అలర్ట్: కాఫీ తాగితే పిల్లలు పుట్టే అవకాశం లేదా!?

Posted By:
Subscribe to Boldsky

పురుషుల్లో చాలా మంది టీ ప్రియులున్నట్లు, మహిళల్లో చాలా మంది కాఫీ ప్రియులుగా ఉండటం మనం గమనించే ఉంటాం. అయితే కాఫీ విషయంలో పరిశోధకులు కొత్త విషయాన్ని కనుగొన్నారు. అదేంటంటే? మహిళలు కాఫీ ఎక్కువ తాగితే సంతానం కలగదంటున్నారు.

అలర్ట్: కాఫీ తాగితే పిల్లలు పుట్టే అవకాశం లేదా!?

గర్భిణీ తీసుకొనే ఆహారం పుట్టబోయే బిడ్డ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాఫీ, టీలు తాగే అలవాటున్న మహిళలు, ప్రెగ్నెన్సీ ప్లాన్ లో ఉన్నవారు, గర్భం ధరించిన వారు వీటిని మానేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

సంతానోత్పత్తిని పెంచడానికి సహజ మార్గాలు..!

రోజూ రెండు కప్పులు కాఫీ తీసుకునే వారిలో

రోజూ రెండు కప్పులు కాఫీ తీసుకునే వారిలో

రోజూ రెండు కప్పులు కాఫీ తీసుకునే వారిలో ఆరోగ్యానికి మేలు చేసే కెఫిన్..మితిమీరితే సంతానలోపాన్ని ఏర్పరుస్తుందని తాజా పరిశోధనలలో తేలింది. కెఫిన్ అధికంగా ఉండే కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ లను అధికంగా తీసుకునే వారిలో సంతానలేమి తప్పదని పరిశోధకులు అంటున్నారు.

కాఫీలు ఎక్కువగా తాగడం వల్ల

కాఫీలు ఎక్కువగా తాగడం వల్ల

అందువల్ల రోజుకు రెండు కప్పుల కంటే ఎక్కువగా కాఫీ లేదా టీ తాగే అలవాటున్న వారు ఆ అలవాటు తగ్గించుకోవడం మంచిది. లేదంటే కాఫీలు ఎక్కువగా తాగడం వల్ల ఆకలి తగ్గడం మాత్రమే కాదు, శరీరంలోని నీరు, క్యాల్షియం బయటకు వెళ్లిపోవడం వల్ల గర్భిణీలలో నీరసం, అలసట వస్తుంది.

మగవారిలో సంతానోత్పత్తిని పెంచే 15 సూపర్ పవర్ ఫుడ్స్..!

ముఖ్యంగా కాఫీలు రెండు కప్పుల కంటే ఎక్కువగా తీసుకునే

ముఖ్యంగా కాఫీలు రెండు కప్పుల కంటే ఎక్కువగా తీసుకునే

ముఖ్యంగా కాఫీలు రెండు కప్పుల కంటే ఎక్కువగా తీసుకునే వారు మాత్రం తప్పకుండా మానేయాల్సిందేనని పరిశోధకులు సూచిస్తున్నారు. పిల్లలు కలగాలంటే కాఫీని పక్కనబెట్టడటమే సరైన మార్గమని వారు సూచిస్తున్నారు.

కాఫీ, టీలు తాగడం వల్ల

కాఫీ, టీలు తాగడం వల్ల

కాఫీ, టీలు తాగడం వల్ల సరిగా నిద్రపోలేరు. నిద్రలేమితో బాధపడాల్సి వస్తుంది. ఈ కారణంతో శరీరంలో ఐరన్ శాతం తగ్గి, పొట్టలో పిండం ఎదుగుదలకు అవరోదం కలిగిస్తుంది. శిశువు గుండె బలహీనంగా మారడంతో పాటు, హార్ట్ బీట్ సమస్యలుంటాయని పరిశోదకులు హెచ్చరిస్తున్నారు.

