For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భంలో ఉన్న శిశువులు అనుభవించే ఎనిమిది రకాల విషయాలు

గర్భధారణ అనేది తల్లికి ఒక అద్భుతమైన సమయం. గర్భధారణ అనేది గర్భిణీ స్త్రీకి కొత్తదనాన్ని, అసాధారణ భావాలను కలిగిస్తుంది.

By Lakshmi Bai Praharaju
|

గర్భధారణ అనేది తల్లికి ఒక అద్భుతమైన సమయం. గర్భధారణ అనేది గర్భిణీ స్త్రీకి కొత్తదనాన్ని, అసాధారణ భావాలను కలిగిస్తుంది.

వీటిలో కొన్ని తల్లికి మంచివి, మరికొన్ని ఆమెకు అసౌకర్యాన్ని కలుగ చేస్తాయి. వికారం, తిమ్మిరి వంటివి ఖచ్చితంగా గర్భధారణ సమయంలో బాధ కలిగిస్తాయి, కానీ గర్భంలో పుట్టబోయే బిడ్డ చెందిన మొట్టమొదటి భావన, ఒక స్త్రీ తన జీవితకాలంలో అనుభవించే అత్యంత అద్భుతమైన విషయాలలో ఒకటి.

things that the babies feel in the womb

గర్భంలో శిశువులు అనుభవించే విషయాలు

బిడ్డకు కూడా అదే ఉంటుంది. శిశువు గర్భంలో గడిపిన సమయాన్ని గుర్తుంచుకోలేక పోవచ్చు, కానీ తన అనుభవాలు, తన మొత్తం జీవితం కోసం తల్లి కడుపులో నేర్చుకున్నవి తెలుసుకుంటాడు. గర్భధారణ సమయంలో బిడ్డ భౌతికంగా పెరగడమే కాకుండా, గర్భంలో బిడ్డ మానసికంగా కూడా ఎదుగుతాడు.

గర్భంలో ఉన్నపుడు శిశువు అనుభవించి, నేర్చుకునే అద్భుతమైన విషయాలు చాలా ఉంటాయి. నేటి సాంకేతిక పరిజ్ఞానం, విజ్ఞాన శాస్త్రం గర్భాన్ని పరిశీలించడానికి, తెలియని విషయాలు మరిన్ని తెలుసుకునే మార్గాలను అందిస్తుంది.

గర్భంలో ఉన్న శిశువు ప్రవర్తన గురించి ఇంతకూ ముందు తెలుసుకోలేని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకోవచ్చు. పిల్లలు పుట్టక ముందే గొప్ప ప్రారంభం ఇవ్వడానికి ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకుంటే ఎంతో సహాయపడుతుంది.

ఈరోజు, మనం గర్భంలో పిల్లలు అనుభవించే, అభ్యసించే ఆశ్చర్యకరమైన విషయాల గురించి మనం మాట్లాడుకుందాము. మీరు తల్లి అయినా లేదా కాబోయే తల్లి అయినా, ఈ ఆర్టికిల్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. మరిన్ని విషయాల కోసం చదవండి....

గర్భంలో బిడ్డ ఒత్తిడికి గురవుతాడు

గర్భంలో బిడ్డ ఒత్తిడికి గురవుతాడు

తల్లి ఒత్తిడికి గురయితే గర్భంలో ఉన్న బిడ్డ కూడా ఒత్తిడికి గురవుటాడని చెప్తారు. గర్భంలో ఉన్న శిశువుకు 3-D ఇమాజిన్ చేసినపుడు బిడ్డ ఒత్తిడిలో ఉన్నపుడు, బిడ్డ చేతులు వెనక్కు పెట్టి ముఖాన్ని కప్పి ఉంచుతాడు. ఇది సంరక్షణ విధానంలో ఒక భాగంగా భావించబడుతుంది.

తల్లి హార్మోన్లు, రక్త పోటులో వచ్చే మార్పులే బిడ్డ వత్తిడి అనుభూతిని పొందడానికి కారణం కావొచ్చు. గర్భిణీ స్త్రీలు తమ ఒత్తిడిని పిల్లలు పొందకుండా ఉండాలని సూచిస్తారు.

