గర్భిణీలలో పాదాల వాపు తగ్గించే ఆహారాలు

Posted By: Mallikarjuna
Subscribe to Boldsky

సాధారణంగా మహిళలు గర్భిణీగా వున్నపుడు కాళ్ళు వాపు రావటమనేది సహజం. అది అసౌకర్యమే. కాదనేది లేదు. గట్టిగా చెప్పే కారణం కూడా కనపడదు. కాళ్ళు మాత్రమే కాదు శరీరమంతా కూడా ఉబ్బుతుంది. గర్భవతిగా వున్నపుడు మీరు లావెక్కినపుడు అందులో మూడు వంతుల బరువు నీటిది మాత్రమే. కనుక బిడ్డ పుట్టిన తర్వాత ఈ బరువు తగ్గటానికి మీరు శ్రమపడాల్సిన అవసరంలేదు. నీటి వలన ఏర్పడిన బరువు దానంతట అదే తగ్గిపోతుంది. సమస్య తీవ్రత ఎపుడు అధికంగా వుంటుందంటే....బాగా అలసిన తర్వాత రాత్రి పడుకునేటపుడు ఎండా కాలంలో చాలా బాధాకరంగా వుంటుంది.

పాదాలలో ఎందుకు వాపు కనబడుతాయి? వైద్య భాషలో దీనిని ఎడిమా అంటారు. శరీరం అధిక నీటిని గ్రహించడం వల్ల ప్రెగ్నెన్సీ సమయంలో పిండం ఎదుగుదలకు కష్టం అవుతుంది. మీ బేబీ కడుపులోని నీటిలో తేలియాడుతూ వుంటుంది. ఈ అదనపు నీరు అంతా ఎక్కడికో అక్కడికి పోవాలి కనుక అది శరీరం కిందిభాగమైన కాళ్ళలోకి చేరిపోతుంది. పొట్ట పెరుగుతూంటే, దిగువ భాగం శరీరంపై ఒత్తిడి పెరుగుతుంది. రక్తసరఫరా నిమ్మదిస్తుంది. గర్భిణీకి మూడవ త్రైమాసికంలో కాళ్ళు, చేతులు వాపురావటం అధికంగా వుండి అసౌకర్యాన్ని కలుగజేస్తుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవ‌డం ద్వారా కాళ్ళవాపులు, పాదాల వాపుల నుంచి కొంచెం ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు.

home remedies for swollen feet | remedies for swollen feet during pregnancy | how to treat swollen feet during pregnancy

సాధార‌ణంగా 75 శాతం మంది గ‌ర్భిణీ స్త్రీల‌కు ఏడ‌వ మాసం వ‌చ్చేస‌రికి పాదాలు,కాళ్ళకు వాపులు వ‌స్తాయ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.ఉద్యోగ‌స్తులైన‌ గ‌ర్భిణీ స్త్రీలు ప‌గ‌టిపూట విశ్రాంతి లేకుడా ఎక్కువ స‌మ‌యం బ‌య‌ట‌నేగ‌డ‌ప‌డం,కాళ్ళు క్రింద‌కు వేళ్ళాడేసి కూర్చోవ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య మ‌రింత ఎక్కువ‌గగా ఉంటుంది.కాబ‌ట్టి ఉద‌యం పూట కొంచెం ఉప‌శ‌మ‌నంగా వుంటుంది. ప‌గ‌లు మ‌ళ్ళీ వాపులు రావ‌డం మామూలే. కాబట్టి ప్రతి రోజూ కొంత నడక, అలాగే డాక్టర్ సలహా మేరకు వ్యాయామం చేయడం చాలా అవసరం.

పాదాల వాపులు ఏవైనా హెచ్చరిక సంకేతాలను సూచిస్తాయా?

గర్భిణీలలో కొద్దిగా కాళ్ళు వాపు రావడం సాధారణం. కానీ కొన్ని పరిస్థితుల్లో ఓడిమా ప్రమాధకరం. పాదాల్లో నీరు ఎక్కువగా చేరితే ఎక్లాంప్సియా కాంప్లికేషన్స్ వస్తాయి.

పాదాల వాపులు మాత్రమే కాదు, ముఖం, కళ్ళు , చేతులు, పాదాలు, మడిమలు కూడా ఎక్కువ వాపుతో కనబడుతాయి.

పాదాలలో ఎక్సెసివ్ ఓడీమా కనబడితే , వాపు ఉన్న పాదాలలో నొప్పి కూడా ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో వెంటనే డాక్టర్ ను కలవాలి. ఇది రక్తం గడ్డ కట్టడాన్ని సూచిస్తుంది.

ఓడీమా కారణంగా శరీరంలో ఎక్సెస్ ఫ్లూయిడ్స్ శరీరంలో కణాలను సేకరిస్తుంది. ఓడిమా మరింత తీవ్రం అవుతుంది.

