For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ స్త్రీలు డార్క్ చాక్లెట్స్ తినడం వల్ల పొందే గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్ ...

|

సాధారనంగా గర్భాధారణ సమయంలో ఎక్కువ ఆకలి ఉంటుందని, గర్భిణీ మహిళలు చెప్పడం వింటూనే ఉంటాము. అందుకు ప్రధాన కారణం కడుపులో పెరిగే బిడ్డ తల్లి తీసుకొనే ఆహారం మీదనే ఆదారపడుతుంది. కడుపులో బిడ్డ అవయవవాలు ఏర్పడుతూ, బిడ్డ పెరిగే కొద్ది తల్లిలో ఆకలి కోరికలు క్రమంగా పెరుగుతాయి.

అందుకే గర్భం పొందిన మహిళలకు సాధారణ స్థితిలో కంటే గర్భం పొందిన తర్వాత ఎక్కువ ఆహారాలను తీసుకోమని గైనకాలజిస్ట్ లు , ఇంట్లో వారు సలహాలిస్తుంటారు . అంతే కాదు గర్భం పొందిన మహిళల్లో 80శాతం మంది వివిధ రకాల ఆహార మీద సాధారణంగా కంటే ఎక్కువ కోరికలు కలిగి ఉంటారు . గర్భణీ పౌష్టికాహారం తీసుకోవడం వల్ల తల్లితో పాటు, బిడ్డ కూడా హెల్తీగా ఉంటుందని ఇలా సూచిస్తుంటారు.

Why Women Should Eat Chocolate During Pregnancy

అయితే తినమన్నరు కదా అని ఏదీ పడితే అది నిరంతరం తినేయడం కాదు, తల్లి ఆరోగ్యానికి, బిడ్డ ఆరోగ్యానికి ఉపయోగకరమైన పౌష్టికాహారంనే తీసుకోవాలి. అలాగే మితిమీరి తినడం కూడా గర్భణీస్త్రీకి ఆరోగ్యకరం కాదని సలహా. సరైన పోషకాహారం రోజుకు సరిపడా మితంగా తీసుకోవడం వల్ల అనీమియా, బరువు తగ్గించడం మరియు ఇతర ప్రెగ్నెన్సీ సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు . పోషకాల లోపంను తగ్గించుకోవచ్చు. గర్భిణీ మహిళు కొన్ని సాధారణ ఆహారాల మీద ఎక్కువగా కోరికలను కలిగి ఉంటారు. ముఖ్యంగా ఊరగాయలు, పచ్చిమామిడి, స్వీట్స్, చికెన్, మరియు చాక్లెడ్స్ వంటి ఆహారాలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు!

మీకో విషయం తెలుసా? చాక్లెట్స్ తినడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. !ఈ విషయం మీకు కొద్దిగా ఆశ్చర్యం కలిగించినా ఇది నిజం. అయితే గర్భధారణ సమయంలో చాక్లెట్ తినడం మంచిదో కాదో ఖచ్చితంగా చెప్పలేము కానీ, చాక్లెట్స్ తినడం వల్ల బరువు పెరగడం, మొటిమలకు దారితీస్తుంది.

Why Women Should Eat Chocolate During Pregnancy

మీరు గర్భణీ అయితే, మీకు చాక్లెట్స్ అంటే ఎక్కువ ఇష్టమైతే మీకో శుభవార్త!

ఈ మద్యన కొత్తగా జరిపిన కొన్ని పరిశోధనల్లో గర్భిణీలు చాక్లెట్స్ తింటే తల్లి బిడ్డకు క్షేమం అని కనుగొన్నారు!

ఈ పరిశోధనల్లో కొంత మంది గర్భిణీలను రెగ్యులర్ బేస్ లో చాక్లెట్స్ తినమని సూచించారు. ఇలా రెగ్యులర్ గా చాక్లెట్స్ తినడం వల్ల యాంటీఆక్సిడెంట్స్ మరియు న్యూట్రీషియన్స్ ను పుష్కలంగా పొందుతారు. రెగ్యులర్ గా చాక్లెట్స్ తిన్న మహిళల్లో ప్రీఎక్లిప్సియ సమస్యలుండవని సూచిస్తున్నారు.

Why Women Should Eat Chocolate During Pregnancy

ప్రీఎక్లిప్సియా అంటే గర్భిణీ స్త్రీ రక్తప్రసరణలో హెచ్చుతగ్గులుంటాయి. 20వ వారం నుండి బిపి ఎక్కువగా ఉంటుంది. గర్భిణీలో హైబ్లడ్ ప్రెజరన్ వల్ల తల్లి బిడ్డకు క్షేమం కాదు.

ప్రీ ఎక్లిప్సియా వల్ల గర్భశ్రావం జరిగే అవకాశాలు ఎక్కువ, ప్రీమెచ్యుర్ డెలివరీ మరియు కొన్ని ప్రమాధకరస్థితిలో తల్లి లేదా బిడ్డ మరిణించే అవకాశాలు ఎక్కువ.

అందువల్ల , గర్భిణీ స్త్రీలు రెగ్యులర్ గా చాక్లెట్స్ తినడం వల్ల గర్భిణీ స్త్రీలలో రక్త ప్రసరణ మెరుగుపడినట్లు కనుగొన్నారు.

ఇంకా, చాక్లెట్స్ తినడం వల్ల గర్భాశయం మరింత స్ట్రాంగ్ గా మారుతుందని కనుగొన్నారు. ఆరోగ్యకరమైన బేబీ పుట్టుకకు ఈ గర్భశయ ఆరోగ్యం అత్యంత ముఖ్యమైనది.

చాక్లెట్స రెగ్యులర్ గా తినడం వల్ల ఫీటల్ డెవలప్ మెంట్ కు గ్రేట్ గా సహాయపడుతుంది, అంతే కాదు గర్భిణీ స్త్రీకి కూడా ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది.

ఇతరులతో పోల్చినప్పుడు గర్భణీలు డార్క్ చాక్లెట్స్ తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు.

గర్భిణీ స్త్రీలు వారంలో 5 డార్క్ చాక్లెట్స్ తినడం వల్ల మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు పొందుతారని రీసెంట్ గా జరిపిన పరిశోధనల్లో వెల్లడి చేశారు!

English summary

Why Women Should Eat Chocolate During Pregnancy?

While it is a fact that chocolates do come with certain health benefits, we may not be sure if it is a good idea to consume chocolates during pregnancy, as it is linked to weight gain, acne, etc. So, if you are a pregnant woman who loves chocolates, here is some good news!
Story first published:Monday, May 23, 2016, 11:48 [IST]
Desktop Bottom Promotion