For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  పిల్లలు లేనివారికి త్వరగా కన్సీవ్ అవ్వడానికి అమేజింగ్ ఐడియాస్

  By Sindhu
  |

  ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో జీవనశైలిలో చాలా మార్పులు వల్ల వ్యక్తుల ఆరోగ్యం మీద తీవ్రప్రభావం చూపుతున్నది. ముఖ్యంగా మహిళల ఆరోగ్యం మీద వివిధ రకాలుగా ప్రభావం చూపుతున్నది. ముఖ్యంగా స్త్రీ ప్రత్యుత్పత్తి మీద ఎక్కువ ప్రభావం చూపుతున్నది. గర్భం పొందాలంటే వివిధ రకాల కారణాలు ఉన్నాయి. వంధ్యత్వంతో బాధపడుతున్న స్త్రీలలో ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ప్రభావం చూపుతున్నది . ముఖ్యంగా అదిశరీరకంగా సమస్యలున్నా లేదా భర్తలో లోపాలున్నా త్వరగా గర్బం పొందడం అనేది అసాధ్యం. అలా గర్భం పొందాలనుకొనే వారు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ప్లాన్ చేసుకోవాలి . ఈ రోజుల్లో చాలా మంది జంటలు, కెరీర్, ఆర్థిక స్థితిగతుల, ఉద్యోగాలంటూ పెళ్ళి తర్వాత చాల రోజులు ప్రెగ్నెన్సీని పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. కారణం ఏదైనా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం. కాబట్టి, త్వరగా గర్భం పొందాలని కోరుకొనే వారి కోసం కొన్ని ఎఫెక్టివ్ మార్గాలను ఈ ఆర్టికల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాము.

  మీరు గర్భం పొందాలనే ప్రయత్నంలో ఉన్నా, అది వెంటనే ప్రతిఫలించకపోవచ్చు. అయితే అందుకు మీ ప్రయత్నంలో ఉన్నా, కన్సీవ్ (గర్భనిర్ధారణ) అవ్వడానికి కనీసం 3 నుండి 12 నెలల కాలం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సరైన మార్గాలను ఎంపిక చేసుకోవడం ద్వారా గర్భం త్వరగా పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి .

  ముఖ్యంగా త్వరగా గర్భం పొండానికి స్త్రీ మరియు పురుషుల యొక్క ఇద్దరి ఆరోగ్యం, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ఓవొలేషన్ డేట్స్, మరియు ముఖ్యంగా మీ జీవనశైలి మీద ఎక్కు ప్రభావం చూపుతుంది. త్వరగా గర్భం పొందడానికి కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు సహాయపడుతాయి. మరియు ఇంకా కొన్ని ప్రత్యేకమైన చిట్కాలను కూడా అనుసరించినట్లైతే అది మీ గర్భాశయ మరియు ఫెర్టిలిటి మీద ఎక్కువ ప్రభావం చూపి, త్వరగా ప్రయోజనం చేకూర్చుతుంది. మరి ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటో ఒక సారి తెలుసుకుందాం...

  ఫోలిక్ యాసిడ్ మరియు ఐరన్:

  ఫోలిక్ యాసిడ్ మరియు ఐరన్:

  త్వరగా గర్భం పొందాలంటే ఫోలిక్ యాసిడ్ మరియు ఐరన్ క్రమం తప్పకుండా తీసుకోవాలి . ఇది పిండాభివ్రుద్దికి మరియు శిశువు పుట్టుకలో లోపాలను నివారించడానికి సహాయపడుతుంది.

  ఓవలేషన్ క్యాలెండర్

  ఓవలేషన్ క్యాలెండర్

  త్వరగా గర్భం పొందాలని కోరుకొనే వారు ఓవలేషన్ కిట్ ను మీ దగ్గర ఉంచుకొని, పీరియడ్స్ అయిన 5వ రోజు నుండి 15వ రోజు వరకూ బాడీ టెంపరేచర్ ను గమనిస్తుండాలి . ఈ సమయంలో ముఖ్యంగా 10-14రోజుల మద్య కాలవ్యవధిలో గర్భం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

