For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తరచూ గర్భశ్రావాలు జరుగుతుంటే..?ఎఫెక్టివ్ హోం రెమెడీస్..

By Super Admin
|

గర్భం పొందడం ఒక గొప్ప వరం. గొప్ప అవకాశం అని డాక్టర్స్ చెబుతుంటారు.కానీ, మొదటసారి గర్భం పొందినప్పటి నుండి గర్భస్రావం జరుగుతూనే ఉంటే , అప్పుడు శరీరంలో మనకు తెలియని సమస్యలేమిటో జరుగుతున్నట్లు గుర్తించి, వెంటనే పరిష్కరించుకోవాలి.

అయితే, కొన్ని సందర్భాల్లో గర్భస్రావం జరగడమనేది సహజమైనదే అయితే అందుకు కొన్ని సింపుల్ హోం రెమెడీస్ లేదా సింపుల్ పిల్స్ లేదా హెర్బ్స్ ట్రీట్ చేస్తాయి.

గర్భస్రావానికి వివిధ రకాల కారణాలున్నాయి, కొన్ని గర్భస్రావాలు, హార్మోనుల అసమతుల్యత వల్ల , మరొకన్ని యూట్రస్ వీక్ గా ఉండటం వల్ల జరుగుతాయి. చాలా వరకూ గర్భస్రావాలు బ్లడ్ క్లాట్స్ ఏర్పడటం మరియు వ్యాధినిరోధక సమస్యల వల్ల కూడా జరగుతుంటాయి.

ఇటువంటి పరిస్థితిలో , గర్భాశయంలో పిండం ఏర్పడే వరకు బాగనే ఉన్నా, తర్వాత గర్భస్రావాలు జరగుతుంటాయి.గర్భస్రావాలకు కారణమేదైనా, ఈ సమస్యను నివారించుకోవడం చాలా అవసరం . గర్భం పొందడానికంటే ముందే జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తర్వాత ప్రెగ్నెన్సీలో గర్భ స్రావం జరగకుండా నివారించుకోవచ్చు.

అందుకోసం కొన్ని సింపుల్ టిప్స్ మరియు బెస్ట్ హోం రెమెడీస్ ఉన్నాయి.వీటిని అనుసరించినట్లైతే గర్భస్రావం జరగకుండా ఉంటుంది . మరి ఆ హోం రెమెడీస్ అండ్ టిప్స్ ఏంటో తెలుసుకుందాం...

ప్రొజెస్ట్రొనో సప్లిమెంట్(ప్రెగ్నెన్సీ హార్మోన్)తీసుకోవాలి:

ప్రొజెస్ట్రొనో సప్లిమెంట్(ప్రెగ్నెన్సీ హార్మోన్)తీసుకోవాలి:

గర్భస్రావం జరగడానికి ఒక ముఖ్యకారణం గర్భధారణకు సరిపడే ప్రొజెస్ట్రోన్ హార్మోన్ తక్కువగా ఉండటం వల్ల. ఈ సప్లిమెంట్ తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమై ప్రెగ్నెన్సీ, మరియు యుటేరియన్ లైన్ మందంగా హెల్తీగా ఉంటుంది. ప్రొజెస్ట్రాన్ బ్లడ్ క్లాట్స్ ఏర్పడకుండా నివారిస్తుంది . మరియు ఇతర ఇమ్యూన్ రిలేటెడ్ సమస్యలు లేకుండా చేసి గర్భస్రావం జరగకుండా కాపాడుతుంది.

మక:

మక:

ఈ ఆహారపదార్థం థైరాయిడ్ గ్రంథులతో సహా ఎండోక్రైన్ గ్రంథులకు తగిన పోషణ అందిస్తుంది. దాంతో ప్రెగ్నెన్సీ హార్మోనులు క్రమబద్దం అవుతాయి. ఇది ప్రెగ్నెన్సీ టానిక్ గా పనిచేస్తుంది. ఇంకా ఇది శరీరంలో ఈస్ట్రోజన్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. గర్భదారణ సమయంలో ఈస్ట్రోజన్ లెవల్స్ మెయింటైన్ చేయకపోతే, గర్భస్రావానికి కారణమవుతుంది. ప్రొజెస్ట్రాన్ హార్మోన్ లెవల్స్ పెంచడంలో మాక సహాయపడుతుంది. దాంతో ఆరోగ్యకరమైన గర్భాన్ని పొందవచ్చు.

