ప్రెగ్నెన్సీ వల్ల గర్భసంచిలో ఫైబ్రాయిడ్లు వస్తాయా?

By: DEEPTHI
Subscribe to Boldsky

మీకు గర్భాశయ ఫైబ్రాయిడ్లు లేదా తెలిసినవారికి వచ్చి ఉండవచ్చు. కానీ మీకు అవంటే ఏంటో నిజంగా తెలుసా?

ఫైబ్రాయిడ్లు గర్భసంచీలో పెరిగే అదనపు ట్యూమర్ కణజాలం. ఇవి క్యాన్సర్ కారకం కావు, అందుకని ప్రాణానికి భయం సాధారణంగా ఉండదు. వీటిని మయోమా లేదా లియోమయోమా అని కూడా అంటారు.

ఇవి చిన్నబఠాణీ ఆకారం నుంచి ఫుట్ బాల్ అంత పరిమాణంలో కూడా ఉండవచ్చు. ఇవి బెనైన్ అనగా అన్నిచోట్లకి వ్యాపించకుండా ఒకేచోట పెరుగుతూపోయే కణజాలం. గర్భస్థ ఫైబ్రాయిడ్లు క్యాన్సర్ కి దారితీస్తాయనే రుజువు లేదు.

యుటైరిన్ ఫైబ్రాయిడ్లకి అసలు కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. అవి పెరగటంలో స్త్రీ శరీర హార్మోన్లే పెద్ద పాత్ర పోషిస్తాయని మాత్రం కనుగొన్నారు. ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరిగినప్పుడు వీటి ఎదుగుదల చాలాకాలం వరకూ పెరుగుతుంది.

మీరు లేదా మీ చుట్టూవారు దీనితో బాధపడుతున్నప్పుడు దీని గురించి తెలుసుకోవటం ముఖ్యం. మీకోసం మేమిక్కడ కొన్ని వాస్తవాలు పొందుపరిచాం. చదవండి.

 ఫైబ్రాయిడ్ల ప్రాబల్యం

ఫైబ్రాయిడ్ల ప్రాబల్యం

25- 50 శాతం భారత మహిళలు ఫైబ్రాయిడ్ల బారిన పడుతున్నారు. ఆఫ్రికన్ జాతికి చెందిన వారు ఎక్కువ బాధపడితే, కాకేషియన్ జాతి వారు తక్కువగా ఫైబ్రాయిడ్ల బారిన పడుతున్నారు.

స్థూలకాయం, అధికబరువు

స్థూలకాయం, అధికబరువు

అధిక బరువు ఉండటం వల్ల గర్భాశయంలో ఫైబ్రాయిడ్లు పెరగవచ్చు. ఎందుకంటే అధిక బరువున్న మహిళల్లో ఎక్కువ ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉంటుంది.

గర్భం మరియు ఫైబ్రాయిడ్లు

గర్భం మరియు ఫైబ్రాయిడ్లు

కడుపుతో ఉన్న సమయంలో ఈస్ట్రోజెన్ స్థాయి భారీగా పెరగటం వల్ల అప్పటికే ఉన్న ఫైబ్రాయిడ్ స్థితిని మరింత కఠినం చేస్తుంది. అదే సమయంలో గర్భం వలన మరలా ఫైబ్రాయిడ్ వచ్చే స్థితి తగ్గుతుంది. ఎంత ఎక్కువ మంది పిల్లలుంటే అంత ఫైబ్రాయిడ్ వచ్చే శాతం తగ్గుతుంది.

గర్భనిరోధక పద్ధతులు, ఫైబ్రాయిడ్లు

గర్భనిరోధక పద్ధతులు, ఫైబ్రాయిడ్లు

దీర్ఘ కాలాల పాటు గర్భనిరోధక మాత్రలు, ఇంజెక్షన్లు తీసుకోవడం వల్ల ఫైబ్రాయిడ్లు పెరగవు.

ఫైబ్రాయిడ్లు మరియు సంతానలేమి

ఫైబ్రాయిడ్లు మరియు సంతానలేమి

సాధారణంగా ఫైబ్రాయిడ్లు, సంతానలేమికి పెద్ద సంబంధం ఉండదు.మీకు సంతానోత్పత్తి సమస్యలుంటే, మీ వైద్యుని సంప్రదించి ఇతర కారణాలు వెతకండి. ఇంకే కారణాలు లేకపోతే అప్పుడు ఫైబ్రాయిడ్ కి చికిత్స తీసుకోండి. సాధారణంగా ఆపరేషనే దీనికి మెరుగైన మార్గం.

ఫైబ్రాయిడ్లు మరియు గర్భస్రావం

ఫైబ్రాయిడ్లు మరియు గర్భస్రావం

ఫైబ్రాయిడ్లు సంతానోత్పత్తికి సంబంధం లేకపోయినా, గర్భస్రావాలకి అవి పెద్ద కారణాలని అంటారు.మీరు తొలినాళ్ళ గర్భవతిగా ఉండి, ఫైబ్రాయిడ్లు ఉంటే, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఫైబ్రాయిడ్ల లక్షణాలు

ఫైబ్రాయిడ్ల లక్షణాలు

ఫైబ్రాయిడ్ల లక్షణాలు నొప్పితో కూడిన నెలసరి, భారీ లేదా చాలాకాలం వచ్చే నెలసరి, అతి మరియు బాధాకర మూత్రం, కడుపు నిండుగా ఉన్న భావం, నడుంనొప్పి, మలబద్ధకం మరియు సంతానలేమి.

ఫైబ్రాయిడ్స్ ను కనుగొనటం ఎలా

ఫైబ్రాయిడ్స్ ను కనుగొనటం ఎలా

వీటిని వైద్యుడే పరీక్షించి కనుగొనాలి. అతను లేదా ఆమె మొదట ఏమైనా కణితులున్నాయా అని చూస్తారు. ఫైబ్రాయిడ్ మరియు కణితి లక్షణాలు కన్పిస్తే, నిర్ధారించుకోటానికి అల్ట్రా సౌండ్ పరీక్షను చేయించుకోమంటారు.

ఫైబ్రాయిడ్లకి చికిత్స

ఫైబ్రాయిడ్లకి చికిత్స

సాధారణంగా వీటికి పెద్ద చికిత్స ఉండదు. వైద్యులు లక్షణాలకోసం కొన్ని మందులిస్తారు. ఒకవేళ ఫైబ్రాయిడ్ మరీ పెద్దగా ఉండి, చాలా రక్తస్రావం అయ్యి నొప్పిగా ఉంటే, వైద్యుడు ఇతర చికిత్సా విధానాల గూర్చి ఆలోచిస్తాడు.సాధారణంగా చేసే చికిత్స ఆపరేషన్. అందులో ఉన్న రిస్క్ సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం.

ఇతరపద్ధతులు ఫైబ్రాయిడ్ కి రక్తప్రసరణ ఆపటం, ఫైబ్రాయిడ్ కణాలను నాశనం చేయటం, ఫైబ్రాయిడ్నే తీసేయటం, గర్భాశయ పొర తొలగించటం మరియు గర్భాశయాన్నే తీసెయ్యటం మొదలగునవి.

ఇతరపద్ధతులు ఫైబ్రాయిడ్ పెరుగుదలను ఆపే హార్మోన్ మందు సూచించటం.

English summary

Does Pregnancy Cause Uterine Fibroids?

It is important to know more about uterine fibroids if you or someone near and dear to you is suffering with it. Today, we bring to you some of the facts that you need to know about uterine fibroids. Read on to know more.
Subscribe Newsletter