గట్టిగా హత్తుకోవడం గర్భధారణలో సాయపడుతుందా?

By: DEEPTHI
Subscribe to Boldsky

కౌగిలించుకోవడం, గర్భధారణకి ఏమన్నా సంబంధముందా? గర్భం దాల్చాలంటే కౌగిలించుకోవడం అవసరమా? పైపైన చూడటానికి గర్భానికి వీర్యం, అండం కలవటమే ముఖ్యం. కానీ అనేక ఇతర కారణాలు కూడా ఇది త్వరగా, సులువుగా జరగటానికి సాయపడతాయి.

అలాంటి ఒక హార్మోనే ఆక్సిటోసిన్. ఇది కౌగిలించుకున్నప్పుడు విడుదలయ్యే హార్మోన్. మానసిక వత్తిడి, రక్తపోటు తగ్గించి మిమ్మల్ని ఉల్లాసంగా మారుస్తుంది. ప్రేమ, నిస్వార్థగుణాన్ని కూడా పెంచుతుంది.

సంతానోత్పత్తిని పెంచడానికి సహజ మార్గాలు..!

ఈ హాయి కలిగించే హార్మోన్ స్త్రీని మాతృత్వానికి కూడా సిద్ధం చేస్తుంది. ఆక్సిటోసిన్ గురించిన వాస్తవాలు, గర్భధారణలో దాని పాత్ర ఇదిగో మీకోసం.

ఎందుకు హత్తుకోవాలి?

ఎందుకు హత్తుకోవాలి?

మొదట, సెక్స్ తర్వాత స్త్రీలు ఎందుకు హత్తుకుని పడుకోవటానికి అంత తపిస్తారు? అది ఇదిగో ఈ కౌగిలింతల హార్మోన్ వల్లనే. దాని అసలు పేరు ఆక్సిటోసిన్. కౌగిలి, గర్భం దాల్చడానికి కల సంబంధం ఏంటి? చదవండి.

ఆక్సిటోసిన్ పాత్ర

ఆక్సిటోసిన్ పాత్ర

ఆక్సిటోసిన్ కి ఇతర పాత్రలు కూడా ఉన్నాయి. పునరుత్పత్తి సామర్థ్యాన్ని సాధారణంగా ఉంచటం. భాగస్వామితో మానసికంగా దగ్గరవటానికి సాయపడటం. ఇవన్నీ కాక, ఆక్సిటోసిన్ వల్ల తల్లి తన బిడ్డను ప్రేమగా సంరక్షించగలుగుతుంది.

ఇతరపాత్రలు

ఇతరపాత్రలు

ఆక్సిటోసిన్ ప్రసవ సమయంలో, నొప్పులప్పుడు సాయపడుతుంది. ప్రసవం జరిగే సమయంలో బిడ్డ బయటకి వస్తున్నప్పుడు యోని కింద భాగాలలో ఇది విడుదల అవుతుంది. బిడ్డకి పాలు పట్టే సమయాల్లో కూడా దీని ప్రాముఖ్యత కనపడుతుంది.

అలర్ట్: కాఫీ తాగితే పిల్లలు పుట్టే అవకాశం లేదా!?

కౌగిళ్ళు మరియు గర్భం

కౌగిళ్ళు మరియు గర్భం

ఎప్పుడైతే మగవాళ్ళు తమ భాగస్వాములను ఎక్కువ సేపు హత్తుకుంటారో, అది వారిలో ఆక్సిటోసిన్ ను ఎక్కువగా ఉత్పత్తిచేసి గర్భవతి అవ్వటం సులువయ్యేట్లా చేస్తుంది.

స్పర్శ

స్పర్శ

దగ్గరి స్పర్శ కూడా ఆక్సిటోసిన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఒక జంట హత్తుకుని ఉన్నప్పుడు, వారి చర్మాలు తగిలి, ఆక్సిటోసిన్ వల్ల వారు ఆ స్పర్శలో ఆనందాన్ని పొందుతారు. ఒక తల్లి బిడ్డను దగ్గరకి తీసుకున్నప్పుడు కూడా ఆక్సిటోసిన్ ఉత్పత్తి అవుతుంది.

ఆక్సిటోసిన్ ను పెంచే విషయాలేంటి?

ఆక్సిటోసిన్ ను పెంచే విషయాలేంటి?

మానసిక వత్తిడి ఆక్సిటోసిన్ స్థాయిలను దారుణంగా పడేస్తుంది. వత్తిడి, బంధాలలో సంఘర్షణ ఈ హార్మోన్ ను ఆపేస్తాయి. ఇంట్లో శాంతియుత వాతావరణం, అన్ని సమయాల్లో తోడుండే భాగస్వామి ఆక్సిటోసిన్ ఉత్పత్తి స్థాయిని పెంచి, గర్భధారణలో సాయపడతాయి.

కౌగిలింతల పాత్ర

కౌగిలింతల పాత్ర

ఆక్సిటోసిన్ స్థాయిలు సాధారణం మారుతూ ఉన్నా, బిడ్డప్రసవం సమయంలో అత్యధికంగా విడుదలవుతుంది. అందుకని కనటం విషయంలో ఆక్సిటోసిన్ ను విస్మరించలేం. బంధాలను పటిష్ఠపరుచుకోవటం, గర్భధారణలో ఆక్సిటోసిన్ అనేక పాత్రలు పోషిస్తుంది.

English summary

Does Cuddling Help In Conceiving?

Are cuddling and pregnancy linked? Is it necessary to cuddle in order to conceive? Read on to know.
Story first published: Saturday, August 5, 2017, 14:00 [IST]
Subscribe Newsletter