గర్భిణీలకు కాస్మోటిక్స్ ప్రమాదకరం ఎందుకంటే?

Posted By: Lekhaka
Subscribe to Boldsky

గర్భధారణ అనేది స్త్రీకి ఖచ్చితంగా త్యాగాలు చేసే సమయం. మీరు మీకు ఇష్టమైన జంక్ ఫుడ్ తినాలన్నా మీరు గర్భం ధరించినపుడు అది కుదరదు.జంక్ ఫుడ్స్ మాత్రమే కాదు, గర్భం ధరించిన స్త్రీ వదిలేయాల్సిన వస్తువులలో సౌందర్య సాధనాలు కూడా ఉన్నాయి. కానీ ఎందుకు? గర్భధారణ సమయంలో కొన్ని రసాయనాల ప్రభావం తల్లిబిడ్డకు మంచిది కాదు.

గర్భిణీలు ఉపయోగించకూడని సౌందర్య సాధనాలు ఏమిటి? ఎందుకు ఉపయోగించకూడదనే? అనే విషయాలను ఈ ఆర్టికల్ ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రమాదకర రసాయనాలు!

ప్రమాదకర రసాయనాలు!

ఎండోక్రైన్ విచ్చిన్నకారులు! దూరంగా ఉంచండి! గర్భధారణ సమయంలో ఎండోక్రైన్ విచ్చిన్నకారులకు సంబంధించిన ఉత్పత్తులు చాలా ప్రమాదం. ఎందుకంటే? అవి శరీరంలో హార్మోన్స్ పై ప్రభావం చూపిస్తాయి.

కొన్ని ఎండోక్రైన్ విచ్చిన్నకారుల పేర్లు

కొన్ని ఎండోక్రైన్ విచ్చిన్నకారుల పేర్లు

BPA, అట్రాజిన్, పతాలేట్స్, డయాక్సిన్, పెర్క్లోరేట్ వంటివి కొన్ని ఎండోక్రైన్ విచ్చిన్నకారులు.

అవి ఏమి చేస్తాయి?

అవి ఏమి చేస్తాయి?

అవి మీ ఎండోక్రైన్ సిస్టం మీద ప్రభావాన్ని చూపిస్తాయి, వీటివల్ల పుట్టుకలో లోపాలు, ట్యూమర్లు, అండంలో పెరుగుదల లోపాలు వంటివి జరగవచ్చు. అవి హర్మోనల్ పనులకు భంగం కలిగిస్తాయి.

వాటిని ఎక్కడ కనుగొంటారు?

వాటిని ఎక్కడ కనుగొంటారు?

అవి ఎక్కువగా సౌందర్య సాధనాలలో ఉంటాయి. ఉదాహరణకు, పెర్ఫ్యూమ్స్ లో ఫతాలెట్స్ ఉంటాయి.

ఏమి చేయాలి?

ఏమి చేయాలి?

సౌందర్య సాధరణలు వాడడం మానేయాలి లేదా BPA, ఫతాలెట్స్, పరాబెన్స్ వంటి పదార్ధాలు లేని ఉత్పత్తులను ఎంచుకోవాలి.

నిర్దేశించిన క్రీములు?

నిర్దేశించిన క్రీములు?

లోషన్లు లేదా క్రీముల వంటి నిర్దేశించిన కొన్ని సౌందర్య సాధనాలు అందానికి ప్రమాదం కలిగిస్తాయి. గర్భధారణ సమయంలో గైనకాలజిస్ట్ ని సంప్రదించకుండా ఇటువంటి చర్మ సంరక్షణ ఉత్పత్తులను వాడకపోవడం మంచిది.

హెయిర్ డై సంగతి ఏమిటి?

హెయిర్ డై సంగతి ఏమిటి?

మీ జుట్టుకు వేసే రంగులో అమ్మోనియా ఉంటే మానేయండి. అది చర్మం, ఊపిరితిత్తులు రెంటి మీదా ప్రభావం చూపిస్తుంది.

గోళ్ళ రంగులు?

గోళ్ళ రంగులు?

ప్రస్తుతం ఉన్న కొన్ని గోళ్ళ రంగు ఉత్పత్తులలో మేతయిల్బెంజీన్, టోల్యూన్ చాలా ప్రమాదకర పదార్ధాలు. ఇవి రెండూ క్యాన్సర్ ప్రభావాన్ని కలిగి ఉంటాయి.

జుట్టు తొలగించే క్రీము? లిప్స్టిక్?

జుట్టు తొలగించే క్రీము? లిప్స్టిక్?

జుట్టును తొలగించడానికి ఉపయోగించే క్రీములు కూడా విషమే. అవి థయో గ్లైకోలిక్ యాసిడ్ ని కలిగి ఉంటాయి. గర్భధారణ సమయంలో సాధ్యమైనంత వరకు సౌందర్య సాధనాలు ఉపయోగించకపోవడం మంచిది. వీటి గురించి ఏవైనా సందేహాలు ఉంటే మీ గైనకాలజిస్ట్ ని సంప్రదించండి.

English summary

Do You Have To Stay Away From Cosmetics During Pregnancy? in Telugu

Do You Have To Stay Away From Cosmetics During Pregnancy. What are the cosmetics which should be kept at a distance and why? Well, let us discuss about that in this post.
Story first published: Monday, June 5, 2017, 20:30 [IST]
Subscribe Newsletter