For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భాధారణ సమయంలో పాదాల వాపులు తగ్గించే 10 యూజ్ ఫుల్ టిప్స్ ..!!

గర్భిణీగా వున్నపుడు కాళ్ళు వాపు రావటమనేది సహజం. అది అసౌకర్యమే. కాదనేది లేదు. గట్టిగా చెప్పే కారణం కూడా కనపడదు. కాళ్ళు మాత్రమే కాదు శరీరమంతా కూడా ఉబ్బుతుంది. గర్భవతిగా వున్నపుడు మీరు లావెక్కినపుడు అందు

|

గర్భిణుల్లో అనేక అపోహలు ఉంటాయి. ముఖ్యంగా వాళ్లు చేసే, చేయాల్సిన పనుల్లో. కొందరేమో ఎంత ఎక్కువ పని చేస్తే కాన్పు అంత సులువుగా అవుతుందనుకుంటారు. మరికొందరేమో పని చేయకుండా అలా పడుకొని ఉండాలని అనుకుంటారు. సాధారనంగా 75శాతం మంది గర్భిణీ స్త్రీలకు ఏడో నెల వచ్చే సరికి పాదాలు, కాళ్లకు వాపులు వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఉద్యోగస్తులైన గర్భిణీ స్త్రీలు పగటి పూట విశ్రాంతి లేకుండా ఎక్కువ సమయం బయటనే గడపడం, వివిధ రకాల కారణాల వల్ల పాదాల్లో వాపులు సహజంగా వస్తుంటాయి.

గర్భిణీగా వున్నపుడు కాళ్ళు వాపు రావటమనేది సహజం. అది అసౌకర్యమే. కాదనేది లేదు. గట్టిగా చెప్పే కారణం కూడా కనపడదు. కాళ్ళు మాత్రమే కాదు శరీరమంతా కూడా ఉబ్బుతుంది. గర్భవతిగా వున్నపుడు మీరు లావెక్కినపుడు అందులో మూడు వంతుల బరువు నీటిది మాత్రమే. కనుక బిడ్డ పుట్టిన తర్వాత ఈ బరువు తగ్గటానికి మీరు శ్రమపడాల్సిన అవసరంలేదు. నీటి వలన ఏర్పడిన బరువు దానంతట అదే తగ్గిపోతుంది. సమస్య తీవ్రత ఎపుడు అధికంగా వుంటుందంటే....బాగా అలసిన తర్వాత రాత్రి పడుకునేటపుడు ఎండా కాలంలో చాలా బాధాకరంగా వుంటుంది.

కాళ్లు ఎందుకా వాపు చూసిస్తాయి? వైద్య భాషలో దీనిని ఎడిమా అంటారు. శరీరం అధిక నీటిని రక్తాన్ని ప్రెగ్నెన్సీ సమయంలో పిండం ఎదుగుదలకు ఉత్పత్తి చేస్తుంది. మీ బేబీ కడుపులోని నీటిలో తేలియాడుతూ వుంటుంది. ఈ అదనపు నీరు అంతా ఎక్కడికో అక్కడికి పోవాలి కనుక అది శరీరం కిందిభాగమైన కాళ్ళలోకి చేరిపోతుంది. పొట్ట పెరుగుతూంటే, దిగువ భాగం శరీరంపై ఒత్తిడి పెరుగుతుంది. రక్తసరఫరా నెమ్మదిస్తుంది. గర్భిణీకి మూడవ త్రైమాసికంలో కాళ్ళు, చేతులు వాపురావటం అధికంగా వుండి అసౌకర్యాన్ని కలుగజేస్తుంది. గర్భిణీలు పాదాల వాపును నేచురల్ గా తగ్గించుకవోడానికి కొన్ని సింపుల్ టిప్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ చిట్కాలను అనుసరించినట్లైతే తప్పనిసరిగా పాదాల నొప్పులు, తగ్గుతాయి. అవేంటో ఒకసారి చూద్దాం...

ఎక్కువ సమయం నిల్చొని ఉండకూడదు:

ఎక్కువ సమయం నిల్చొని ఉండకూడదు:

ఎక్కువ సమయం నిల్చోవడం కానీ, కూర్చోవడం కానీ చేయకూడదు. ఎక్కువ సమయం నిల్చోకుండా, మద్యమద్యలో అలా లేచి తిరుగుతుండాలి. చిన్న పాటి బ్రేక్స్ తీసుకోవడం చాలా అవసరం. అలాగే ఎక్కువ సమయం కూర్రోకుండా లేచి, అటూ ఇటూ తిరగడం అవాటు చేసుకోవాలి. అలాగే క్రాస్ లెగ్స్ వేసుకుని కూర్చోకూడదు.

లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలి:

లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలి:

గర్భిణీలు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల వీన్స్ మీద ఎక్కువ ప్రెజర్ తగ్గుతుంది. దాంతో హార్ట్ కు రక్తం చాలా సులభంగా ప్రసరింపబడుతుంది. శరీరం మొత్తానికి బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది. సైడ్ కు తిరిగి పడుకున్నప్పుడు సపోర్టివ్ గా పిల్లో వేసుకోవాలి. కాళ్ళ క్రింది దిండు వేసుకోవడం వల్ల పాదాలు వాపు తగ్గుతుంది.

సౌకర్యవంతంగా ఉండే చెప్పులు ధరించాలి.

సౌకర్యవంతంగా ఉండే చెప్పులు ధరించాలి.

