For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సంతానలేమి గురించి కొన్ని షాకింగ్ అపోహలు..వాస్తవాలు..

|

ఏ రకమైన కుటుంబ నియంత్రణ సాధనాలు ఉపయోగించకుండా, మందులూ వాడకుండా, క్రమం తప్పకుండా ఒక ఏడాదిపాటు శృంగారంలో పాల్లొన్నప్పటికీ పిల్లలు పుట్టక పోవడాన్ని ప్రాథమిక వంధ్యత్వం అంటారు. చాలామంది మొదటి కలయికలోనే పిల్లలు పుడతారని అనుకుంటారు. అది సరికాదు. గర్భం కావాలని ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళే దంపతులకు ఆరు నెలలలోపే సంతానం కలిగే అవకాశం ఉంటుంది.

వంధ్యత్వం అంటే మౌలికంగా గర్భం దరించ లేక పోవడమే. వంధ్యత్వం అంటే ధరించిన గర్భాన్ని పూర్తిగా చివరి దాకా మోయలేక పోవడమే. వంధ్యత్వం అంటే ఒక ఏడాది ప్రయత్నం తరువాత కూడా గర్భం దరించ లేక పోవడం. లేదా స్త్రీలు 35 ఏళ్ళకు పైబడ్డ వారైతే ఆరు నెలలు. గర్భం ధరించి కూడా చివరి దాకా నిలవక పోవడం కూడా వంధ్యత్వం క్రిందికే వస్తుంది. అలాగే, 83 నుండి 85 శాతం మందికి సంవత్సరం తిరిగే లోపలే సంతానం కలుగుతుంది. ఖచ్చితంగా గర్భం ధరించడానికి ప్రతి నెలలో అండం విడుదల అవడం, ఆ సమయంలోనే కలయిక జరగడం, పురుషుల్లో వీర్యకణాలు సమృద్ధిగా ఉండటం అవసరం.

వంధ్యత్వం అంటే ప్రతి సారీ స్త్రీ సంబంధమైన సమస్యే కాదు. స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ వంధ్యత్వాన్ని కలిగించే కారణాలు ఉండవచ్చు. వంధ్యత్వం కేసుల్లో మూడో వంతు స్త్రీ సమస్యల వల్లనే. మరో వంతు పురుషుల వల్ల. మిగతావి ఇద్దరికీ సంబంధించిన సంయుక్త సమస్యలు లేక అంతుపట్టని సమస్యలు. మామూలుగా పిల్లలు పుట్టక పోవడానికి కారణాలు స్త్రీ పురుష జన నాంగాల లోపాలు, పురుషుల్లో బీర్జాల్లో వీర్యకణాల సంఖ్య, వాటి కదలికలకు సంబంధించిన లోపాల కోసం చేసే పరీక్షలు చేసాక అప్పుడు దంపతుల లైంగిక జీవితానికి సంబంధించిన లోపాలు, అపశ్రుతులు కారణాలుగా ఉన్నాయేమో అన్న దానిమీద దృష్టి కేంద్రీకరించాలి.

సాధారణంగా పిల్లలు పుట్టని దంపతులు చాలా మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. వీరిపైన ముఖ్యంగా స్త్రీలపైన ఒత్తిడి అధికంగా ఉంటుంది. వంధ్యత్వానికి సంబంధించిన పరీక్షలన్నీ స్త్రీలకే చేయించడం, పురుషుల్లో లోపాలు కావాలని విస్మరించడం, భర్తకి మరొక వివాహం చేస్తామని అత్తింటి వారు బెదిరించడం, గర్భం ధరించడానికి కొంత సమయాన్ని టార్గెట్‌గా పెట్టడం, చుట్టుపక్కల వారితో పోలుస్తూ గొడ్రాలని అవమానించడం వంటి చర్యలతో స్త్రీలు బాగా మానసిక హింసకు గురవుతారు.

కొంతమంది స్త్రీలపై పిల్లలు పుట్టలేదన్న కారణంతో భౌతిక హింస కూడా జరుగుతుంది. ఇవన్నీ స్త్రీలలో మరింత ఒత్తిడిని పెంచడంతో వారు డిప్రెషన్‌కు లోనవుతారు. దానితో హార్మోన్ల అపసవ్యత బాగా పెరిగి పోయి అండం విడుదలలో అలస్యం కావడం లేదా అసలు విడుదలే కాకపోవడం జరుగుతుంది. ఈ ఒత్తిడిని పురుషులు కూడా సమానంగా భరిస్తారు. వీరిలో కూడా హోర్మోన్ల అసమతుల్యత కలిగి వీర్యోత్పత్తిని తగ్గిస్తాయి. ఈ రకమైన మానసిక ఒత్తిళ్లవల్ల పిల్లల కోసం శృంగారంలో పాల్గొనడం అనేది యాంత్రికంగా, భారంగా భావిస్తారు. ఆసక్తి తగ్గి శృంగారంలో పాల్గొనడం తగ్గిపోతుంది. అంతే కాదు వీటితో పాటు మరికొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి..

అపోహ: గర్భం పొందడం సులభం?

