ప్రెగ్నన్సీ సమయంలో అస్సలు చేయకూడని కొన్ని ఇంటి పనులు!

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

ప్రెగ్నన్సీ సమయం ఆడవాళ్లకు చాలా కఠినమైన దశగా చెప్పవచ్చు.ఆ సమయంలో

శరీరానికి ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం.

ప్రెగ్నన్సీ సమయంలో మంచి ఆహారాన్ని తీసుకోవడం,తేలికపాటి వ్యాయామం చేయడం మరియు మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడం ఉత్తమమైన విషయాలు. మీ భాగస్వామి మరియు ఇతర కుటుంబ సభ్యుల సహాయం తీసుకోండి. మీ శరీరం బాగా విశ్రాంతిని తీసుకొనేలా చూసుకోండి.

గర్భిణీస్త్రీలలో వ్యాధినిరోధకశక్తిని పెంచే జామకాయ..

మీరు గర్భవతిగా ఉన్నప్పుడు, దూరంగా ఉండవలసిన మరియు చేయకూడని

కొన్ని ఇంటి పనులు ఇక్కడ మీకోసం...

1. ఇంటిని శుభ్రపరచడం

1. ఇంటిని శుభ్రపరచడం

మీరు గర్భవతి అయినప్పుడు, సాధారణంగా చేసే ఇంటిని శుభ్రపరచడం లాంటి పనులను చేయడం మంచిది కాదు.

ఇంటిని శుభ్రపరచడానికి వాడే డిటర్జెంట్లు మరియు ఇతర ఉత్పత్తుల వలన సమస్యలు ఏర్పడవచ్చు. కొన్ని రియాక్టివ్ పదార్థాలు అలర్జీకి కారణమవుతాయి. గర్భధారణ సమయంలో, మీ శరీరం మరింత సున్నితంగా ఉంటుంది.

2. ఎక్కువ వంగి చేయడం చాలా ప్రమాదకరం

2. ఎక్కువ వంగి చేయడం చాలా ప్రమాదకరం

ఇది ఇంటిని శుభ్రపరచడం లాంటివి చేయకూడదనటానికి మరొక ముఖ్యకారణం.శుభ్రపరిచే సమయంలో ఎక్కువ వంగి చేయడం చాలా ప్రమాదకరం.ఇది తుంటి అనగా తొడ వెనుక భాగపు నరాల మీద ఒత్తిడికి గురిచేస్తుంది.

3. శ్రమతో కూడిన పనులు

3. శ్రమతో కూడిన పనులు

గర్భధారణ సమయంలో, మీ కీళ్ళు మరియు స్నాయువులు కొంచం మృదువుగా ఉంటాయి. దీనివలన శ్రమతో కూడిన పనులు చేయటం కష్టతరం అవుతుంది.తుడవడం మరియు దుమ్ము దులపడం వంటి పనులు కోసం ఇంకొకరి సహాయం తీసుకోవడం ఉత్తమం.

గర్భధారణ సమయంలో దగ్గు మరియు జలుబు నివారించే మార్గాలు

4. పెంపుడు జంతువులను

4. పెంపుడు జంతువులను

మీ ఇంట్లో పెంపుడు పిల్లి వున్నట్లైతే,మల పదార్థాన్ని శుభ్రం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నిచకండి. దానిలో ఉన్న పరాన్నజీవులు గర్భధారణ సమయంలో మరింత హానికరం కావచ్చు.

5. బాత్రూమ్ క్లీనర్స్

5. బాత్రూమ్ క్లీనర్స్

బాత్రూమ్ ని శుభ్రపరచడానికి వాడే కొన్నిఉత్పత్తులు పొగలను విడుదల చేస్తాయి. గర్భధారణ సమయంలో వాటిని పీల్చడం హానికరం కాబట్టి ఆ పనులు చేయడానికి మీ ఇంట్లోవాళ్ల సహాయం అడగండి.

6. బట్టలు ఉతకడం లాంటివి మానుకోండి

6. బట్టలు ఉతకడం లాంటివి మానుకోండి

బట్టలు ఉతకడం లాంటివి మానుకోండి. మీ బేబీ బంప్ తో వంగి మరియు బట్టలు వాష్ చేయడం సౌకర్యవంతంగా ఉండకపోవచ్చు. ఇంకా, మీ వాషింగ్ చేసే ప్రదేశం జారుతున్నట్లు గా ఉంటే మరింత ప్రమాదకరం కావచ్చు. మీరు గర్భధారణ సమయంలో స్లిప్ అవడం అనేది తిరిగి పొందలేని పరిస్థితి.

గర్భాధారణలో స్త్రీలు ఎలా పడుకుంటే సురక్షితం..!

7 . బరువువైనవి మోయకూడదు

7 . బరువువైనవి మోయకూడదు

భారీ వస్తువులను మోయడం లాంటి పని చాలా ప్రమాదకరమైనది. మీ వెనుక భాగానికి అది మంచిది కాదు. నిచ్చెనలు ఎక్కడం వంటివి చేయడం స్ట్రిట్ గా చేయకూడదు.

ఈ విధంగా, గర్భధారణ సమయంలో ఇటువంటి పనులను చేయకుండా నివారించేందుకు ప్రయత్నించండి. కానీ మీకు సహాయపడటానికి ఎవరూ లేకుంటే, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

English summary

Avoid These Domestic Tasks During Pregnancy

Your body needs to pass through a tough phase during pregnancy. So, it is better to not trouble it more at that time. Here are some house chores to avoid.
Story first published: Friday, June 30, 2017, 14:00 [IST]
Subscribe Newsletter