విటెక్స్ :

విటెక్స్ :

లోప్రొజెస్ట్రాన్ వల్ల జరిగే గర్భస్రావాన్ని నివారిస్తుంది . అయితే ఈ హెర్బ్స్ ను మీరు గర్భం పొందడానికి 3 నెలల ముందు నుండి తీసుకోవాలి. ఈ మూలిక గర్భధారణ కాలాన్ని విజయవంతం ముగించడానికి సహాయపడుతుంది.

ప్రీనేటల్ విటమిన్స్:

ప్రీనేటల్ విటమిన్స్:

గర్భం పొందడానికి 3 నెలల ముందు నుండే మల్టి విటమిన్ సప్లిమెంట్ ను తీసుకోవాలి. ఇది గర్భస్రావం జరగడాన్ని తగ్గిస్తుంది, ఎగ్ క్వాలిటి పెంచుతుంది. ప్రీనేటల్ సప్లిమెంట్ లో విటమిన్ బి6, బి12 మరియు ఫోలిక్ యాసిడ్, జింక్, మరియు ఇతర మినిరల్స్ ఉన్నాయి.

క్రాన్ బెర్రీ:

క్రాన్ బెర్రీ:

క్రాన్ బెర్రీ మజిల్స్ ను రిలాక్స్ చేస్తుంది. యూట్రస్ సమస్యలను తగ్గిస్తుంది. గర్భస్రావం జరిగే స్త్రీలు క్రాన్ బెర్రీని రెగ్యులర్ గా తీసుకోవడం మంచిది.

పార్ట్రిడ్జ్ బెర్రీ:

పార్ట్రిడ్జ్ బెర్రీ:

బలహీనంగా ఉండే యూట్రస్ ను స్ట్రాంగ్ గా మార్చుతుంది, యూట్రస్ కు ఇది మంచి టానిక్ వంటింది. గర్భస్రావం నివారించడంలో ఇది ఒక ఏజ్ ఓల్డ్ రెమెడీ . మరియు గర్భధారణలో తీసుకోవడం కూడా సురక్షితమైనదే . గర్భిణీలు తినడం వల్ల నొప్పి, క్రాంపింగ్, మరియు బ్లీడింగ్ వంటి సమస్యలుండవు.

ఓట్స్ ఫ్లవర్స్ :

ఓట్స్ ఫ్లవర్స్ :

ఇది ఒత్తిడి తగ్గిస్తుంది, దాంతో ఫెర్టిలిటి పెరుగుతుంది మరియు గర్భస్రావం జరగకుండా నివారిస్తుంది. ఎక్కువ స్ట్రెస్ లో ఉన్న వారికి ఇది ఒక బెస్ట్ రెమెడీ . గర్భధారణ కాలం మొత్తం దీన్ని తీసుకోవచ్చు.గర్భస్రావం నివారించడానికి ఒది ఒక బెస్ట్ హోంరెమెడీ.

బెడ్ రెస్ట్ మరియు ఒత్తిడి తగ్గించుకోవాలి:

బెడ్ రెస్ట్ మరియు ఒత్తిడి తగ్గించుకోవాలి:

గర్భం పొందిన తర్వాత శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. గర్భస్రావానికి కారణమయ్యే స్ట్రెస్ హార్మోనులను తగ్గించుకోవడానికి బెడ్ రెస్ట్ చాలా అవసరం.

English summary

Have You Tried These Remedies For Your Frequent Miscarriages?

Most doctors say that pregnancy is a matter of chance. But, if you are having frequent miscarriages then there might be some issues with your body that you may have to rectify.
Story first published:Thursday, June 30, 2016, 13:03 [IST]
Desktop Bottom Promotion