For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ కాలంలో క్యాబేజ్ తినడం వల్ల పొందే ప్రయోజనాలు

By Super Admin
|

గర్భధారణ మహిళకు అతి ముఖ్యమైన ఘట్టం అని అందురూ చెబుతారు. పెళ్లైన తర్వాత ప్రతి మహిళ కోరుకునేది గర్భధారణ , తల్లి అవ్వడం. ఈ అనుభూతి చాలా మదురమైనదని, చాలా విలువైనదని, తల్లి అవ్వడం స్త్రీకి వరం, పరిపూర్ణత అని చెబుతుంటారు. గర్భం పొందిన తర్వాత తల్లి ఆహార విషయంలో చాలా అనుమానాలుంటాయి. ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి, బిడ్డకు సురక్షితమైన ఆహారాలేంటి అని కొత్తగా తల్లైన వారు ఆందోళన చెందుతుంటారు .

కాబట్టి, గర్భం పొందిన తర్వాత, గర్భం పొందడానికి ముందు, ప్లానింగ్ లో ఉన్నవారు హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ గురించి ఆలోచించాలి. అనేక రకాల గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో క్యాబేజ్ ఒకటి. క్యాబేజ్ గర్భిణీలు తినడం సురక్షితమా....?

క్యాబేజ్ ను బ్రాసికా ఒలెరాసియ అనిపిలుస్తారు. వివిధ రకాలుగా లభించే గ్రీన్ వెజిటేబుల్, క్రూసిఫెరస్ కుంటుంబానికి చెందినది. ఈ కుటుంబంలో ఇంకా బ్రొకోలీ, బ్రసెల్స్, కాలీఫ్లవర్ మొదలగునవి ఉన్నాయి. ఇది మల్టీ లేయర్డ్ వెజిటేబుల్. ఈ వెజిటేబుల్ కు ఆకులు చాలా లేయర్స్ గా ఉంటాయి. ఈ గ్రీన్ వెజిటేబుల్ ను ప్రపంచం మొత్తంలో దాదాపు అన్ని దేశాల్లోనూ పండిస్తారు.

క్యాబేజ్ కు కాస్త డిమాండ్ ఎక్కువే, ఎందుకంటే చైనా, జపాన్ వంటి దేశాల్లో ప్రతి ఒక్క వంటలోనూ, గార్నిష్ గా వీటిని ఎక్కువగా జోడిస్తుంటారు. మన ఇండియాలోకూడా బాగా ప్రాచుర్యం పొందినది. అయితే ఇటువంటి గ్రీన్ లీఫీ వెజిటేబుల్ సాధారణ వ్యక్తులు కాకుండా గర్భిణీలు తినడం సురక్షితమా కాదా అన్నదే మీ సందేహమా....

క్యాబేజ్ ను సరైన పద్దతిలో వండి తినడం సురక్షితమే. పచ్చిగా తినడం సురక్షితం కాదు, అలా తినడం వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కు కారణమవుతుంది. అలాగే వీటిని పండించడానికి ఉపయోగించే క్రిమి సంహారణులు, గర్భిణీలో ఫంగల్ మరియు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కు దారిస్తుంది. అందువల్ల , ఆర్గానిక్ క్యాబేజ్ ను ఎంపిక చేసుకోవాలి.గర్భిణీలు క్యాబేజ్ తినడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు. ఇందులో విటమిన్ కె, సి, బి6, బి1, బి3 , మ్యాంగనీస్, ఫొల్లెట్, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, ప్రోటీన్ లు వంటి న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి.

గర్భిణీలు క్యాబేజ్ తినడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు,

How Safe Is It To Eat Cabbage In Pregnancy

1. జీర్ణశక్తి పెంచుతుంది: క్యాబేజ్ తినడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ ఆరోగ్యంగా ఉంటుంది.ఇది జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది మరియు మలబద్దకం, ఇర్రెగ్యులర్ బౌల్ మూమెంట్ ను క్రమబద్దం చేస్తుంది. మలబద్దక సమస్యను కంట్రోల్ చేయడం వల్ల క్యాబేజ్ గొప్పగా సహాయపడుతుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.

How Safe Is It To Eat Cabbage In Pregnancy

2. డిఎన్ ఎ హెల్త్ : క్యాబే.జ్ లో ఫొల్లెట్ అదికంగా ఉండటం వల్ల ఫీటస్ యొక్క డిఎన్ ఎ హెల్త్ కు అత్యంత అవసరం, డిఎన్ఎ హెల్త్ ను ప్రోత్సహిస్తుంది.

How Safe Is It To Eat Cabbage In Pregnancy

3. తక్కువ క్యాలరీలు: క్యాబేజ్ లో క్యాలరీలు తక్కువ, దాంతో గర్భధారణలో బరువు ను కంట్రోల్ చేయవచ్చు. అయితే మినిమమ్ వెయిట్ పెరగాలని కోరుకునే వారు రెగ్యులర్ డైట్ లో క్యాబేజ్ చేర్చుకోవచ్చు. అలాగే క్యాబే.జ్ సూప్,జ్యూస్ కూడా తీసుకోవచ్చు.

How Safe Is It To Eat Cabbage In Pregnancy

4 జస్టేషనల్ డయాబెటిస్ ను నివారించుకోవచ్చు: గర్భధారణ సమయంలో జస్టేషనల్ డయాబెటిస్ సహజం, అందువల్ల ఎక్కువ ఫైబర్ ఉండే క్యాబేజ్ ను రెగ్యులర్ డైట్ లోచేర్చుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్, బ్లడ్ షుగర్స్ అండర్ కంట్రోల్లో ఉంటాయి.

How Safe Is It To Eat Cabbage In Pregnancy

5.యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఎక్కువ: బ్రైట్ పర్పుల్ కలర్ క్యాబేజ్ లో యాంథోసైనిన్స్ కంటెంట్ అదికంగా ఉంటుంది, ఇవి క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడుతాయని , రీసెంట్ స్టడీస్ లో నిర్ధారించారు.,

How Safe Is It To Eat Cabbage In Pregnancy

6: వాపులను తగ్గిస్తుంది: క్యాబేజ్ ఆకులలో ఉండే కొన్ని గుణాలు, ప్రెగ్నెన్సీలో కాళ్ళ, చేతులు, ముఖం వాపులు తగ్గుతుంది. కాళ్ళకు చుట్టూ క్యాబేజ్ ఆకులను చుట్టుడం వల్ల వాపులు క్రమంగా తగ్గుతాయి.

సూచన: క్యాబేజ్, బ్రొకోలీ, వంటి గ్నీన్ ఫుడ్స్ అలర్జీలకు గురైతే వెంటనే డాక్టర్ ను కన్సల్ట్ అవ్వాలి. లేదా ముందుగానే డాక్టర్ కలిసి తినాలో వద్దో తెలుసుకుని తర్వాత తినడం తల్లి బిడ్డకు ఉత్తమం.

English summary

How Safe Is It To Eat Cabbage In Pregnancy

There are myriad benefits of including cabbage in pregnancy. Cabbage aids in the digestion process, prevents gestational diabetes, promotes eye health and also prevents swelling of the feet. The fibre content in it limits the risk of constipation, which is highly common during pregnancy.
Story first published:Wednesday, October 12, 2016, 18:27 [IST]
Desktop Bottom Promotion