గర్భిణీలు 9 వ నెలలో ఎలాంటి ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది

Posted By:
Subscribe to Boldsky

సహజంగా గర్భం పొందిన తర్వాత , బేబీ పుట్టడానికి ముందు కొన్ని రోజుల ముందు సంతోషంగా గడపడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఇదే మంచి సమయం.

గర్భధారణ కాలం చివర్లో, 9వ నెలలో, కొన్ని చాలెంజెస్ ను ఎదుర్కోవల్సి ఉంటుంది, 9 నెలలో గర్భిణీలు, ఎక్కువ భారంగా ఫీలవుతారు , కొద్దిగా అసౌకర్యంగా కూడా ఫీలవుతారు. ఇక్కడ కొద్దిగా ఎక్సైట్ మెంట్ కూడా ఉంటుంది. పుట్టబోయే బిడ్డగురించి కొద్దిగా సంతోషం, ఆత్రుత ఉంటుంది. గర్భధారణ ప్రారంభంలో కంటే , గర్బధారణ చివరలో మరింత ఎక్సైట్ మెంట్ ఉండటం సహజం.

ఈ సమయానికల్లా పొట్టలో బేబీ పూర్తిగా డెవలప్ అయ్యుంటుంది. బేబీ వెయిట్ వేగంగా పెరుగుతుంది. అలాగే బేబీ బ్రెయిన్, లంగ్స్ అభివ్రుద్ది చెండం ప్రారంభిస్తాయి. ఈ సమయంలో కొద్దిగా ప్రెజర్ ను పొందుతారు. ముఖ్యంగా ఈ సమయంలో తినే ఆహారాల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వేగంగా బరువు పెరగడం వల్ల జీర్శవ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. అందుకోసం న్యూట్రీషియన్ బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. చివరదశలో న్యూట్రీషియన్స్, ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోవాలి. 9నెలలో గర్భిణీలు ఖచ్చితంగా తినాల్సిన ప్రెగ్నెన్సీ డైట్ ఈ క్రింది విధంగా ఉంది..

9th Month Pregnancy Diet - Which Foods To Eat

త్రుణ ధాన్యాలు , త్రుణధాన్యాలతో తయారుచేసిన బ్రెడ్ : 6 నుండి 11 ఒక రోజుకు

పండ్లు : ఒక రోజుకు 2 నుండి 4

వెజిటేబుల్స్ : ఒక రోజుకు 4 సర్వింగ్స్ కంటే ఎక్కువ

ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహారాలు: 3 సర్వింగ్స్ కంటే ఎక్కువ

హైడ్రేషన్: ఒక రోజుకు కనీసం 2 లీటర్ల నీళ్ళు తాగాలి

ఇంకా మరికొన్ని పుడ్స్ తప్పని సరిగా తీసుకోవాలి. 9వ నెలలో గర్భిణీలు హెల్తీ న్యూట్రీషియన్స్ ఫుడ్స్ ను తినడం వల్ల ఎలాంటి సమస్యలుండవు. ముఖ్యంగా ఈ సమయంలో వచ్చు మలబద్దకం, హార్ట్ బర్ప్ వంటి సమస్యలుండవు. అలాగే బేబీ సరిగా డెవలప్ అవ్వడానికి సహాయపడుతుంది. ఎటువంటి లోపాలు లేకుండా హెల్తీ బేబీ పుడుతారు. కాబట్టి, ఈ క్రింది సూచించిన ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి:

ఫైబర్ రిచ్ ఫుడ్స్ :

ఫైబర్ రిచ్ ఫుడ్స్ :

ఫైబర్ ఎక్కువగా ఉండే వెజిటేబుల్స్, ఫ్రూట్స్, త్రుణధాన్యాలతో తయారుచేసిన బ్రెడ్, సెరల్స్, డేట్స్ తీసుకోవడం మంచిది.

ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలు:

ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలు:

చేపలు, చికెన్, గుడ్డు, బ్రొకోలీ, లెంటిల్స్, పచ్చిబఠానీలు, బెర్రీస్, సోయా బీన్స్, డ్రైడ్ ఫ్రూట్, ప్రూనే, ఎండుద్రాక్ష వంటివి తప్పనిసరిగా తీసుకోవాలి.

క్యాల్సియం ఎక్కువగా ఉండే ఆహారాలు:

క్యాల్సియం ఎక్కువగా ఉండే ఆహారాలు:

గర్భధారణ సమయంలో క్యాల్షియం లోపం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో క్యాల్షియం అదికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం చాలా అవసరం. గ్రీన్ ఫుడ్స్, డైరీ ప్రొడక్ట్స్, ఓట్ మీల్, బాదం, మరియు నువ్వులను ఎక్కువగా తీసుకోవాలి.

విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలు:

విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలు:

9నెలలో విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం చాలా అసవరం. సిట్రస్ ఫ్రూట్స్, టమోటోలు, స్ట్రాబెర్రీస్, బ్రొకోలీ, కాలీఫ్లవర్ ఎక్కువగా తీసుకోవాలి.

ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉన్న ఆహారాలు:

ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉన్న ఆహారాలు:

స్పినాబిఫిడా వంటి పుట్టుక లోపాలను నివారించడానికి ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ , లెగ్యుమ్స్, బీన్స్, చిక్ పీస్, బ్లాక్ పీస్, వంటివి డైలీ డైట్ లో చేర్చుకోవాలి.

విటమిన్ ఎ రిచ్ ఫుడ్స్:

విటమిన్ ఎ రిచ్ ఫుడ్స్:

ఆకు కూరలు, క్యారెట్, స్వీట్ పొటాటో, కాంటలోపిన్, మరియు ఇతర విటమిన్ ఎ ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం.

English summary

9th Month Pregnancy Diet - Which Foods To Eat

9th Month Pregnancy Diet - Which Foods To Eat And Avoid? When you eat healthy and nutritious foods, you guarantee yourself a problem-free pregnancy.
Story first published: Saturday, March 18, 2017, 12:00 [IST]
Subscribe Newsletter