ప్రసవం తరువాత కూడా పొట్ట తగ్గకపోతే?

Posted By: LAKSHMI BAI PRAHARAJU
Subscribe to Boldsky

మీకు పొట్ట ఎప్పుడూ వస్తుంది? గర్భం ధరించినపుడు, కదా? ప్రసవం తరువాత కూడా పొట్ట ఉంటే? మీరు గర్భవతిగా ఉన్నపుడు, అండం పరిమాణం క్రమంగా పెరుగుతుంది కాబట్టి, పొట్ట పెరగడం సహజ౦.

కానీ బిడ్డ పుట్టాక, పొట్ట పరిమాణం తగ్గి, సాధారణ రూపం, పరిమాణం తో శరీరం తిరిగి మామూలు స్ధితికి వస్తుంది.

స్పెషల్ అండ్ ఎట్రాక్టివ్ పెయింటింగ్స్ తో ఆకర్షిస్తున్న ప్రెగ్నెంట్ బెల్లీ..

ప్రసవించిన నెల తరువాత కూడా పొట్ట తగ్గకపోతే ఏమవుతుంది? ఈ మాట కొద్దిగా భయంగా ఉంటుంది, కదా? చాలా కేసులలో, సాధారణ పరిమాణానికి వస్తారు, కానీ కొన్ని అరుదైన కేసులలో పొట్ట సాధారణ స్థితికి రావడానికి మరికొంత ఎక్కువ సమయం పట్టొచ్చు!ఇక్కడ కొన్ని అంశాలు ఇవ్వబడ్డాయి.

చాలా కేసులలో ఏమి జరుగుతుంది?

చాలా కేసులలో ఏమి జరుగుతుంది?

చాలామంది స్త్రీలలో బిడ్డకు జన్మనిచ్చిన 1-2 వారాల తరువాత కూడా గర్భిణిగానే కనిపిస్తారని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. భయపడాల్సిన పనిలేదు. 2 వారాల తరువాత, పొట్ట సాధారణంగా క్రమంగా తగ్గుతుంది.

పొట్ట అలాగే ఉంటే ఏమిటి?

పొట్ట అలాగే ఉంటే ఏమిటి?

ప్రసవం తరువాత కూడా పొట్ట కనిపిస్తూ ఉంటే, పొత్తికడుపు ప్రదేశంలో కండరాలు సాగడం వల్ల అలా జరుగుతుంది. ఇలాంటి కేసులలో ఆ కండరాలు తిరిగి సాధారణ స్థితికి ఇంకా రాకపోవడమే దానికి కారణం.

ఇది గర్భాశయం విస్తరించడం వల్ల కూడా కావోచ్చా?

ఇది గర్భాశయం విస్తరించడం వల్ల కూడా కావోచ్చా?

గర్భధారణ సమయంలో గర్భాశయం విస్తరించినపుడు. ప్రసవం తరువాత కూడా పొట్ట గర్భం లాగా కనిపిస్తే, గర్భాశయం విస్తరించడం కారణం కావొచ్చు, అది సాధారణ స్ధితికి రావడానికి కొద్దిగా సమయం పడుతుంది.

గర్భిణుల్లో వెన్నునొప్పికి కారణాలు: నివారణ మార్గాలు

దీనివల్ల నొప్పి ఉంటుందా?

దీనివల్ల నొప్పి ఉంటుందా?

విస్తరించిన గర్భాశయం పెల్విస్ వద్దకు చేరాలి. ఈ క్రమంలో, కొద్దిగా నొప్పి వచ్చే అవకాశం ఉంది.

ఇది ద్రవాల కారణంగా జరుగుతుందా?

ఇది ద్రవాల కారణంగా జరుగుతుందా?

ప్రసవం తరువాత, యనిమోటిక్ ద్రవం, కొన్ని ఇతర ద్రవాలు, చివరికి రక్తం కూడా కడుపు పెద్దదిగా కనిపించడానికి దోహదం చేయవచ్చు.

సాధారణ స్థితిని తిరిగి పొందగలరా?

సాధారణ స్థితిని తిరిగి పొందగలరా?

ముందుగా లేదా తర్వాత (కొన్ని నెలల వ్యవధిలో) సాధారణ స్ధితిని తిరిగి పొంది, పొట్ట తగ్గిపోతుంది అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కానీ మీకు ఇంకా ఆందోళనగా ఉంటే, ప్రసవం తరువాత ఉన్న పొట్టను తగ్గించుకోవడానికి ఏమి చేయాలో ఒక గైనకాలజిస్ట్ ని సంప్రదించి అడిగి తెలుసుకోండి.

English summary

Baby Bump After Delivery

When do you get a baby bump? During pregnancy, right? What if there’s baby bump after delivery? Read this!