For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భస్రావం ప్రారంభ లక్షణాలు తెలుసుకోండి..!

గర్భం ధరించిన ఇరవై వారాలలోపు స్రావం జరిగితే అది అబార్షన్ లేదా గర్భస్రావం అని చెప్పాలి. సాధారణంగా మొత్తంగా గర్భం అనేది 40 వారాలపాటు మహిళ కలిగి వుంటుంది. గర్భస్రావాలు చాలావరకు 13 వారాలలోపే జరుగుతాయి. కా

|

గర్భం ధరించిన ఇరవై వారాలలోపు స్రావం జరిగితే అది అబార్షన్ లేదా గర్భస్రావం అని చెప్పాలి. సాధారణంగా మొత్తంగా గర్భం అనేది 40 వారాలపాటు మహిళ కలిగి వుంటుంది. గర్భస్రావాలు చాలావరకు 13 వారాలలోపే జరుగుతాయి. కాని కొన్ని సార్లు అకస్మాత్ గా కూడా అబార్షన్ అయిపోవచ్చు. దానిని మనం గ్రహించలేము. చాలావరకు గర్భం పోవటమనేది కొద్దిరోజులపాటు జరిగే సంఘటనలుగా పోతూంటుంది. మహిళలు వీటి అనుభవాలను విభిన్నరీతులలో పొందుతారు.

ఫలదీకర చెందిన అండం సరిగ్గా గర్భంలో అభివృధ్ధి చెందలేని పరిస్ధితులలో గర్భస్రావం జరుగుతుంది. అది మీరు చేసిన తప్పులవలన జరుగకపోవచ్చు. గర్భస్రావానికి కొన్ని సార్లు జన్యుపరంగాను, వైద్య పరంగాను కారణాలుంటాయి.మీ సమాచారం కొరకు గర్భస్రావంకు దోవతీసే కొన్ని లక్షణాలను చర్చిద్దాం.

 Signs Of Early Miscarriage

1. పొట్టలో నొప్పులు - గర్భస్రావం అవుతోందనేందుకు మొట్టమొదటి బలమైన కారణం పొట్టలో నొప్పి రావటం. పొట్టలో కనుక, ప్రత్యేకించి, ఒకే వైపున నొప్పి వున్నట్లయితే, తక్షణం మీరు డాక్టర్ ను సంప్రదించండి. చాలారోజులపాటు మీకు వెన్ను నొప్పి కూడా తరచుగా వస్తూంటుంది. పొట్టలో వచ్చే ఈ నొప్పులు మీకు రుతుక్రమంలో వచ్చే నొప్పులవలెనే వుంటాయి. అయితే, మీ పొట్ట నొప్పులు కొన్నిసార్లు ఒక మోస్తరుగా వున్నపుడు భయపడకండి. ఒక మాదిరి నొప్పులనేవి కడుపులో వుండే బేబీ ఎదుగుదలని సర్దుబాటు చేసుకోవటంలో కూడా వస్తాయి.

 Signs Of Early Miscarriage

2. యోని రక్తస్రావం - గర్భవతి మహిళ యోనినుండి రక్తస్రావం అనేది కొద్దిగా, లేదా అధికంగా అయినప్పటికి తరచాగా లేదా అపుడపుడూ అవుతున్నప్పటికి అది గర్భ స్రావానికి మొదటి చిహ్నంగా భావించాలి. రక్తస్రావం లేదా గడ్డకట్టటం వంటివి డాక్టర్ కు వెంటనే తెలియపరచాలి. అయితే, మొదటి త్రైమాసికంలో గర్భంలో వచ్చే మార్పులు లేదా పిండం గర్భంలో నిలుపబడటం వంటి చర్యలుగా కూడా కొద్దిగా రక్తం వచ్చే అవకాశాలుంటాయి.

 Signs Of Early Miscarriage

3. ప్రెగ్నెన్సీ లక్షణాలు అసలు కనపడకుంటే - ఒక తల్లి తన బిడ్డను ఎపుడూ అనుభవించగలదు. ఒక సారి గర్భవిచ్ఛిన్నం జరిగితే, ఆమెకు బిడ్డ లోపల వున్న భావన కలుగదు. తాను గర్భవతిని అన్న భావన కలుగదు. అంతేకాదు, ఆమెలోని స్తనాల ఎర్రదనం, ఇతర లక్షణాలైన ఆకలి, రుచులు తినాలనే కోరికలు అన్నీ పోతాయి. అయితే, ఈ లక్షణాలు కూడా పూర్తిగా ఆధారపడదగినవి కావు. కనుక గర్భస్రావం అనుమానం కలిగితే, డాక్టర్ ను సంప్రదించండి.

