Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
డెలివరీ తర్వాత పీరియడ్స్ లో వచ్చే మార్పులను గమనించగలరా..
పిల్లకు జన్మనివ్వడం, పాలు ఇవ్వడం వంటి వివిధ కారణాల వల్ల శరీరంలో మార్పులు వచ్చి ముందుగా వాటి ప్రభావం రుతుక్రమం పై పడుతుంది.
డెలివరీ తర్వాత రుతుక్రమంలో వచ్చే మార్పులను చూసి మీరు భయపడ వద్దు. దీని గురించి చదివి ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోండి...
బిడ్డకు జన్మనిచ్చిన తరువాత, స్త్రీలు రుతుక్రమం కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఆలస్యమైతే వత్తిడికి గురౌతారు. నిజానికి, డెలివరీ తరువాత రుతుక్రమం క్రమం తప్పి లేదా ఆలస్యంగా రావడం సహజం.

పిల్లకు జన్మనివ్వడం, పాలు ఇవ్వడం వంటి వివిధ కారణాల వల్ల శరీరంలో మార్పులు వచ్చి ముందుగా వాటి ప్రభావం రుతుక్రమం పై పడుతుంది. కొంతమంది స్త్రీలు యోని మార్గంలో ఎరుపు రంగులో స్రవం చూసి రుతుక్రమం అని భ్రమ పడుతూ ఉంటారు. కానే అది రక్తం, శ్లేష్మం మాత్రమే.
బిడ్డకు జన్మనిచ్చిన తరువాత రుతుక్రమం లో వచ్చే మార్పులకు గల కారణాలకు కొన్ని నిజాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

ఫ్యాక్ట్స్ #1
బిడ్డ జన్మించిన తరువాత, నెలవారీ రుతుక్రమం లో కొన్ని మార్పులను ఎదుర్కుంటారు. ఆ సమయంలో ఊహించని రుతుక్రమం రావడం సహజం. నిజానికి, డెలివరీ తరువాత మొదటి సారి రుతుక్రమం సహజంగా 6 లేదా 7 నెలల వరాల తరువాత వస్తుంది. ఆ సమయం వరకు, రుతుక్రమంలో కొన్ని మార్పులు రావడం సహజం.

ఫ్యాక్ట్స్ #2
క్రమం తప్పిన రుతుక్రమం తోపాటు, అధిక రక్తస్రావం కూడా మరో సాధారణ మార్పే. ఇది ఎక్కువ శ్రద్ధ వల్ల రావొచ్చు, చాలామంది కొత్తగా తల్లిన వారిలో ఇది సహజం. ఉపశమనం కోసం వైద్యుడిని సంప్రదించండి.

ఫ్యాక్ట్స్ #3
పిల్లలు పుట్టిన తరువాత నెలసరి రుతుక్రమం అతి తక్కువ సమయంలో లేదా అతి ఎక్కువ సమయంలో వస్తే భయపడొద్దు. మీ శరీర ఆరోగ్యం పూర్తిగా పరిశీలించిన తరువాత ఇది చాలా సహజం అని వైద్యుడు నిర్ధారిస్తారు. కొంతమంది స్త్రీలలో ఈ నెలసరి క్రమం దాటిపోవచ్చు.

ఫ్యాక్ట్స్ #4
కొంతమంది కొత్త తల్లుల్లో, రుతుక్రమం సమయంలో నొప్పి కూడా రావొచ్చు. కడుపులో తిప్పుడు, వాపు, మనసు బాగోక పోవడం, నొప్పులు, కళ్ళు తిరుగుతున్నట్లు వంటి లక్షణాలు కూడా ఉండవచ్చు.

ఫ్యాక్ట్స్ #5
పాలిచ్చే తల్లుల్లో రుతుక్రమం ఆలస్యంగా రావొచ్చు. కానీ తల్లి పాలు ఇవ్వడ౦ ఆపేసాక రుతుక్రమం సహజంగా రావొచ్చు.

ఫ్యాక్ట్స్ #6
ఒక బిడ్డకు జనమనిచ్చిన తరువాత స్త్రీ శరీరంలో జరిగే హార్మోన్లలో మార్పులు, పాలివ్వడం వల్ల వాటి ప్రభావం రుతుక్రమంపై పడి మార్పులు రావడానికి ప్రధాన కారణం అవుతాయి.

ఫ్యాక్ట్స్ #7
ఇది కాకుండా, పాలిచ్చే సమయంలో, ప్రొలాక్టిన్ అనే హార్మోను స్రవించి, దీని ప్రభావం అన్దోత్సర్గం మీద పడుతుంది. ఈ హార్మోను ప్రభావం కొంత కాలంపాటు రుతుక్రమం పై ప్రభావం చూపిస్తుంది.



Click it and Unblock the Notifications
