ల్యూబ్స్ వాడటం వల్ల వీర్య కణాలు చచ్చిపోతాయా?

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

ల్యూబ్స్ (రాపిడి తగ్గించే ద్రవాలు ) వాడటం వల్ల నిజంగానే వీర్య కణాలు చచ్చిపోతాయా ? ల్యూబ్స్ అంటే లూబ్రికెంట్స్ అని అర్ధం. ఈ పదార్ధాలను యోని పొడిబారిన సందర్భంలో పురుషాంగం సులువుగా యోని లోపలికి వెళ్ళడానికి వీటిని వాడతారు. ఈ లూబ్రికెంట్ పదార్ధాన్ని సంభోగం సమయంలో వాడటం వల్ల పొడిబారిన యోనికి హాని జరగకుండా మరియు లోపల కంటికి కనపడని ప్రదేశాల్లో యోని కండరాలు దెబ్బ తినకుండా ఇది కాపాడుతుంది. ప్రస్తుతం మార్కెట్ లో ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.

లూబ్స్ ని ఉపయోగించడం వలన కలిగే సైడ్ ఎఫెక్ట్స్!!

చాలా మంది జంటలు లూబ్రికెంట్స్ వాడటం మొదలు పెట్టారు. అందుకు కారణం పురుషాంగ ప్రవేశం యోని లోపలికి సులువుగా జరిగిపోతుంది. కానీ, ల్యూబ్స్ వల్ల వీర్య కణాలు మరణిస్తాయా ? వీర్యాన్ని నాశనం చేయని ల్యూబ్స్ కూడా ఉన్నాయా ? వాటి గురించి అసలైన నిజాలను ఇప్పుడు తెలుసుకుందాం.

గమనిక : ల్యూబ్స్ అనేవి గర్భనిరోధక వస్తువులు కాదు. ఏ లూబ్రికెంట్స్ కూడా అనవసర గర్భాన్ని రాకుండా ఆపలేవు. అయినప్పటికీ అవి గర్భం దాల్చే అవకాశాల పై ప్రభావం చూపే అవకాశం ఉంది.

గర్భధారణ సమయంలో సెక్స్ లో చేసే 5 పొరపాట్లు

ల్యూబ్స్ వీర్య కణాలను చంపుతాయా ?

ల్యూబ్స్ వీర్య కణాలను చంపుతాయా ?

కొన్ని లూబ్రికెంట్స్ ని వాడటం వల్ల అది వీర్యం యొక్క చలనం మరియు పదనిర్మాణం పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇది ఎలా గర్భ ధారణ పై ప్రభావం చూపుతుంది అని ఆశ్చర్యపోతున్నారా ? ల్యూబ్స్ కొన్ని సందర్భాల్లో వీర్యం యొక్క కదలికలను లేదా వాటి యొక్క నిర్మాణాన్ని మార్చివేయగలవు. దీంతో ఇది సహజంగానే గర్భం పై ప్రభావం చూపుతుంది.

ల్యూబ్స్ వీర్య కణాల పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి :

ల్యూబ్స్ వీర్య కణాల పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి :

ప్రస్తుతం మనకు మార్కెట్ లో దొరికే కొన్ని ల్యూబ్స్ వీర్యం నిర్వహించే పని పై ప్రభావం చూపుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. నువ్వుల నూనె కూడా గర్భధారణ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో ల్యూబ్స్ వీర్య కణాల యొక్క దశను మరియు వాటి యొక్క కదలికలపై ప్రభావం చూపిస్తుంటాయి. గర్భధారణకు ఇదే అతి పెద్ద అడ్డంకిని సృష్టిస్తుంది.

అన్ని ల్యూబ్స్ వీర్య కణాలను నాశనం చేస్తాయా ?

అన్ని ల్యూబ్స్ వీర్య కణాలను నాశనం చేస్తాయా ?

ఇందుకు ల్యూబ్స్ తయారీలో వాడే పదార్ధాలను మనం నిందించవలసి ఉంటుంది. ఎందుచేతనంటే, కొన్నింటిని తయారు చేసే విధానంలో రసాయనాలను వాడతారు. అది యోని లోపల ఉండే వాతావరణాన్ని మరియు పి.హెచ్ విలువ సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఇది పరోక్షంగా వీర్య కణాలపై మరియు వాటి యొక్క కదలికల పై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం మార్కెట్ లో దొరుకుతున్న ల్యూబ్స్ లో చాలా వరకు వీర్యానికి హాని చేసేవే ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఈ విషయాలన్నీ జంటలకు తెలియవా ?

ఈ విషయాలన్నీ జంటలకు తెలియవా ?

గణాంకాల ప్రకారం కొత్తగా పెళ్ళైన జంటలలో ఎవరికైతే పిల్లలు త్వరగా కావాలనుకుంటారో వాళ్లలో 40% మందికి ల్యూబ్స్ వాడటం వల్ల, అది గర్భం దాల్చే అవకాశాల పై ప్రభావం చూపుతుంది అనే విషయం తెలియదట. ఇక ఎవరైతే పిల్లలను ఇప్పట్లో వద్దు అనుకుంటారో వాళ్ళు ఇప్పటికీ ల్యూబ్స్ ని వాడుతూనే ఉన్నారు.

సురక్షితమైన ల్యూబ్స్ ఏవి ?

సురక్షితమైన ల్యూబ్స్ ఏవి ?

ఆవ నూనె లేదా చిన్న పిల్లల కోసం వాడే నూనెను వాడటం ల్యూబ్స్ కంటే కొద్దిగా మంచిదని పేర్కొంటున్నారు. కానీ, ఇవి వాడటం వల్ల ఈస్ట్ సంక్రమణ మరియు మంట వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.

ఇక చివరిగా చెప్పేదేమిటంటే :

ఇక చివరిగా చెప్పేదేమిటంటే :

ల్యూబ్స్ అనేవి పొడిబారిన యోనిలో తేమను కలిగించి సులువుగా పురుషాంగ ప్రవేశానికి మార్గాన్ని సులభం చేస్తాయి. అయినప్పటికీ మీరు గనుక గర్భం దాల్చాలని భావిస్తున్నట్లైతే మీరు వీటికి దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ మీరు గనుక ల్యూబ్ వాడాలి అనుకున్నట్లైతే మార్కెట్ లో దొరికే వాటిల్లో మీకు నచ్చినవి వాడకండి. వైద్యున్ని సంప్రదించి వాళ్ళు చెప్పే ల్యూబ్ ని వాడటం ఉత్తమం.

English summary

Do Lubes Kill Sperm?

Many couples started using lubes as they make things simpler by making the penetration smoother. But are all lubes spermicidal? Are there lubes that don't kill sperm? Here are the facts you need to know.