For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో బిపిని కంట్రోల్ చేసే హోం రెమెడీస్

By Super
|

గర్భధారణ సమయంలో బిపిని కంట్రోల్ చేసే హోం రెమెడీస్

హైబ్లడ్ ప్రెజర్ మదర్ తో పాటు కడుపులో పెరిగే శిశువు కు కూడా ప్రమాధం. గర్భధారణ సమయంలో ప్రెజర్ కంట్రోల్లో ఉంచుకోవడం చాలా అవసరం. బిపి 140/90mm Hgకి చేరుతుందో, అప్పుడు ప్రెగ్నెన్సీలో వివిధ రకాల సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది . ఈ బ్లడ్ ప్రెజర్ గర్భాధారణ సమయంలో 20 వారాల్లోపు క్రమబద్దం కాకపోతే పరిస్థితి ప్రీఎక్లప్సియా డెవలప్ అవుతుంది . అంటే అది టాక్సీమియా మరియు హైపర్ టెన్షన్ కు దారితీస్తుంది . ఇది చాలా సీరియస్ కండీషన్. వెంటనే చికిత్స అందివ్వకపోతే బ్రెయిన్, కిడ్నీ మరియు శరీరంలో ఒక్కో అవయవం డ్యామేజ్ అయే పరిస్థితి ఏర్పడుతుంది.

హైబ్లడ్ ప్రెజర్ ప్రిఎక్లీప్సియాకు దారితీస్తుంది , అప్పుడు యూరిన్ లో ప్రోటీన్ కోల్పోవడం, పాదాలు, చేతుల్లో అనుకోకుండా వాపులు రావడం మరియు తరచూ తలనొప్పి బాధిస్తుంటుంది. అంతే కాదు, ఈ లక్షణాలు బేబీ గ్రోత్ మీద కూడా ప్రభావం చూపుతుంది . ఫలితంగా తక్కువ బరువున్న పిల్లలు పుడుతారు .

అందువల్ల, సాధ్యమైనంత వరకూ గర్భిణీలు హైబ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్లో ఉంచుకోవడం చాలా మంచిది . బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను కంట్రోల్ చేసుకోవడానికి మందులను సూచిస్తుంటారు, అలాంటప్పుడు వీటిని మిస్ చేయకుండా వేసుకోవాలి. అదే విధంగా హోం రెమెడీస్ ను కూడా డాక్టర్లు సూచించినప్పుడు , అందుకు కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి . గర్భాధారణ సమయంలో ఇవి హైబ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తాయి . మరి ఆ హోం రెమెడీస్ ఏంటో చూద్దాం...

ఉప్పు:

ఉప్పు:

గర్భధారణ సమయంలో ఎక్కువగా ఉప్పు తినడం మంచిది కాదు. హైబ్లడ ప్రెజర్ తో బాధపడే వారు కేవలం 3గ్రాముల మాత్రమే తీసుకోవాలి .

ద్రవాలు :

ద్రవాలు :

ప్రెగ్నెన్సీ సమయంలో చాలా వరకూ ఎక్కువఫ్లూయిడ్స్ ను తీసుకోవాలి . ఈ ఫర్ఫెక్ట్ హ్యాబిట్ వల్ల హైబ్లడ్ ప్రెజర్ తగ్గించుకోవచ్చు . ఫ్రూట్ జ్యూసులు మరియు వెజిటేబుల్ జ్యూసులు తీసుకోవడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. సాల్ట్ మరియు షుగర్స్ వాడకూడదు.

హెల్తీ డైట్ ను అనుసరించాలి:

హెల్తీ డైట్ ను అనుసరించాలి:

మీరు ఆరోగ్యకరమైనవి తీసుకొనేటప్పుడు , కడుపులో పెరుగుతున్న శిశువుకు కోసం మరింత ఆరోగ్యకరమైన ఆహారాలను ఎంపిక చేసుకోవాలి. ఆల్ఫా-లినోలినిక్ యాసిడ్ వంటివి సోయాబీన్, వాల్ నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ మరియు డార్క్ గ్రీన్ వెజిటేబుల్స్ మరియు ఆకుకూరల్లో ఎక్కువగా లభిస్తుంది. ఎలాంటి మందులూ లేకుండా మీ డైలీ డైట్ లో ఇలాంటి ఫుడ్స్ ను చేర్చడం వల్ల మీ బ్లడ్ ప్రెజర్ ను నేచురల్ గా కంట్రలో చేసుకోవచ్చు.

ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పెంచాలి:

ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పెంచాలి:

గర్భిణీ స్త్రీలకు ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ హైబ్లడ్ ప్రెజర్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి . ఆహారాలు, కోడ్ లివర్ ఆయిల్ , వాల్ నట్స్, టోఫు, సార్డిన్స్ మొదలగు వాటిలో ఓమేగా ఎక్కువగా ఉండటం వల్ల వీటిని ఎక్కువగా ఎంపిక చేసుకోవాలి.

నేచురల్ సప్లిమెంట్ :

నేచురల్ సప్లిమెంట్ :

హై బిపి తగ్గించడానికి నేచురల్ సప్లిమెంట్ కూడా గ్రేట్ గా సహాయపడుతుంది . ఇది హైబ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది . కోకాల హైబిపి తగ్గించడలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఎందుకంటే వీటిలో ఫ్లెవనాయిడ్స్ అధికంగా ఉండటం వల్ల శరీరంలో నైట్రిక్ యాసిడ్స్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది , ఇది బ్రెయిన్ కు బ్లడ్ చేరవేస్తుంది మరియు శరీరానికి విశ్రాంతిని అందిస్తుంది . బ్లడ్ ప్రెజర్ ను క్రమబద్దం చేస్తుంది.

హెర్బ్స్ ఎక్కువగా తీసుకోవాలి:

హెర్బ్స్ ఎక్కువగా తీసుకోవాలి:

మీకు తెలుసా కొన్ని హెర్బ్స్ హైబ్లడ్ ప్రెజర్ ను వండర్ ఫుల్ గా కంట్రోల్ చేస్తాయి ? వెల్లుల్లి రక్తనాళాల్లోని, హార్ట్ రిథమ్ ను మార్చుతుంది మరియు పల్స్ రేట్ తగ్గుతుంది. దాంతో హైబిపి కంట్రోల్ అవుతుంది.

వాక్ వెల్లాలి:

వాక్ వెల్లాలి:

రెగ్యులర్ గా చిన్న పాటి వాకింగ్ చేయడం వల్ల ఇలాంటి హెల్త్ సమస్యలు పరిష్కరింపబడుతాయి. నడిచేటప్పుడు కూడా డీప్ గా శ్వాస తీసుకోవాలి. ఎప్పుడూ పాజిటివ్ గా ఉండటం వల్ల బిపి కంట్రోల్ అవుతుంది.

పెట్స్ ను పెంచుకోవడం :

పెట్స్ ను పెంచుకోవడం :

పెట్స్ ను పెంచుకోవడం వల్ల మైండ్ డైవర్ట్ అవుతుంది . స్ట్రెస్ మరియు టెన్షన్స్ తగ్గుతాయి.

English summary

Home Remedies To Control Blood Pressure During Pregnancy

High blood pressure is dangerous for the foetus as well as for the mother. When pregnant, your pressure needs to be in control. When the BP shoots up above 140/90 mm Hg, it can cause multiple problems in pregnancy. If the pressure does not regulate and come down to normalcy within 20 weeks of pregnancy, a condition known as pre-eclampsia can develop, which is known as toxaemia and pregnancy-induced hypertension.
Story first published:Thursday, March 17, 2016, 10:43 [IST]
Desktop Bottom Promotion