For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలకు యాంటీ బయోటిక్స్ మందులు సురక్షితమా? కాదా ?

యాంటీ బయోటిక్స్ శరీరంలో ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా , వైరస్, ఇతర మైక్రోబ్స్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్, వైరల్ ఫ్లూ, ఈస్ట్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నివారణకు ఉపయోగించే మందులు.యాంటీబయోటిక్స్ శర

|

గర్భధారణ కాలంలో ఎంతో సున్నితమైన అంశం? కాబట్టి, గర్భధారణ సమయంలో యాంటీబయోటిక్స్ ను వాడటం సురక్షితమేనా? గర్భిణీలు యాంటీబయోటిక్స్ తీసుకోవడం సురక్షితమే భయపడాల్సిన పనిలేదు.

మహిళ జీవితంలో చాలా సెన్సిటివ్ అంశం గర్భధారణ. ఈ సమయంలో తల్లి ఆరోగ్యంతో పాటు, బిడ్డ ఆరోగ్య సంరక్షణ కూడా చాలా ముఖ్యం. గర్భధారణ ప్రకృతిలో ఒక మధురమైన అనుభూతి. ఎందుకంటే మహిళ గర్భం పొందిన తర్వాత బిడ్డ పెరిగే కొద్ది, బిడ్డకు సౌకర్యవంతంగా పొట్ట నేచురల్ గా పెరగడం అనేది సృష్టి రహస్యం. బిడ్డ ప్రసవించే వరకూ గర్భిణి పొట్ట సౌకర్యవంతంగా మారుతుంది. ఇది అంత సింపుల్ గా తీసుకోవల్సిన విషయం కాదు.

కాబట్టి, మహిళ గర్భం పొందిన తర్వాత గర్భిణీ శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం సహజం. అందులో మార్నింగ్ సిక్ నెస్, కడుపుబ్బరం, మలబద్దకం, బ్యాక్ పెయిన్, బరువు పెరగడం, శరీరంలో వాపులు, వాటర్ రిటెన్షన్ వంటి మార్పులు సహజంగా జరుగుతుంటాయి.

Is It Safe To Take Antibiotics During Pregnancy?

అడిషినల్ గా శారీరక లక్షణాలతో పాటు, కొంత మంది మహిళల్లో తరచూ మూడు మారడం, ఇరిటేషన్, ఆందోళన వంటి వాటితో ఇబ్బంది పడుతుంటారు . ఇవన్నీ కూడా ఆమె శరీరంలో జరిగే హార్మోనుల్లో మార్పులే కారణం.

డాక్టర్స్ ఇచ్చే యాంటీబయోటిక్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఇవి శరీరంలో వ్యాధులకు కారణమయ్యే మైక్రోబయల్ ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతాయి.

Is It Safe To Take Antibiotics During Pregnancy?

యాంటీ బయోటిక్స్ అంటే ఏమి?
యాంటీ బయోటిక్స్ శరీరంలో ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా , వైరస్, ఇతర మైక్రోబ్స్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్, వైరల్ ఫ్లూ, ఈస్ట్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నివారణకు ఉపయోగించే మందులు.

యాంటీబయోటిక్స్ శరీరంలోకి చేరిన వెంటనే శరీరంలో ఉండే వ్యాధులకు కారణమయ్యే మైక్రోబ్స్ ను నాశనం చేస్తుంది. లేదా అవి పెరగకుండా అరికడుతుంది. జబ్బులను నివారిస్తుంది.

ఇక గర్భవతికి యాంటీ బయోటిక్స్ మందులు సురక్షితమా? కాదా ? అనేది ఆమె శరీరాన్ని బట్టి, ప్రెగ్నెన్సీ సమయాన్ని బట్టి వుంటుంది. కొన్ని యాంటీబయోటిక్ లు గర్భవతి దశలో ఎపుడైనా వాడవచ్చు. కొన్ని బేబీకి హాని కలిగించేవిగాను మరి కొన్ని గర్భవతికి అనారోగ్యం కలిగించేవిగాను వుంటాయి.

Is It Safe To Take Antibiotics During Pregnancy?

గర్భవతి పూర్తిగా అనారోగ్యంతో బాధపడుతూ వుంటే, బేబీఎదుగుదలకు హాని కలిగించినప్పటికి కొన్నియాంటీ బయోటెక్ మందులు వాడాల్సిందే. వాడకుంటే, ఆమె అనారోగ్యమే కాక, బిడ్డకు కూడా అనారోగ్యం కలిగే ప్రమాదముంది. అన్ని మందులవలెనే యాంటీ బయోటిక్స్ మందులకు కూడా వాటి డోసేజి, ఉపయోగించే విధానం, గర్భవతి దశ మొదలైనవి కూడా పరిశీలించాలి.

ప్రెగ్నెన్సీ సమయంలో ఇన్ఫెక్షన్ తగ్గించటానికి ఏదైనా మందు వాడాల్సి వుంటే మీ వైద్యులు సూచించిన మందును ఇతర వైద్య నిపుణుల సంప్రదింపులతో సరైన నిర్ణయం తీసుకోండి. అయితే, గర్భవతిగా వున్నపుడు తీసుకోవలసిన విటమిన్ల వంటివి తప్పక తీసుకోండి.

English summary

Is It Safe To Take Antibiotics During Pregnancy?

Are you an expecting mother who is concerned about your pregnancy? Do you often wonder if taking antibiotics is safe during pregnancy? If yes, then worry not, because we are here to help!
Story first published: Tuesday, November 29, 2016, 16:54 [IST]
Desktop Bottom Promotion