గర్భధారణ సమయంలో ఉండే 8 సాధారణ అపోహలు మరియు వాస్తవాలు

Posted By: Lakshmi Perumalla
Subscribe to Boldsky

గర్భధారణ సమయంలో ఎన్నో అపోహలను వింటూ ఉంటాం. అలాగే వాటి గురించి కూడా చాలా భయాలు ఉంటాయి. ఈ అపోహలు అనేవి జరగచ్చు లేదా జరగకపోవచ్చు. చాలా అపోహలకు శాస్రియమైన నిరూపణ కూడా లేవు. కాబట్టి అటువంటి కొన్ని అపోహల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పే ఈ అపోహలు సాధారణంగా గర్భధారణ సమయంలో ప్రతి ఒక్కరు వింటారు. వాటి గురించి తెలుసుకుందాం.

గర్భధారణ సమయంలో సెక్స్ తో ప్రయోజనాలు!

అపోహ 1

అపోహ 1

గర్భధారణ సమయంలో కడుపు ఆకారం గురించి ఒక అపోహ ఉంది. ఒక మహిళ ఎక్కువ రోజులు గర్భాన్ని మోస్తే అమ్మాయని,తక్కువ రోజులు మోస్తే అబ్బాయిని అంటారు.

నిజం

ఈ అపోహకు శాస్త్రీయ నిరూపణ లేదని నిపుణులు అంటున్నారు. గర్భం ధరించిన మహిళ యొక్క కడుపు పరిమాణం కండరాల పరిమాణం, నిర్మాణం, పిండం యొక్క స్థానం, భంగిమ మరియు పొత్తికడుపు చుట్టూ ఉన్న కొవ్వు మొత్తం మీద ఆధారపడి ఉంటుంది.

అపోహ 2

అపోహ 2

గర్భధారణ సమయంలో ఉప్పు ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలనే కోరిక ఉంటే అబ్బాయిని,తీపి పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలనే కోరిక ఎక్కువగా ఉంటే అమ్మాయని భావిస్తారు.

నిజం

ఈ కోరికలకు అడ లేదా మగ పిల్లలు పుట్టటానికి ఎటువంటి సంబంధం లేదని నిపుణులు అంటున్నారు.

అపోహ 3

అపోహ 3

గర్భధారణ సమయంలో కడుపులో బిడ్డ తిరిగే విధానాన్ని బట్టి చెప్పుతారు. కడుపులో వెనక్కి కదిలితే అబ్బాయిని, గుండ్రంగా తిరిగితే అమ్మాయని చెప్పుతారు.

నిజం

ఈ విషయంలో కూడా నిజం లేదు.

అపోహ 4

అపోహ 4

గర్భధారణ సమయంలో గుండె మంట ఉంటే పుట్టబోయే బిడ్డకు ఎక్కువగా జుట్టు ఉంటుందని చెప్పుతారు. గర్భిణీ స్త్రీలకు గుండె మంట అనేది ఒక సాధారణ సమస్య. దీనికి జుట్టుకు ఎటువంటి సంబంధం లేదు.

నిజం

గర్భధారణ సమయంలో గుండె మంట ఉన్న మహిళలలో చాలా మందికి జుట్టు తక్కువగా ఉన్న పిల్లలు పుట్టారు.

అపోహ 5

అపోహ 5

గర్భం ధరించిన స్త్రీ తల్లికి నార్మల్ డెలివరీ అయితే తమకు కూడా నార్మల్ డెలివరీ అవుతుందని నమ్ముతారు.

నిజం

వంశపారంపర్య కారకాలకు మీ గర్భధారణ డెలివరీ సులభమా లేదా కష్టంమా అని ఊహించడంలో పాత్ర ఉండదు. దీనికి విరుద్ధంగా, శిశువు యొక్క పరిమాణం మరియు స్థానం, మీ ఆహారం మరియు జీవన విధానం కీలకమైన పాత్రను పోషిస్తాయి.

గర్భధారణ సమయంలో వైబ్రెటర్స్ ని ఉపయోగించడం సురక్షితమా?

అపోహ 6

అపోహ 6

నిద్ర భంగిమ బిడ్డకు హాని చేస్తుంది.

నిజం

వెల్లికిలా పడుకోవటం అనేది మీ శిశువుకు హాని చేయకపోయినా, ఒక వైపుకు పడుకోవటం మంచిది. మీ గర్భాశయం మరియు మావికి రక్త ప్రవాహాన్ని పెంచుతుందని నిపుణులు మీ ఎడమ వైపు పడుకోమని చెపుతారు.

అపోహ 7

అపోహ 7

సెక్స్ చేస్తే బిడ్డకు ఇబ్బంది అవుతుంది

నిజం

మీ శిశువును ఉదర గోడ నుండి ఎమినోటిక్ శాక్ కు చర్మం ఏడు పొరలు కాపాడతాయని తెలుసుకోవాలి. మీ గర్భాశయం దీర్ఘంగా మరియు గర్భాశయం లోకి ఏదైనా నివారించడానికి గట్టిపడతాయి. ఇన్ ఫెక్షన్స్ రాకుండా శ్లేష్మంను విడుదల చేస్తుంది. సెక్స్ అనేది మీ బిడ్డను చేరుకోదు. మీ డాక్టర్ సెక్స్ నుండి దూరంగా ఉండమని మీకు చెప్పితే పారిపోకుండా ముందుకు సాగండి.

అపోహ 8

అపోహ 8

మొదటి పిల్లలు ఎల్లప్పుడూ ఆలస్యంగా పుడతారు

నిజం

దాదాపు 60 శాతం మంది గడువు ముగిసాక పుడతారు. ఐదు శాతం మంది గడువు లోపు పుడతారు. మీ శిశువు యొక్క రాక నిజంగా మీ ఋతు చక్రం మీద ఆధారపడి ఉంటుంది. ఋతు చక్రం ముందుగా ఉంటే తొందరగా బిడ్డ పుట్టే అవకాశం ఉంటుంది. ఋతు చక్రం లేటుగా ఉంటే గడువు తేదీ అయినా తర్వాత పుడతారు. ఋతు చక్రం సరిగ్గా 28 రోజులకు ఉంటే సరిగ్గా ఇచ్చిన గడువుకు బిడ్డ పుడుతుంది.

English summary

The Top 8 Most Common Pregnancy Myths busted

Do this. Don't do that. With all the pregnancy advice out there, it's hard to know what to believe or whom to believe. Here are some things you often hear when the stork has decided to pay a visit.
Story first published: Tuesday, September 19, 2017, 9:45 [IST]