  హైలిబిడో ఫుడ్స్

  హైలిబిడో ఫుడ్స్

  కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు త్వరగా గర్భం పొందడానికి సహాయపడుతాయి. ఇది కామేచ్చను పెంచుతాయి. మరియు ఎనర్జీని అందిస్తాయి. అలాంటి ఆహారాల్లో బ్లాక్ రాస్బెర్రీస్, బ్రొకోలీ, ఫిగ్స్, వాటర్ మెలోన్, గుడ్లు, కుంకుమపువ్వు, లెట్యూస్, అల్లం, అవొకాడో, బీన్స్, ఫ్లాక్స్ సీడ్స్ వంటివి గ్రేట్ గా సహాయపడుతాయి

  డైరీ ప్రొడక్ట్స్

  డైరీ ప్రొడక్ట్స్

  సంతానోత్పత్తిని పెంచడానికి డైరీ ప్రొడక్ట్స్ చాలా గ్రేట్ గా సహాయపడుతాయి. ముఖ్యంగా ఇవి సంతానోత్పత్తికి ముఖ్యంగా అవసరం అయ్యే ఎఫ్ హెచ్ ఎస్ మరియు ఎల్ హెచ్ హార్మోనులను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతాయి.

  విటమిన్ సి

  విటమిన్ సి

  త్వరగా గర్భం పొందాలని కోరుకొనే వారు వారి రెగ్యులర్ డైట్ లో విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి . మహిళల్లో ప్రత్యుత్పత్తిని వేగవంతంగా చేయడానికి ఇవి చాలా గ్రేట్ గా సహాయపడుతాయి.

  పార్ట్నర్ యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థ

  పార్ట్నర్ యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థ

  పాట్నర్ ఆల్కహాల్ మరియు స్మోకింగ్ తీసుకొనే వారైతే వారిలో ప్రత్యుత్పత్తి వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. దాంతో వీర్య కణాల సంఖ్యలో, మరియు వీర్యకణాల నాణ్యతలో చాలా లోపాలు ఉంటాయి. కాబట్టి, వారి ఈ అలవాట్ల నుండి దూరంగా ఉండమని చెప్పండి

  సెక్స్ పొజిషన్

  సెక్స్ పొజిషన్

  సెక్స్ పొజిషన్ తెలుసుకోకుండా గర్భం పొందడానికి అనుసరించే చిట్కాలు అసంపూర్ణంగా ఉండవచ్చు. సెక్స్ భంగిమ తెలుసుకోవడం ద్వారా స్మెర్మ్ త్వరగా అండాన్ని చేరడానికి అవకాశం ఉంటుంది సంభోగం తర్వాత హిప్స్ క్రింద పిల్లో వేసుకొని కనీసం 20నిముషాలు అలాగే పడుకోవాలి. అప్పుడే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది

  లూబ్రికేషన్ ను నివారించాలి:

  లూబ్రికేషన్ ను నివారించాలి:

  మీరు కనుకు ఇప్పటికే గర్భం పొందిఉన్నట్లైతే లూబ్రికేషన్ బేబీకి హానిక కలిగిస్తుంది.

  ఆల్కహాల్ మరియు కెఫిన్ తగ్గించాల

  ఆల్కహాల్ మరియు కెఫిన్ తగ్గించాల

  ఆల్కహాల్ మరియు అధనపు కెఫిన్ కడుపులో పెరుగుతున్న పిండి మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది . మరియు గర్భం పొందే ప్రొసెస్ ను హైడ్ చేస్తుంది

  డాక్టర్ ను సంప్రదించాలి

  డాక్టర్ ను సంప్రదించాలి

  ఈ చిట్కాలన్నింటితో పాటు, డాక్టర్ ను తప్పని సరిగా కలిసి, సంతానోత్పత్తికి అవసరం అయ్యే పరీక్షలు చేయించుకోవాలి . మరియు మహిళలు త్వరగా సంతానోత్పత్తి పొందాలంటే, బరువు తగ్గించుకోవాలి.

  English summary

  10 Ways to Get Pregnant Faster

  There can be a variety of reasons for a woman wanting to conceive faster. Different woman has different reasons for wanting to get pregnant, which could be either biological clock ticking or husband in the armed forces who is about to be deployed or maybe it's just the right time as you planned.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more