For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలు మొదటి 3నెలలు ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు..!

By Swathi
|

గర్భం పొందిన తర్వాత.. మొదటి మూడు నెలలు చాలా కీలకం. అలాగే ఈ మూడునెలల్లో బేబీ ముఖ్యమైన అవయవాలు డెవలప్ అవుతాయి. అలాగే బేబీలో అనేక శారీరక మార్పులు జరుగుతాయి. కాబట్టి.. మొదటి మూడునెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఈ సమయంలో ఎక్కువ అబార్షన్లు అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి.. మొటిటి మూడునెలలో బేబీ ఆరోగ్యం, మీ ఆరోగ్యం చాలా బాగుండాలి. ముఖ్యంగా మీరు మానసికంగా, శారీరకంగా.. చాలా హెల్తీగా ఉండటం అవసరం.

ఎంతో కీలకమైన మొదటి మూడునెలల గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు, చేయకూడని పనులు ఏంటో ఇవాళ తెలుసుకుందాం..

ఫుడ్

ఫుడ్

మొదటి మూడునెలల్లో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తృణధాన్యాలు, పప్పులు, చిక్కుళ్లు, నట్స్ ని ఖచ్చితంగా డైట్ లో చేర్చుకోవాలి. నాన్ వెజిటేరియన్ అయితే.. మాంసం, చేపలు, చికెన్, ఫిష్ కంపల్సరీ తీసుకోవడం వల్ల ప్రొటీన్ పెరుగుతుంది. అలాగే ఫైబర్ ఉండే ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకోవాలి.

క్యాల్షియం

క్యాల్షియం

క్యాల్షియం సప్లిమెంట్స్ వాడటమే కాకుండా.. క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల కడుపులోని బిడ్డకు నరాలు, కండరాలు, పండ్లు, ఎముకలు డెవలప్ అవడానికి సహాయపడతాయి. అలాగే గర్భిణీలకు బీపీ రాకుండా అరికడుతుంది. ప్రతిరోజూ 600ఎమ్ఎల్ మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకోవాలి.

విటమిన్ డి

విటమిన్ డి

ఎగ్, హెర్రింగ్ చేప, సార్డీన్స్, ట్యూనా, సాల్మన్, పాలు, ఫిష్ లివర్ ఆయిల్ ని డైట్ లో చేర్చుకోవాలి. అలాగే సూర్యరశ్మి తగిలేలా జాగ్రత్తపడాలి.

ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్

ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్

బేబీ బ్రెయిన్ డెవలప్ మెంట్, నరాలు, కళ్లకి ఫ్యాటీ త్రీ యాసిడ్స్ చాలా ముఖ్యం. ఫ్లాక్స్ సీడ్స్, చేపలు తీసుకుంటే.. ఫ్యాటీ త్రీ యాసిడ్స్ పొందవచ్చు.

ఐరన్, ఫోలిక్ యాసిడ్

ఐరన్, ఫోలిక్ యాసిడ్

గర్భధారణకు ముందు, గర్భం పొందిన మొదటి మూడు నెలలు ఫోలిక్ యాసిడ్ చాలా ముఖ్యం. ఇవి శిశువు వెన్నెముక, నరాలు ఏర్పడటానికి, బ్లడ్ సెల్స్ డెవలప్ మెంట్ కి ఫోలిక్ యాసిడ్ ముఖ్యం. ఆకుకూరలు, సన్ ఫ్లవర్ సీడ్స్, వేరుశనగలు, స్ప్రౌట్స్, బీన్స్, సోయాబీన్ ద్వారా న్యాచురల్ గా ఫోలిక్ యాసిడ్ పొందవచ్చు.

తరచుగా ఆహారం

తరచుగా ఆహారం

హార్మోనల్, శారీరక మార్పుల వల్ల ఆహారం చాలా నెమ్మదిగా జీర్ణం అవుతుంది. కాబట్టి ప్రతి రెండూ మూడు గంటలకు ఒకసారి ఆహారం తీసుకుంటూ ఉండాలి. దీనివల్ల వికారం, ఎసిడిటీ, బ్లోటెడ్ ఫీలింగ్ తగ్గించుకోవచ్చు.

హెల్తీ వెయిట్

హెల్తీ వెయిట్

ప్రెగ్నన్సీ టైంలో మీరు ఖచ్చితంగా బరువు పెరుగుతారు. అయితే మీ బీఎమ్ఐ ని బట్టి వెయిట్ పెరుగుతారు. అయితే పొట్టలో బేబీ.. 0.5 నుంచి 2 కేజీలు పెరుగుతారు.

రెగ్యులర్ ఎక్సర్ సైజ్

రెగ్యులర్ ఎక్సర్ సైజ్

ప్రెగ్నన్సీ టైంలో రెగ్యులర్ గా వ్యాయామం చేసే మహిళలకు సిజేరియన్ జరగదు. అయితే మీ డాక్టర్ ని సంప్రదించి.. వాళ్లు సూచించిన వ్యాయామాలు చేయడం మంచిది.