ఇలాంటి పరిస్థితిలో గుండె పనిచేయడానికి మరింత కష్టపడాల్సి వస్తుంది. గర్భధారణ సమయంలో రక్తప్రసరణ సరిగా జరగదు. శరీరం ఒత్తిడి లోనవుతుంది. కాళ్ళు వాపుల కారణంగా యూట్రస్ మీద ఒత్తిడి పెరుగుతుంది. హార్ట్ కు ఆక్సిజన్ సర్ఫరా చేయడానికి ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది. రక్తప్రసఱన సరిగా జరగక కాళ్ళు, పాదాల్లోకి నీరు చేరుతాయి.

పాదాల వాపులకు సహజం నివారణలుగా మీరు ఏం చేయాలి..

  • ఎత్తులో కూర్చొన్నప్పుడు పాదాలను క్రింద ఏదైనా పీట లేదా స్టూల్ వంటిది వేసుకుని పాదాలు పైకి ఉండేట్లు చూసుకోవాలి.
  • క్రాస్ లెగ్స్ లేదా చక్కామక్కాల్ వేసుకుని కూర్చోకూడదు.
  • స్ట్రెచ్చింగ్ చాలా ముఖ్యం. పాదాలు, కాళ్ళ, మడమలను అప్పుడప్పుడు స్ట్రెచ్ చేయడం చాలా అవసరం.
  • ఎక్కువ సమయం కూర్చొని ఉండటం లేదా నిల్చొని ఉండకూడదు. చిన్న పాటి నడక వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
  • టైట్ సాక్సులు, లేదా స్టాకింగ్స్ వేసుకోవడం మానేయాలి.
  • ఎప్పుడూ సౌకర్యవంతమైన షూలను ధరించాలి.
  • బ్యాలెన్స్డ్ డైట్ మరియు రెగ్యులర్ వ్యాయంమంత తప్పనిసరి
  • తీసుకును ఆహారం ఆరోగ్యకరమైనది, క్లీన్ గా ఉండేలా చూసుకోవాలి. జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి.
  • పాదాల వాపులను తగ్గించడానికి కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి.
  • ఈ సింపుల్ హోం రెమెడీస్ ను ఇంట్లో ప్రయత్నించవచ్చు.

ఈ హోం రెమెడీస్ తో తగ్గకపోతే డాక్టర్ ను కలవడం చాలా అవసరం. వీటితో పాటు కొన్ని న్యాచురల్ హోం రెమెడీస్ మీకోసం..

1. శరీరం ఎప్పుడు తేమగా ఉంచుకోవాలి:

1. శరీరం ఎప్పుడు తేమగా ఉంచుకోవాలి:

గర్భధారణ సమయంలో తగినన్ని నీళ్ళు తాగాలి. ఎక్కువగా నీళ్ళు తాగడం వల్ల శరీరంలో టాక్సిన్స్ తొలగిపోతాయి. శరీరంలో వాటర్ తగ్గుతుంది. ఎక్సెస్ ఫ్లూయిడ్స్త తగ్గుతాయి.

2. ధనియాలు:

2. ధనియాలు:

ధనియాలు వినియోగం పురతాన కాలం నాటిది. ధనియాలను రాత్రినీళ్ళలో నానబెట్టి, ఉదయం ఆ నీటితో సహా ధనియాలు ఉడికించాలి. తర్వాత రోజు కొద్దికొద్దిగా తాగాలి.

3. డాండలైన్ టీ:

3. డాండలైన్ టీ:

డ్యాండలైన్ టీ శరీరం తిరిగి పూర్వస్థితికి చేరుకునేందుకు సహాయపడుతుంది. డ్యాండలైన్ వేరును నీటిలో వేసి ఉడికించి టీ రూపంలో తీసుకోవాలి. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది.

4. క్యాబేజ్ ఆకులు:

4. క్యాబేజ్ ఆకులు:

క్యాబేజ్ శరీరంలో ఎక్సెస్ వాటర్ ను తగ్గిస్తుంది. క్యాబేజ్ ఆకులతో పాదాలను కవర్ చేయలి. ఓడిమా సమస్యకు ఇన్ స్టాంట్ రెమెడీ ఇది.

5. కీరదోసకాయ:

5. కీరదోసకాయ:

కీరదోసక కూలింగ్ వెజిటేబుల్. ఇందులో వాటర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల ప్రతి రోజూ వీటిని తినడం వల్ల శరీరం హైడ్రేషన్ లో ఉంటుంది. సన్నని స్లైస్ లా కట్ చేసి తినడం వల్ల శరీరంలో టాక్సిన్స్, మరియు ఎక్సెస్ వాటర్ తొలగిపోతుంది.

