For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రసవించిన తర్వాత గర్భనిరోధకతకు ఉపయోగించే పద్దతి..?

గర్భ నిరోధక సాధనాల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకునే ముందు మీ వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం!

By Lekhaka
|

మీరు ఇటీవలే ఒక శిశువుకు జన్మనిచ్చిన తల్లి అయి వుండి, మళ్ళీ మీ శృంగార జీవితాన్ని ఆరంభించాలి అనుకుంటే, మరో సారి త్వరలో గర్భం దాల్చకుండా ఉండేందుకు శిశు జననం తరువాత ఉత్తమ గర్భ నిరోధక సాధనం ఏదో తెలుసుకోవాలని మీరు అనుకుంటూ ఉండవచ్చు, అవునా? ఈ మధ్య చాలా జంటలు తమ తొలి సంతానానికి జన్మ నిచ్చిన తరువాత మరో శిశువును కనేందుకు కొన్నేళ్ళ పాటు ఆగాలనుకు౦టున్నారు.

దంపతులు ఇద్దరూ ఉద్యోగస్తులైతే, కొత్త శిశువుతో వచ్చే బాధ్యతలతో పాటు ఆరోగ్య సమస్యలు అలాంటివి దృష్టిలో వుంచుకుంటే, మొదటి శిశు జననం తరువాత వెంటనే మరో శిశువును కనకపోవడం మంచిది.


అందువల్ల అనుకోకుండా గర్భం ధరించకుండా ఉండాలంటే శృంగార జీవితంలో చురుగ్గా వుండే వారు సురక్షిత శృంగారం చేస్తూ, ఏదో ఒక రూపంలో గర్భ నిరోధక సాధనాలు ఉపయోగించాలి.

 What Is The Best Form Of Birth Control Post Pregnancy?

అయితే, శిశుజననం తరువాత స్త్రీ శరీరం చాలా మార్పులకు లోనౌతుంది కనుక, సంప్రదాయ గర్భనిరోధక సాధనాలు ఉత్తమం కాకపోవచ్చు. అందువల్ల శిశు జననం అనంతరం ఉత్తమ గర్భ నిరోధక సాధనం ఏది/ తెలుసుకుందాం.

శిశు జననం తరువాత కండోమ్ సురక్షితమేనా?

IUDS లలా లోపలి చొప్పించడం అవసరం లేదు కనుక, పిల్స్ వాడడం వల్ల వచ్చే ఇతర ప్రభావాలు వుండవు కనుక, కండోమ్స్ ఉత్తమ గర్భ నిరోధక సాధనాల్లో ఒకటి.

 What Is The Best Form Of Birth Control Post Pregnancy?


అయితే, శిశు జననం తరువాత, చాలా మంది స్త్రీలు తమ గర్భాశయ ద్వారం వ్యాకోచించడం గమనిస్తారు, అలాగే శిశుజననం తరువాత ఏర్పడే హార్మోన్ల అసమతౌల్యం వల్ల యోని పొడిబారడం కూడా గమనిస్తారు.

అందువల్ల, యోని బిగుతు తగ్గడం వల్ల, యోని పొడి బారడం వల్లా, కండోమ్ వాడకం కొంత అసౌకర్యాన్ని కలిగిస్తుంది, హాయినివ్వదు, అందువల్ల ఇది అలాంటప్పుడు ఉత్తమ గర్భ నిరోధక సాధనం కాదు.

శిశుజననం తరువాత గర్భాశయంలో చొప్పించే సాధనాలు ఉపయోగించడం సురక్షితమేనా?

టీ ఆకారంలో వుండే ఒక గర్భనిరోధక సాధనాన్ని స్త్రీ గర్భాశయ ద్వారంలోకి చొప్పించడం వల్ల గర్భ నిరోధం చేసే ఒక సాధనం గర్భాశయ సాధనాలు లేదా IUDలు - దీని వల్ల వీర్యం అండాన్ని చేరుకొని దాన్ని ఫలదీకరణం చేయలేదు – తద్వారా గర్భధారణ నిరోధించాబడుతుంది.

 What Is The Best Form Of Birth Control Post Pregnancy?


గర్భ నిరోధక మాత్రల లాగా స్తన్య పానాన్ని ప్రభావితం చేయవు కనుకా, కండోమ్ ల లాగా అసౌకర్యం కలిగించవు కనుకా – శిశు జననం తరువాత వారి వారి ఆరోగ్య పరిస్థితులను బట్టి చాలా మంది స్త్రీలకూ గర్భాశయంలో చొప్పించే సాధనాలను ఉపయోగించడమే ఉత్తమ గర్భ నిరోధక సాధనంగా నిపుణులు అభిప్రాయపడతారు.

అయితే ఈ గర్భ నిరోధక సాధనాల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకునే ముందు మీ వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం!

English summary

What Is The Best Form Of Birth Control Post Pregnancy?

What Is The Best Form Of Birth Control Post Pregnancy?,If you are a new mother, who has given birth to your little one recently, and want to resume your sex life, then you could be wondering how you can prevent another pregnancy from happening any time soon and also what the best form of birth control is, to
Story first published: Monday, December 26, 2016, 17:28 [IST]
Desktop Bottom Promotion