చెక్ అప్స్

చెక్ అప్స్

రెగ్యులర్ చెక్ అప్స్ ని మిస్ చేయకండి. దీనివల్ల ఏదైనా సమస్య వచ్చినా మొదట్లోనే గుర్తిస్తారు. అలాగే బ్లడ్ టెస్ట్ లు, స్కానింగ్ లు కంపల్సరీ చేయించుకోవాలి.

ఫ్లూయిడ్స్

ఫ్లూయిడ్స్

ప్రెగ్నన్సీ టైంలో బ్లడ్ పెరగాలి. దీనివల్ల బేబీకి ఆక్సిజన్, పోషకాలు సక్రమంగా అందుతాయి. కాబట్టి డీహైడ్రేషన్, కాన్ట్సిపేషన్ సమస్యలు రాకుండా.. ఎక్కువ నీళ్లు తాగాలి. అలాగే చల్లటి నీళ్లు తాగితే.. వాంతులు, వికారం నుంచి రిలీఫ్ ఇస్తాయి.

బాగా నిద్రపోవడం

బాగా నిద్రపోవడం

చాలామంది గర్భిణీలు.. మొదటి మూడునెలలు వికారం, వాంతులు, అలసట వంటి సమస్యలు ఫేస్ చేస్తారు. కాబట్టి ఎంత వీలైతే.. అంతసేపు నిద్రపోతూ ఉండాలి.

మెడిసిన్స్

మెడిసిన్స్

మొదటి మూడు నెలలు మెడిసిన్స్ ఎక్కువగా వేసుకోకూడదు. మెడిసిన్స్ వేసుకుంటే.. శరీరంలోని బ్లడ్ ద్వారా ప్లేసాంటాలోకి వెళ్తుంది. కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మెడిసిన్స్ వాడకూడదు.

ఫుడ్ విషయంలో

ఫుడ్ విషయంలో

పచ్చి మాంసం, పచ్చి ఎగ్స్, చీజ్, సీఫుడ్ వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. వీటిల్లో హానికర బ్యాక్టీరియా ఫుడ్ పాయిజింగ్ కి కారణమవుతుంది. దీనివల్ల కడుపులోని బేబీకి హాని జరుగుతుంది.

పొల్యూషన్

పొల్యూషన్

పొల్యూషన్ లో ఎక్కువ తిరగకూడదు. ఇంట్లో క్లీనింగ్ ప్రొడక్ట్స్, పెయింట్స్, హానికర మలినాలకు ఎక్స్ పోజ్ అవకుండా జాగ్రత్త పడాలి. వెజిటబుల్స్, ఫ్రూట్స్ ని బాగా శుభ్రం చేసుకుని తీసుకోవాలి.

స్మోకింగ్

స్మోకింగ్

స్మోకింగ్ చేయడం వల్ల అందులోని కెమికల్స్ గర్భర్థ శిశువుపై దుష్ర్పభావం చూపుతాయి. దీనివల్ల అబార్షన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి.. స్మోకింగ్ మానేయాలి.

ఆల్కహాల్

ఆల్కహాల్

ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల బేబీలో మానసిన, శారీరక డెవలప్ మెంట్ పై ప్రభావం చూపుతుంది. దీన్ని ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ అంటారు. కాబట్టి గర్భం పొందడానికి ముందే.. ఆల్కహాల్ తీసుకోవడం మానేయాలి.

ఒత్తిడి

ఒత్తిడి

తీవ్ర ఒత్తిడికి గురైతే.. కడుపులోని శిశువు ఆరోగ్యంపై దుష్ర్పభావం చూపి.. అబార్షన్ కి కారణమవుతుంది. ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు.. బేబీకి ఆక్సిజన్ అందకుండా అడ్డుకుంటాయి.

డైటింగ్

డైటింగ్

ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్స్, మినరల్స్ సరైన మోతాదులో పొందకపోతే.. బేబీకి చాలా హానికరం. కాబట్టి.. బరువు తగ్గాలని ఎలాంటి డైట్ రూల్స్ పెట్టుకోకుండా.. డాక్టర్ సూచించినట్టు ఫుడ్ తీసుకోవాలి.

హాట్ బాత్

హాట్ బాత్

హాట్ బాత్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇవి.. అబార్షన్లకు కారణమవుతాయి. బాడీ టెంపరేచర్ పెంచి.. డీహైడ్రేషన్ కి కారణమవుతాయి.

English summary

First trimester dos and don’ts for you to follow!

First trimester dos and don’ts for you to follow. The first three months of your pregnancy is very crucial. Here is what you need to do during the first three months of your pregnancy.
Story first published: Thursday, September 29, 2016, 16:11 [IST]
Desktop Bottom Promotion