For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ పనులు 15 చేస్తే తప్పకుండా గర్భం పొందుతారు !

By Mallikarjuna
|

మహిళ గర్భం పొందడం ఒక అద్భుతమైన అనుభూతి, పెళ్ళైన ప్రతి మహిళ తల్లికావలని కోరుకుంటుంది. గతంలో మహిళల ఆహారం, అలవాట్లు, వేరుగా ఉండేవి. ఒత్తిడి అనే మాట తెలిసేది కాదు, ముఖ్యంగా పెళ్ళి వయస్సు 18 నుండి 25లోపు పెళ్లిళ్ళు చేసేయడం వల్ల గర్భం పొందడం సులభం అవుతుండేది.

కానీ ప్రస్తుత యాంత్రిక యుగంలో ఉరుకుల పరుగుల జీవితం, వ్యాయామలేమి, ఒత్తిడి, సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల మహిళల్లో హార్మోనుల్లో అసమతుల్యతల కారణంగా చాలా మంది వంద్యత్వానికి గురి అవుతున్నారు. కొంత మంది కెరిరీ, చదువులంటే లేట్ వయస్సులో పెళ్లి చేసుకోవడం వల్ల కూడా పిల్లలు పుట్టక ఆలస్యం అవ్వడం లేదా పిల్లలు కలగకపోవడం జరుగుతోంది.

ఇటువంటి పరిస్థితిలో పిల్లల కోరికునే వారు కన్సీవ్ అవ్వడానికి ముందు డాక్టర్ ను కలవడం మంచిది. డాక్టర్ కన్సివ్ అవ్వడానికి చేయాల్సినవి, చేయకూడని వాటి గురించి వివరించడం వల్ల మహిళలో కొంత అవగాహాన కలుగుతుంది. వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబ చరిత్ర,మెడికేషన్ గురించి సవివరంగా వివరించడం జరుగుతుంది. గర్భం పొందడానికి డాక్టర్లు కొన్ని ప్రత్యేకమైన మందులతో పాటు, కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను సూచించడం జరుగుతుంది. గర్భం పొందడానికి కొన్ని సూచనలు క్రింది విధంగా..

కాఫీకి చెక్:

కాఫీకి చెక్:

కాఫీ ఎక్కువగా తాగడం గర్భధారణకు అంత మంచిది కాదు, కాఫీని పూర్తిగా మానేయడం కానీ లేదా తక్కువగా తాగడం కానీ చేయాలి. కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వంద్యత్వానికి కారణం అవుతుంది. అలాగే గర్భస్రావం జరుగుతుంది.

హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం:

హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం:

గర్భధారణ ప్లాన్ చేసుకునే వారు కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. న్యూట్రీషియన్ ఫుడ్స్ అధికంగా ఉండేట్లు చూసుకోవాలి.

ఓబేసిటి మరియు వ్యాయామం:

ఓబేసిటి మరియు వ్యాయామం:

ఓబేసిటి, స్ట్రెస్ తో కూడిన జీవనశైలి వల్ల గర్భం పొందలేకపోవచ్చు. రోజూ అరగంట బ్రిస్క్ వాక్, చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వల్ల ఫిట్ గా ఉండవచ్చు. అలాగే యోగ, మరియు ఇతర ఫిట్ నెస్ వ్యాయామాలు చేయడం వల్ల ఆరోగ్యంగా, ఫ్లెక్సిబుల్ గా ఉండవచ్చు.

పిల్స్ తీసుకోవడం మానేయాలి:

పిల్స్ తీసుకోవడం మానేయాలి:

ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వారు, బర్త్ కంట్రోల్ పిల్స్ ను తీసుకోవడం మానేయాలి. ఇవి మానేయడం వల్ల శరీరంలో హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి. వీటి గురించి అవగాహన లేకపోతే డాక్టర్ ను కలవడం ఉత్తమం.

సినిమాలకు వెళ్ళాలి:

సినిమాలకు వెళ్ళాలి:

గర్భం పొందిన తర్వాత ఫ్యామిలితో, ఫ్రెండ్స్ తో కలవడానికి సమయం ఉండకపోవచ్చు. వాస్తవానికి ఇంట్లో ఎక్కువ సమయం ఒకే చోట కూర్చోవడం వల్ల ఆరోగ్యపరంగా సమస్యలువస్తాయి. అందువల్ల, అప్పుడప్పుడు అవుటింగ్ కు వెళ్ళడం, మూవిస్ కు వెళ్ళడం చేస్తుండాలి.

చిన్న మొత్తాలను సేవ్ చేయడం

చిన్న మొత్తాలను సేవ్ చేయడం

పిల్లలను కనడం అంత సులభం కాదు, ప్రసవం ముందు నుండే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. అలాగే ఆర్థికపరంగా డబ్బు సేవ్ చేసుకోవడం వల్ల చివరి నిముషాల్లో ఇబ్బంది పడకుండా ఉండవచ్చు. తర్వాత బేబికి కావల్సిన అవసరాలను తీర్చుకోచ్చు,

స్ట్రెస్ తగ్గించుకోవాలి:

స్ట్రెస్ తగ్గించుకోవాలి:

ఒత్తిడి తగ్గించుకోవడం వల్ల గర్భం పొందడం కానీ, గర్భధారణ పూర్తి సమయం కానీ ఆరోగ్యంగా ఉంటారు.అందుకు మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడం, సినిమాలకు వెల్లడం, ఫోటగ్రఫీ, డ్రాయింగ్, స్టోరీ బుక్స్, అల్లికలు వంటి సాధ్యమైనవి చేయడం వల్ల కాన్ సెంట్రేన్ మరో వైపుకు వెళుతుంది.