4. ముందుగానే కాన్పు నొప్పులు - మీరు రెండో లేదా మూడవ త్రైమాసికంలోనే కాన్పు నొప్పులవంటివి అనుభవిస్తున్నారంటే, మీరు తప్పక డాక్టర్ ను సంప్రదించాల్సిందే.

 Signs Of Early Miscarriage

5. మానసిక ధైర్యం - మహిళ గర్భస్రావానికి గురయితే, ఆమెకు మానసికంగాను, శారీరకంగాను ఎంతో సహకారం కావలసి వస్తుంది. ఎందుకంటే, గర్భస్రావం అనేది ఒక తల్లి తన బిడ్డను కోల్పోయినంత సంఘటనగా వుంటుంది. కనుక గర్భ స్రావం పొందిన మహిళలకు తక్షణ వైద్య సదుపాయం కలిగించటం, ఆమెను ఊరడించడం, ఆమెకు తగిన ధైర్యం చెప్పి ఆ పరిస్ధితినుండి ఆమె కోలుకొనేలా చేయటం వంటివి ప్రతి ఒక్కరూ తమ ప్రధమ కర్తవ్యంగా భావించాలి.

6.బ్రీతింగ్ రేట్ 4వారాల్లో మిస్కరేజ్ కు లక్షణాల్లో ఒకటి బ్రీతింగ్ ప్రాబ్లెమ్. గర్భం పొందిన మహిళ ఎక్కువ శ్వాస తీసుకోవడం లేదా ఒక్కొక్క సందర్భంలో బ్రీత్ తీసుకోవడంలో కూడా ఇబ్బందిని ఎదుర్కోవల్సి వస్తుంది . ఎక్కువ స్ట్రెస్ కు మరియు భయానికి గురైనప్పుడు ఈ సమస్యను ఎదుర్కోవల్సి వస్తుంది . కాబట్టి ఈ పరిస్థితిని తెచ్చుకొక్కుండా ఉండాలి. సాద్యమైనంత వరకూ ఒత్తిడి తగ్గించుకోవాలి.

 Signs Of Early Miscarriage

7.క్రాంప్స్ పొట్ట ఉదరంలో నొప్పి లేదా క్రాంపింగ్ మరో లక్షణంగా గుర్తించాలి . పొట్ట ఉదరంలో కంట్రోల్ చేసుకోలేని విధంగా ఆబ్డోమినల్ పెయిన్ మరియు తిమ్మెరిగా అనిపించినప్పుడు వెంటనే గైనిక్ ను సంప్రదించాలి . అలాగే, ఇది ఖచ్చితమైన కారణం కాకోపోయుండొచ్చు కూడా కొంత మంది మహిళల్లో ఈ లక్షణం గర్భధారణ కాలం మొత్తం ఉంటుంది . కానీ క్రాంపింగ్ తో పాటు బ్లీడింగ్ ఉంటే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.

 Signs Of Early Miscarriage
8.వైజినల్ డిశ్చార్జ్ వైజనల్ డిశ్చార్జ్ లో బ్రౌన్ డిశ్చార్జ్ అయితే అది మిస్కరేజ్ యొక్క లక్షణంగా గుర్తించిన నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ ను కలవాలి . ఇది కాఫీ కలర్లో డిశ్చార్జ్ అవుతుంది . ఇది పాత రక్తం యూట్రస్ లో ఉండిపోయినా నిధానంగా బటయకు వస్తుంటుంది. టిష్యు డిశ్చార్జ్ ఈ డిశ్చార్జ్ తో పాటు వైజినా నుండి లిక్విడ్ పాస్ అవుతుంటుంది. ఇది కేవలం టిష్యు డిశ్చార్జ్ మాత్రమే. ఇది కూడా 4 వారల్లో కనబడుతుంది..

English summary

Signs Of Early Miscarriage

The medical term for miscarriage is spontaneous abortion. An early miscarriage is an event that occurs in the first twenty weeks of pregnancy. An isolated miscarriage is defined as a single unpredictable event which happens because of a chromosomal defect in the egg or sperm.
Story first published: Saturday, October 22, 2016, 17:36 [IST]
Desktop Bottom Promotion