For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణీ యోగా చేయడం సురక్షితమేనా...

|

కొత్తగా తల్లి కాబోయే యువతుల్లో హార్మోన్ల మార్పుల వల్ల మానసిక సమస్యలు రావడం సాధారణం. అయితే వీటికి చికత్సచేయకుండా వదిలేయడం వల్ల తల్లీ బిడ్డలకు హాని చేకూరే అవకాశాలు ఎక్కువ. పైగా ఇలాంటి మహిళల్లో తల్లీ బిడ్డలు బరువు కోల్పోవడం, ప్రీఎంక్లాంప్సియా, నెలలు నిండకముందే కాన్సు కావడం వంటివి సంభవించవచ్చు. అలా జరగకుండా ఉండేదుకు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో యోగాసనాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇతర ఏ శారీరక వ్యాయామాలు ఇవ్వనంత ఆరోగ్యాన్ని , ఉల్లాసాన్ని ఆసనాలు వేయడం ద్వారా పొందవచ్చు. ఆత్మజ్ఞాన వికాసానికి, మనిషిలో నిగూఢంగా దాగివున్న శక్తిని ప్రజ్వలితం చేసే మహత్తర శక్తి యోగాలో ఉంది. ఇంతటి ప్రాధాన్యత గల యోగాసనాలను గర్భిణీలు ఆచరించడం ద్వారా సహజ ప్రసవం జరిగి, తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఇతర పిల్లలతో పోల్చితే చాలా ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంటారన్న విషయం శాస్త్రీయాధారాలతో నిరూపితమైంది.

Is it Safe to do Prenatal Yoga during Pregnancy

సాధారణంగా మనలో చాలా మందికి ఉండే అభిప్రాయమేమంటే, గర్భం దాల్చిన తర్వాత ఏ పని చేయకూడదు. విశ్రాంతిగా ఉండాలి అని. ఈ విధమైన అపోహతో సరైన వ్యాయామం చేయకపోవటం ద్వారా చాలావరకు సహజ ప్రసవాలు తగ్గిపోయాయి. కారణం, శరీరాన్ని కొన్ని భంగిమలలో మాత్రమే ఉంచటం ద్వారా కండరాల పటుత్వం పెరగకపోవడం, బిడ్డ ఎదుగుదలకు అనువుగా మార్పులు చెందకపోవడం వల్ల అనేకమైన సమస్యలు ఏర్పడి ప్రస వం సమయంలో ఆపరేషన్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడు తుంది. గర్భిణీలు ప్రత్యే కమైనటువంటి వ్యాయామాలు, యోగ సాధనలు చేసినట్లయితే, సీజెరియన్‌ బాధ లేకుండా సహజ ప్రసవం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రత్యేకమైన వ్యాయామాలు, ప్రాణాయామాలు, వజ్రాసనం ఇలా కొన్ని సులభమైన ఆసనాలు వేయాడం ద్వారా అంతే కాదు తల్లి గర్భంలో ఉన్న బిడ్డకు అన్ని అవయవాలు సక్రమంగా పెరుగుతాయి, బిడ్డ చాలా యాక్టీవ్‌గా ఉంటాడు. ''విజనరీ ప్రెగ్నెంట్‌'' ద్వారా ఆరోగ్యకరమైన, అందమైన, చురుకైన బిడ్డను తల్లిదండ్రులు పొందవచ్చు.

Is it Safe to do Prenatal Yoga during Pregnancy

గర్భిణీ స్త్రీలు చేయవలసిన వ్యాయామాలు
1. గర్భిణి శరీరంలో అనేక విధాల హార్మోనల్‌ మార్పులు జరుగుతుంటాయి. హార్మోన్స్‌ మధ్య అసమతుల్యత ఏర్పడుతూ ఉంటుంది. ఇటువంటి సమయంలో శారీరక వ్యాయామాలు గర్భిణీకు చాలా ఉపయోగపడుతాయి.
2. గర్భిణీలు డెలివరీ సమయంలో ప్రసవ వేదనను భరించలేక సిజేరియన్‌ వైపు మొగ్గు చూపిస్తారు. కాని సహజ ప్రసవానికి అనుకూలంగా అవసరమైన కండరాలను బలపరచడంలో గర్భిణీ స్త్రీలకు వ్యాయామం సహకరిస్తుంది.

Is it Safe to do Prenatal Yoga during Pregnancy

3. వ్యాయామాలు మరియు ప్రాణాయామాలు పురిటి నొప్పులు, మలబద్ధకం మరియు తల తిప్పడం లాంటి సమస్యల నుంచి ఉపశమనం ఇస్తాయి.

4. డెలివరీ తర్వాత శిశువుని ఎత్తుకోవడం, ఎక్కువ సేపు చేతుల్లో పట్టుకోవడంతో చేతి నొప్పులు, భుజాల నొప్పులు వస్తాయి. వీటి నుంచి ఉపశమనం పొందేలా చేతి కండరాలు, భుజాల కండరాలు ధృడంగా చేయడానికి వ్యాయామం సహకరిస్తుంది. అయితే గర్భిణీలు ఏ వ్యాయామం, యోగాసనాలు వైద్యుల సలహా మేరకు ఆచరించాలి.

Is it Safe to do Prenatal Yoga during Pregnancy

5. ఉపయోగం: గర్భిణీలు వజ్రాసనం వేయడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది. ఎక్కువ సార్లు ఊపిరి తీసుకోవడం వల్ల శ్వాసక్రియ వేగంగా జరుగుతుంది. ఏకాగ్రత లభిస్తోంది. కండరాల పటుత్వం పెరిగి సహజ ప్రసవానికి సహకరిస్తుంది.

6. జాగ్రత్తలు: ఏ సమయంలో నైనా ఈ ఆసనం వేయవచ్చు. ప్రారంభంలో మడమలు నొప్పిగా అగుపిస్తాయి. అప్పుడు మడమల కింద మెత్తని కుషన్‌ లేదా స్పాంజీ దిండు ఉంచుకోవాలి.

English summary

Is it Safe to do Prenatal Yoga during Pregnancy

The Yoga Postures are gentle ways of keeping your body active and supple and minimize the common Pregnancy Symptoms like morning sickness and constipation. It can also help in ensuring easier labor and smooth delivery by relieving tension around the cervix and birth canal and by opening the pelvis.
Story first published: Saturday, May 28, 2016, 17:03 [IST]
Desktop Bottom Promotion