గర్భధారణ సమయంలో శరీరంతో పాటు, కాళ్ళు చేతులు కూడా విస్తరిస్తాయి. కాబట్టి, ఎప్పటికప్పుడు సౌకర్యవంతంగా ఉండే షుష్ లేదా సాండిల్స్ ను ఎంపిక చేసుకోకూడదు. చెప్పులు కూడా ఎత్తు లేకుండా ఉన్నవి ఎంపిక చేసుకోవాలి. గాలి చొరబడే వి ఎంపిక చేసుకోవాలి. . కొంత మంది డాక్టర్లు అథ్లెట్స్ షును సూచిస్తుంటారు. ఇవి వేసుకోవడం వల్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి.

బ్యాలెన్స్ డైట్ ను తీసుకోవాలి:

బ్యాలెన్స్ డైట్ ను తీసుకోవాలి:

ప్రోటీన్స్ అధికంగా ఉన్న పండ్లు మరియు వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఉప్పు , పంచదార తీసుకోవడం తగ్గించాలి. ప్రీ ప్యాక్డ్ ఫుడ్ ప్రొసెస్డ్ ఫుడ్ ను తీసుకోవడం తగ్గించాలి. విటమిన్ సి, విటమిన్ ఇ ఆహారాలను తగ్గించాలి.

వాటర్ ఎక్కువగా తాగాలి:

వాటర్ ఎక్కువగా తాగాలి:

గర్భధారణ సమయంలో గర్భినీలు కనీసం 8 నుండి 10 గ్లాసుల నీళ్ళు తాగాలని సూచిస్తున్నారు. ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో టాక్సిన్స్, ఎక్సెస్ సోడియం లెవల్స్ తొలగిపోతాయి. దాంతో పరోక్షంగా కాళ్ళ, పదాల వాపులు తగ్గుతాయి.

 గర్భిణీలు స్టాకింగ్స్ లేదా సాక్సులు వేసుకోవడం తగ్గించాలి

గర్భిణీలు స్టాకింగ్స్ లేదా సాక్సులు వేసుకోవడం తగ్గించాలి

: పాదాల జాయింట్స్, మిడిమల వద్ద టైట్ గా ఉండే సాక్సులు కానీ, స్టాకింగ్స్ కానీ వేసుకోవడం నివారించాలి. ఇలా చేయడంవల్ల శరీరంలో రక్తప్రసరణ ఫ్రీగా జరగుతుంది.

శరీరానికి చిన్న పాటి వ్యాయామం అవసరం:

శరీరానికి చిన్న పాటి వ్యాయామం అవసరం:

గర్భిణీలు రోజూ చిన్న పాటి వ్యాయామాలు చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది. రోజూ ఉదయం, సాయంత్రం 10 నిముషాల నడక ప్రాక్టీస్ చేయమని, సింపుల్ గా ఉండే స్ట్రెచ్చింగ్ ఎక్సర్ సైజ్ చేయమని డాక్టర్స్ సలహాలిస్తుంటారు.

వివిధ రకాల థెరఫీలను ప్రయత్నించవచ్చు:

వివిధ రకాల థెరఫీలను ప్రయత్నించవచ్చు:

డాక్టర్ సలహా ప్రకారం కాళ్ళకు, పాదాలకు సున్నితమైన ఆయిల్ మసాజ్ ను ప్రయత్నించవచ్చు. ప్రత్యామ్నాయంగా ల్యావెండర్ ఆయిల్, చమోమెలీ ఆయిల్ మిక్స్ చేసిన నీటిలో పాదాలను డిప్ చేయాలి. ఇది పాదాల్లో అసౌకర్యాన్ని తొలగిస్తుంది,. అలాగే డాక్టర్ సలహా ప్రకారం రోజుకు ఒక కప్పు హెర్బల్ టీ తాగడం మంచిది.

పూల్లో రెస్ట్ తీసుకోవాలి.

పూల్లో రెస్ట్ తీసుకోవాలి.

కొన్ని సందర్భాల్లో వాటర్ పూల్లో నిలబడంటం వల్ల కాళ్ళలో కణాలకు కంప్రెసర్ అందుంతుంది. వాపుల నుండి తాత్కాలికి ఉపశమనం కలుగుతుంది. అలాగే కూల్ గా ఉండే కోల్డ్ వాటర్ లో పాదాలను కొద్ది సేపు నానబెట్టుకోవడం వల్ల కూడా వాపుల నుండి ఉపశమనం పొందుతారు.

స్మోకింగ్, కెఫిన్ డ్రింక్స్ నివారించాలి.

స్మోకింగ్, కెఫిన్ డ్రింక్స్ నివారించాలి.

గర్భధారణ సమయంలో గర్భినీలు స్మోక్ చేయడం, ఆల్కహాల్ తీసుకోవడం లేదా ఎక్కువగా కెఫిన్ డ్రింక్స్ తీసుకోవడం తగ్గించాలి. వీటి వల్ల శరీరంలో వాపులు మరియు నొప్పులు పెరుగుతాయి.

English summary

Top 10 Useful Tips To Reduce Swelling During Pregnancy

During pregnancy, one thing that may scare you is signs of swelling. These are mainly seen on your ankles and feet, and sometimes may even be around the face and hands. Swelling is a normal occurrence during your nine months and almost 75% of women experience this.
Story first published: Monday, November 21, 2016, 16:36 [IST]
Desktop Bottom Promotion