6. యాపిల్:

6. యాపిల్:

యాపిల్ గ్రేట్ ఫ్రూట్ , ఇందులో న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. కిడ్నీలు సరిగా పనిచేయడానికి ఇది సహాయపడుతుంది. ఇది శరీరంలో అనవసరపు ద్రవాలను తొలగిస్తుంది. రోజూ ఆపిల్ తీసుకోవడం వల్ల పాదాల వాపులు తగ్గుతాయి.

7. వాటర్ మెలోన్:

7. వాటర్ మెలోన్:

వాటర్ మెలోన్ లో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల శరీరం హైడ్రేషన్ లో ఉంటుంది. శరీరంలో వ్యర్థాలను ఇతర చెడు ద్రవాలను తొలగిస్తుంది.

8.ఆరెంజ్ :

8.ఆరెంజ్ :

ఆరెంజ్ లో కూడా నీరు ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి అధికంగా ఇది శరీరంలో వ్యర్థాలనుతొలగిస్తుంది. ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ చేస్తుంది.

9.గోరువెచ్చని నీటిలో పాదాలను డిప్ చేయాలి:

9.గోరువెచ్చని నీటిలో పాదాలను డిప్ చేయాలి:

పాదాలను నీళ్ళలో నానబెట్టుకోవాలి: కాళ్ళను నీళ్ళలో ఉంచడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. కాబట్టి డాక్టర్ సలహా మేరకు గర్భిణీ స్విమ్మింగ్ చేయడం కూడా మంచిదే. ఒక వేళ అది వీలుకాకపోతే, మీ శరీరాన్ని టబ్ లో కొంత సేపు విశ్రాంతి పరచండి. అయితే ఖచ్చితంగా టబ్ బాటర్ చాలా వేడిగా లేకుండా చూసుకోండి. చాలా వేడిగా ఉన్న నీళ్ళు ప్రెగ్నెంట్ మహిళలకు అంత మంచిది కాదు.

10. పాదాలను ఎలివేట్ చేయాలి:

10. పాదాలను ఎలివేట్ చేయాలి:

రోజంతా పాదాల ఫ్రీగా ఉండేట్లు చూసుకోవాలి. సున్నితమైన మర్ధన వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. పాదాల్లో నీరు చేరకుండా చేస్తుంది.

11.సున్నితమైన ఆయిల్ మసాజ్ :

11.సున్నితమైన ఆయిల్ మసాజ్ :

యూకలిప్టస్, లెమన్, పెప్పర్ మింట్, ల్యావెండర్ ఆయిల్స్ తో పాదాలకు సున్నితమైన మసాజ్ చేయాలి. ఎక్సెస్ ఫ్లూయిడ్ టిష్యులు తొలగిపోతాయి. రక్తప్రసరణ మెరుగుఅవుతుంది.

12. లైట్ యోగ:

12. లైట్ యోగ:

గర్భిణీలు చిన్న పాటి యోగాసనాలు చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది.

13. కెఫిన్ తగ్గించాలి:

13. కెఫిన్ తగ్గించాలి:

గర్బిణీలు కాఫీ, కెఫిన్ కలిగిన కార్బోనేటెడ్ డ్రింక్స్ తగ్గించడం వల్ల పాదాల వాలపులు కంట్రోల్లో ఉంటాయి.

14. ఎడమవైపు తిరిగి పడుకోవాలి:

14. ఎడమవైపు తిరిగి పడుకోవాలి:

గర్భిణీ స్త్రీలు, ఎడమ వైపుకు తిరిగి పడుకోవడం వల్ల వారికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఎడమవైపుకు తిరిగి పడుకోవడం వల్ల బ్లడ్ సర్యులేషన్ బాగా జరుగుతుంది. కాబట్టి చాలా వరకూ మీరు ఎడమ వైపుకు తిరిగి పడుకోవడానికి ప్రయత్నించండి.

15. ప్రోటీన్స్ ఎక్కువ ఉండే ఆహారాలు తీసుకోవాలి.

15. ప్రోటీన్స్ ఎక్కువ ఉండే ఆహారాలు తీసుకోవాలి.

ప్రోటీనులు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకుంటే సోడియం కంటెంట్ ఫుడ్స్ ను తగ్గించాలి. పొటాషిం ఎక్కువగా ఉన్న అరటి, బంగాళదుం వంటివి తినడం వల్ల ఓడిమా తగ్గుతుంది.

English summary

home remedies for swollen feet | remedies for swollen feet during pregnancy | how to treat swollen feet during pregnancy

The heart works doubly hard during the woman's pregnancy to keep the blood circulating properly through the body. The extra strain on the heart will cause retention of fluid in the extremities of the body. If we look at the legs, the growing uterus puts a lot of pressure on the inferior vena cava.