For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొట్టలో ట్విన్స్ పెరుగుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ట్విన్స్ పెరుగుతున్నప్పుడు ఏ మాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవడం వల్ల.. మీరు హెల్తీ ట్విన్స్ పొందడం తేలికవుతుంది.

By Swathi
|

మీరు కన్సీవ్ అయ్యారా ? స్కానింగ్ లో మీకు ట్విన్స్ పుట్టబోతున్నారని కన్ ఫర్మ్ అయిందా ? అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే.. కాస్త టెన్షన్ కూడా వెంటాడుతుంది. అయితే.. ట్విన్స్ పుట్టబోయేముందు.. తల్లులు కొన్ని విషయాలను మైండ్ లో పెట్టుకోవాలి.

twins

తన పొట్టలో ట్విన్స్ పెరుగుతున్నారని తెలిస్తే.. కాబోయే తల్లిలో రెండురకాల రియాక్షన్స్ వస్తాయి. తల్లి కాబోతున్నామన్న ఆనందం, ఇద్దరు పిల్లల ఆరోగ్యానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. కొంతమంది భయపడే అవకాశాలు కూడా ఉన్నాయి.

కవలలు పొట్టలో పెరుగుతున్నప్పుడు కాస్త టెన్షన్ ఉంటుంది. డెలివరీ ఎలా జరుగుతుందో ? అన్న భయం ఉంటుంది. ఆ తర్వాత ఒకేసారి ఇద్దరు పిల్లలను ఎలా పెంచాలో అన్న ఆందోళన ఉంటుంది.

కానీ.. ట్విన్స్ పెరుగుతున్నప్పుడు ఏ మాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవడం వల్ల.. మీరు హెల్తీ ట్విన్స్ పొందడం తేలికవుతుంది.

మొదటి రియాక్షన్

మొదటి రియాక్షన్

తమ పొట్టలో ట్విన్స్ పెరుగుతున్నారన్న వార్త తెలియగానే.. కాస్త షాకింగ్ గా ఉంటుంది. కానీ.. దీనికి గిల్టీగా ఫీలవ్వాల్సిన అవసరం లేదు. ఇది చాలా నార్మల్ గా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మైండ్ ని చాలా రిలాక్స్ ఉంచండి. అప్పుడు మీ బాడీ కూడా ప్రెగ్నన్సీపై దుష్ర్పభావం చూపకుండా ఉంటుంది.

ఆకర్షణ గురించి

ఆకర్షణ గురించి

పొట్టలో ఇద్దరు పిల్లలు పెరుగుతున్నప్పుడు మొదటి దశలోనే పొట్ట కాస్త పెద్దగా కనిపిస్తుంది. దీనికి ఆందోళనపడకండి. పొట్టలో ట్విన్ బేబీస్ ఉన్నప్పుడు ఎక్కువ ఒత్తిడికి గురికాకుండా.. వాళ్ల సంరక్షణ గురించి ఆలోచించండి.

పొట్టపై మాయిశ్చరైజర్

పొట్టపై మాయిశ్చరైజర్

మీ పొట్టపై ఎక్కువ ఒత్తిడి, స్ట్రెచ్ ఉంటుంది. కాబట్టి దానిపై ఆయిల్ లేదా మాయిశ్చరైజర్ పట్టించాలి. దీనివల్ల చర్మానికి తగిన మాయిశ్చరైజర్ అందుతుంది. స్ట్రెచ్ మార్క్స్ దురద పెట్టకుండా ఉంటాయి.

ఎక్కువగా తినకండి

ఎక్కువగా తినకండి

ఒక బేబీ కాకుండా.. ఇద్దరు పుట్టబోతున్నారు కాబట్టి.. ఎక్కువగా తినాలని భావించకండి. మీకు ఆకలిగా అనిపించినప్పుడు మాత్రమే తినాలి. పొట్ట నిండిన ఫీలింగ్ కలిగినప్పుడు తినకండి.

హెల్తీ ఫుడ్

హెల్తీ ఫుడ్

మీ డైట్ లో ఫ్రెష్ ఫుడ్ ఉండేలా జాగ్రత్త పడాలి. ప్రొసెస్డ్ ఫుడ్ తీసుకోకూడదు. తాజా పండ్లు, కూరగాయలు, వోల్ గ్రెయిన్స్, రైస్, పాస్తా, చేపలు, మాంసం, ఎగ్స్, పాలు, పెరుగు వంటి ఆహారాలను డైట్ లో చేర్చుకోవాలి.

స్మాల్ మీల్స్

స్మాల్ మీల్స్

ట్విన్ ప్రెగ్నన్సీ ఉన్నప్పుడు ఎక్కువ పోషకాహారం తీసుకోవాలి. అయితే.. ఎక్కువ మొత్తంలో కాకుండా కొద్ది కొద్దిగా తీసుకోవాలి. ఎక్కువ ఆహారం ఒకేసారి తీసుకుంటే.. అసౌకర్యంగా ఉంటుంది. మీ బ్రేక్ ఫాస్ట్ ని రెండుగా విడదీసి.. గంటన్నర గ్యాప్ తో తీసుకోవాలి.

పోషకాలు

పోషకాలు

మొదటి 12 వారాల ప్రెగ్నన్సీ సమయంలో 400 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ డైలీ తీసుకోవాలి. అలాగే విటమిన్ డి కూడా ప్రెగ్నన్సీ సమయం మొత్తం తీసుకోవాలి.

మెటర్నిటీ బెల్ట్

మెటర్నిటీ బెల్ట్

కాళ్లు, వెన్నుపై ఎక్కువ ఒత్తిడి కలిగించకుండా, నొప్పి కలిగించకుండా ఉండటానికి రెగ్యులర్ గా సరైన వ్యాయామాలు చేయాలి. మెటర్నిటీ బెల్ట్ లు, బెల్లీ బ్యాండ్స్ పొట్ట బరువును తేలికగా మారుస్తాయి.

కంటినిండా నిద్రపోవడం

కంటినిండా నిద్రపోవడం

రాత్రిపూట నిద్రపట్టడం కాస్త కష్టంగా ఉంటుంది. తరచుగా యూరిన్ కి వెళ్లడం, అసౌకర్యం వంటి సమస్యలు.. మీకు నిద్రపట్టకుండా అడ్డుకుంటాయి. పగటిపూటైనా నిద్రపోవడం మంచిది.

సపోర్ట్

సపోర్ట్

చాలా స్ట్రాంగ్ సపోర్ట్ చాలా అవసరం. ఫ్యామిలీ నుంచి, సమాజం నుంచి.. మీరు ప్రెగ్నంట్ గా ఉన్నప్పుడు సపోర్ట్ అవసరం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ప్లాన్స్ ఉండాలో మీరూ, మీ పార్ట్ నర్ కలిసి మాట్లాడుకోవాలి.

English summary

Tips For Moms Carrying Twins

Tips For Moms Carrying Twins. For many women, the news of being pregnant with twins can seem like a shock in the beginning.
Desktop Bottom Promotion