ఒత్తిడి తగ్గించుకోవడానికి ముందుగా ప్లాన్ చేసుకోవాలి.

ఒత్తిడి తగ్గించుకోవడానికి ముందుగా ప్లాన్ చేసుకోవాలి.

మీరుగనుక జాబ్ చేస్తుంటే, కన్సీవ్ అవ్వడానికి ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. కన్సీవ్ అయిన తర్వాత మెటర్నిటీ లీవ్ ఎప్పుడు తీసుకోవాలి అని నిర్ణయించుకోవచ్చు.

తల్లిమాటలు:

తల్లిమాటలు:

మహిళ జీవితంలో గర్భధారణ చాలా ముఖ్యమైన సందర్భం. అప్పటి వరకూ ఏం చేసినా, ఎలా ఉన్నా ఎలాంటి సమస్యలుండవు. అయితే గర్భం పొందిన తర్వాత అమ్మ, అక్కలు, బందువులు, స్నేహితులతో కలిసి మాట్లాడటం వల్ల గర్భధారణలో వచ్చే సమస్యలను ముందు నుండి నివారిచంచుకోవచ్చ.

దంత సంరక్షణ

దంత సంరక్షణ

గర్భం పొందడానికి ప్రయత్నిస్తుంటే, తప్పకుండా దంత సంరక్షణ తప్పనిసరిగా తీసుకోవాలి. హార్మోనుల్లో మార్పుల వల్ల దంత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. చిగుళ్ళు వాపులు, చిగుళ్ళ నుండి రక్తస్రావం జరుగుతుంది. అదే కాకుండా, ఓరల్ హెల్త్ సమస్యలు కూడా ఉంటాయి. గర్భస్రావం, ప్రీటర్మ్ బర్త్ వంటి సమస్యలుంటాయి.

చెడు అలవాట్లకు దూరంగా:

చెడు అలవాట్లకు దూరంగా:

డ్రగ్స్, స్మోకింగ్, ఆల్కహాల్ వంటివి ఆరోగ్యానికి మంచిది కాదు, ఇవి గర్భధారణ మీద ప్రభావం చూపుతాయి. స్మోకింగ్ అండ్ ఆల్మహాల్ తీసుకోవడం వల్ల పుట్టే పిల్లల్లో లోపాలు ఏర్పడుతాయి. లేదా గర్భస్రావానికి కారణం అవుతాయి. ధూమపానం వల్ల టుబ్యాకో వల్ల వంద్యత్వం వస్తుంది. ఆల్కహాల్ బేబీ పుట్టకలో లోపాలకు కారణం అవుతుంది. అందువల్ల ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వారు తప్పనిసరిగా ఈ చెడు అలవాట్లుకు దూరంగా ఉంటూ డాక్టర్ సూచనలు విధిగా పాటించాలి.

షాపింగ్ చేయకూడదు:

షాపింగ్ చేయకూడదు:

గర్భం పొందాలని కోరుకునే వారు, షాపింగ్ చేయకూడదు ఎందుకంటే గర్భపొందడానికి ముందు కొనే దుస్తులు గర్భం పొందిన తర్వాత ఫిట్ అవ్వకపోవచ్చు, ముఖ్యంగా రెండవ త్రైమాసికంలో (గర్భం పొందిన మూడు నెలల తర్వాత) మెటర్నిటీ దుస్తులు తీసుకోవచ్చు.

 పేరెంటింగ్ టాక్స్

పేరెంటింగ్ టాక్స్

కాబోయే తల్లి విషయంలో చాలా విషయాల్లో అపోహలు, అనుమానాలు ఉంటాయి, ఇవి పార్ట్నర్ కంటే తల్లికి వద్ద క్లియర్ చేసుకోవడం ఉత్తమం, పిల్లల సంరక్షణ, సంప్రదాయలు, ఇల్లు, ఉద్యోగం వంటి విషయాల పట్ల తగిన ప్లానింగ్ ను చేసుకోవడం వల్ల భార్య భర్తల మద్య అపార్థాలు దారి తియ్యవు.

పెట్స్ ఉండకూడదు:

పెట్స్ ఉండకూడదు:

గర్భధారణకు ప్లాన్ చేసుకునే వారి ఇల్లలో ఆ సమయంలో పెంపుడు జంతువులు ఇంట్లో లేకపోవడమే మంచిది, ఎందుకంటే పెట్స్ ద్వారా బ్యాక్టీరియ, ప్యారాసైట్ త్వరగా వ్యాప్తి చెంది, ప్రెగ్నెన్సీ అడ్డంకు ఏర్పరుస్తుంది.

పిల్లలను కనడం, పిల్లల పెంపకం అంత సులభం కాదు,

పిల్లలను కనడం, పిల్లల పెంపకం అంత సులభం కాదు,

గర్భం పొందడానికి మీరు అన్ని విధాలుగా రెడీగా ఉన్నారో లేదో మీ మనస్సును ఒకసారి అడిగి చూసుకోవాలి. మీకు పాజిటివ్ గా అనిపిస్తే వెంటనే ప్లాన్ చేసుకోచ్చు. జీవితంలో మార్పులు చేర్పులు చేసుకోవడం ద్వారా గర్భం పొందడం సులభం అవుతుంది.

English summary

15 Things To Do To Get Pregnant

There are certain things that need to be analyzed before you conceive and hence a visit to your doctor is of utmost necessity. The doctor would be able to suggest the dos and don’ts of pregnancy. Your personal health record, family history and the data of your medication is to be thoroughly analyzed as well. The doctor would need to change certain medicines and tell you of the right diet for pregnancy.
Desktop Bottom Promotion