలా మంది పురుషులు సంతానలేమితో డాక్టర్లను కలిసినప్పుడు ఇటువంటి ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి . కాబట్టి, పిల్లలకోసం ప్రయత్నించే వారు, ఆ పర్టిక్యులర్ సమయంలో సన్ స్క్రీన్ లోషన్స్ కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

కొన్ని రకాల బ్రాండ్ సన్ స్క్రీన్ లోషన్ లేబుల్స్ మీద కొన్ని సూచనలు కూడా ప్రింట్ చేయబడి ఉంటాయి. ఇవి హానికంగిస్తాయని డాక్టర్లు కూడా సూచిస్తున్నారు.

కాబట్టి, సంతానలేమితో బాధపడేవారు, పిల్లలకోసం ప్రయత్నించే వారి కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ ను ఎంపిక చేసుకోవాలి. కెమికల్స్ ఉన్న సన్ స్క్రీన్ లోషన్స్ కు దూరంగా ఉండాలి. అప్పుడు పునరుత్పత్తి వ్యవస్థలోని సమస్యలను తగ్గించే అవకాశాలున్నాయి. హెల్తీ స్పెర్మ్ ను విడుదల చేయడానికి సహాయపడుతాయి.



Click it and Unblock the Notifications