కెఫైన్ శాతం పెరిగితే మాత్రం సంతానం కలిగే అవకాశాలు

కెఫైన్ శాతం పెరిగితే మాత్రం సంతానం కలిగే అవకాశాలు

కాఫీలో ఉండే కెఫిన్ నరాల సామర్థ్యాన్ని పెంచగలదు. అందుకే కాఫీ తాగిన వెంటనే కొత్త ఉత్సాహం ఏర్పడుతుంది. అయితే రోజుకు రెండు కప్పులైతే ఓకే కానీ..కెఫైన్ శాతం పెరిగితే మాత్రం సంతానం కలిగే అవకాశాలు చాలా మటుకు తగ్గిపోతాయని జర్నల్ ఫెర్టిలిటి అండ్ స్టెరిలిటీ పరిశోధకులు వెల్లడించారు. గర్భిణులు ఎక్కువగా కాఫీ తాగడం కూడా మంచిది కాదు. ఇందులోని ఎక్సెస్ కెఫిన్ శరీరంలో వేడిని పెంచి గర్భస్రావం జరిగే ప్రమాదం ఉంది.

గర్భం పొండానికి సహాయపడే 8 ఫెర్టిలిటి బూస్టింగ్ ఫుడ్స్

 కెఫిన్ గర్భస్రావానికి కారణమవుతుందని

కెఫిన్ గర్భస్రావానికి కారణమవుతుందని

344 మంది యువతుల మీద జరిపిన ఈ పరిశోధనలో కెఫిన్ గర్భస్రావానికి కారణమవుతుందని కనుగొన్నారు. అంతే కాదు కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ లలో కెఫిన్ అధికంగా ఉన్నట్లు గుర్గించారు. కాబట్టి కేఫినేటెడ్ కూల్ డ్రింక్స్ కూడా దూరంగా ఉండటం మంచిది.

కాఫీ ఒంట్లోకి ఇంకగానే

కాఫీ ఒంట్లోకి ఇంకగానే

కాఫీ ఒంట్లోకి ఇంకగానే దాని ప్రభావం శరీరంపై, ఆరోగ్యంపై కనిపిస్తుంది. గర్భిణీలు కాఫీ తాగిన కాసేపట్లో రక్తపోటు (ప్రధానంగా సిస్టోల్ బ్లడ్‌ప్రెషర్) పెరుగుతుంది. బీపీని కొలిచే సాధనంతో చూస్తే, అది సాధారణం కంటే 8 ఎంఎం/హెచ్‌జీ ఎక్కువవుతుంది. గర్భిణీలలో హైబిపి కూడా మంచిది కాదు కాబట్టి, కాఫీకి దూరంగా ఉండటం మంచిది.

కాఫీ, టీలకు బదులుగా ప్రతి రోజు ప్రకృతి పరమైన పండ్లు తీసుకోండి

కాఫీ, టీలకు బదులుగా ప్రతి రోజు ప్రకృతి పరమైన పండ్లు తీసుకోండి

కాఫీ, టీలకు బదులుగా ప్రతి రోజు ప్రకృతి పరమైన పండ్లు తీసుకోండి లేదా పండ్ల రసాలను సేవిస్తుంటే మీ ఆరోగ్యంతోపాటు శిశువు ఆరోగ్యం బాగుంటుంది. దీంతో శిశువు ఎదుగుదల మరింత బాగుంటుందంటున్నారు వైద్య నిపుణులు. గర్భం ధరించిన తర్వాత ప్రతిరోజు ఒక పండు తింటుంటే మీకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడుతారని వైద్యులు సూచిస్తున్నారు.

English summary

Caffeine: Does it Affect Your Fertility and Pregnancy?

Caffeine: Does it Affect Your Fertility and Pregnancy?,Multiple studies have suggested that caffeine consumption increases the risk of miscarriage.Caffeine may perk you up mentally, but it could have the opposite effect on your fallopian tubes, leading researchers to wonder whether women who drink coffee, tea
Story first published: Wednesday, July 5, 2017, 14:59 [IST]
Subscribe Newsletter