అపోహ: గర్భం పొందడం సులభం?

ఇన్ ఫెర్టిలిటితో బాధపడే వారు పిల్లలున్న వారిని చూస్తే , గర్భం పొందడం చాలా లసుభంగా వారు పిల్లలు పుట్టారని వారిలో ఎలాంటి సమస్యలు లేవని భావిస్తుంటారు . అయితే ఎలాంటి వంధ్యత్వం సమస్యలు లేని వారిలో కూడా ఫెర్టిలిటి సమస్యలుంటాయి . హెల్తీగా ఉన్న వారు కూడా వారికి అవసరమనుకున్న సమయంలో గర్భం పొందలేరు.

అపోహ: కేవలం మహిళలు మాత్రమే వంధ్యత్వానికి గురౌతారు?

అపోహ: కేవలం మహిళలు మాత్రమే వంధ్యత్వానికి గురౌతారు?

వాస్తవం: వంధ్యత్వం అనేది స్త్రీ మరియు పురుషులిద్దరు ఎదుర్కొనే సమస్య. సమస్య ఎవ్వరిలోనైనా ఉండవచ్చు. ఆడవారిలో అండోత్సర్గ సమస్యలు, పీరియడ్స్ సమస్యలు ట్యూబ్ సమస్యలుంటే పురుషుల్లో స్పెర్మ్ కౌంట్, టెస్టికల్స్, స్పెర్మ్ క్వాలిటిలో లోపాల వల్ల వంద్యత్వానికి దారి తీస్తుంది.

అపోహ: గర్భం పొందడం ఒక వరం, అయితే ఇది కేవలం మైండ్ కు సంబంధించింది?

అపోహ: గర్భం పొందడం ఒక వరం, అయితే ఇది కేవలం మైండ్ కు సంబంధించింది?

వాస్తవం: ఇన్ ఫెర్టిలిటి ఖచ్చితంగా మానసిక ఆరోగ్యానికి మాత్రమే సంబంధించినది కాదు, ఇది రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ (ప్రుత్యుత్పత్తి వ్యవస్థ) హార్మోనుల కు సంబంధించినది. వీటిలో లోపాల వల్ల కూడా వంధ్యత్వానికి కారణమవుతుంది.

అపోహ: హార్ట్ వర్క్ చేస్తే ఫలితం ఉంటుంది?

అపోహ: హార్ట్ వర్క్ చేస్తే ఫలితం ఉంటుంది?

వాస్తం : చాలా మంది పిల్లలు లేని జంటలకు సూచించే విషయం సరైన సమయంలో ఫ్రీక్వెంట్ ఇంటర్ కోర్స్ చేయడం, హెల్తీ డైట్ తీసుకోవడం, వ్యాయామం వల్ల గర్భం పొందడానికి సహాయపడుతుందని సలహాలిస్తుంటారు. అయితే ఇప్పటికే వంద్యత్వంతో బాధపడే వారు వీటితోపాటు మెడికల్ ట్రీట్మెంట్ కూడా అవసరమే.

అపోహ: పిల్లలను దత్తత తీసుకుంటే పిల్లలు పుడుతారు?

అపోహ: పిల్లలను దత్తత తీసుకుంటే పిల్లలు పుడుతారు?

వాస్తవం: ఈ అపోహ ఇప్పటికి కొన్ని ప్రదేశాల్లో ఉంది. పిల్లలను దత్తత తీసుకోవడం వల్ల , ఇన్ ఫెర్టిలిటీతో బాధపడే వారికి పిల్లలు కలుగుతారనేది అపోహ మాత్రమే. అది శరీరానికి మనస్సుకు సంబంధించినది.

అపోహ: పిల్లలు లేని జంటలు సంతోషంగా ఉంటారు?

అపోహ: పిల్లలు లేని జంటలు సంతోషంగా ఉంటారు?

వాస్తవం : బహుశా ఉండొచ్చు...ఉండకపోవచ్చు. అయితే పిల్లలు లేరని బాధపడే కంటే జీవితంలో ఇతర విషయాల్లో చురుగ్గా ఉంటూ జీవితాన్ని ఆనందం గడపడం మంచి మార్గం.

అపోహ: వంధ్యత్వ భార్యలను భర్తలు వదిలేస్తారు

అపోహ: వంధ్యత్వ భార్యలను భర్తలు వదిలేస్తారు

వాస్తవం: ఇన్ ఫెర్టిలిటి విషయంలో మరో బుద్దిలేని తనం ఇది. కపుల్స్ ఇద్దరి మద్య బలమైన రిలేషన్ షిప్ ఉన్నప్పుడు, వారి జీవితాని వంధ్యత్వం అనేది సమస్యే కాదు.

English summary

Shocking Myths About Infertility You Must Read!

As many of us may realise, infertility is a health condition just like any other, and so, there are a lot of facts and myths that surround infertility! Imagine how devastated you would be when you cannot get something you have wanted for a long time, well, infertility is a condition in which a person is unable to have children, which can be a huge blow to the person's emotional state.
Story first published: Wednesday, September 14, 2016, 17:45 [IST]
Desktop Bottom Promotion