పిల్లలో గర్భంలో రుచిని చూడగలుగుతారు

పిల్లలో గర్భంలో రుచిని చూడగలుగుతారు

20 వారాల బిడ్డ అయితే, రుచి మొగ్గలు అభివృద్ది చెందుతాయి. శిశువు ఇప్పుడు మీరు తీసుకునే ఆహారాన్ని అమ్నియోటిక్ ద్రవం ద్వారా రుచి చూడగలుగుతాడు. బిడ్డ వివిధ రుచులకు స్పందిస్తాడు. బిడ్డ తనకు ఇష్టమైన రుచిని పొందినపుడు ఎక్కువ చురుకుగా ఉంటాడు. ఈ కారణం వల్లే గర్భధారణ సమయంలో స్త్రీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తప్పక తీసుకోవాలి. కడుపులో ఉన్నపుడు బిడ్డ పెంచుకునే ఇష్టాలు, అయిష్టాలే పుట్టిన తరువాత కూడా పొందుతారు.

గర్భంలో ఉన్నపుడే బిడ్డ తన భావాలను, ఉద్రేకాలను తెలియచేస్తాడు

గర్భంలో ఉన్నపుడే బిడ్డ తన భావాలను, ఉద్రేకాలను తెలియచేస్తాడు

గర్భంలో శిశువు 36 వారాల వయసులో ఉన్నపుడు, ముఖ కండరాల వ్యక్తీకరణ బలంగా తెలుస్తుంది. శిశువు భావోద్వేగాలను అనుభవిస్తూ, వాటి స్పందిస్తున్నట్టు వ్యక్తీకరించడం మనకు తెలుస్తుంది. బిడ్డ నవ్వుతూ, కోపం వచ్చినపుడు పేదాలలో బాధ తెలియచేస్తుంది.

గర్భంలో బిడ్డ ఏడుస్తుంది

గర్భంలో బిడ్డ ఏడుస్తుంది

పిల్లలు ఏడుస్తారు. వారు పుట్టక ముందే ఇలా చేస్తారని మీకు తెలుసా? 3D అల్ట్రా స్కాన్ సమయంలో చాలా మంది ఏడుస్తున్నట్టు కనిపిస్తారు. గర్భంలో పిల్లలు ఏడుస్తున్నట్టు వారి ముఖ కండరాల వల్ల స్పష్టంగా కనిపిస్తుంది. అల్ట్రా సౌండ్ మైక్రోఫోన్ సహాయంతో, మూడవ నెలలోనే బిడ్డ ఏడుపును వినవచ్చు.

పిల్లలు మీలాగే ఫీల్ అవుతారు

పిల్లలు మీలాగే ఫీల్ అవుతారు

బిడ్డలు గర్భస్థ స్త్రీ లానే ఫీల్ అవుతారు. ఆమె సంతోషంగా ఉంటె, బిడ్డ చాలా సంతోషంగా, ప్రశాంతమైన కదలికలతో స్పందిస్తాడు. ఆమె విచారం వ్యక్తం చేస్తే, దాని ప్రకారమే బిడ్డ స్పందిస్తాడు.

గర్భంలో పిల్లలు సంగీతాన్ని వింటారు, ఇష్టమైన పాటలు వింటారు

గర్భంలో పిల్లలు సంగీతాన్ని వింటారు, ఇష్టమైన పాటలు వింటారు

కడుపుతో ఉన్న తల్లి అదే పనిగా పాడుతూ లేదా పాటను ప్లే చేస్తూ ఉంటె, బిడ్డ ఆపాటను ఇష్టపడడం ప్రారంభిస్తాడు. ఆ పాట బిడ్డకు ఒక జ్ఞాపకంగా ఉండి, పుట్టిన తరువాత ఆపాట విన్నపుడు తనకు బాగా తెలిసిన పాట అనుకుంటాడు. అతను మిగిలిన పాటల కంటే దీనికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాడు.

పిల్లలు గర్భంలో ఉన్నపుడే హాండ్-టు-ఐ సమన్వయాన్ని అభివృద్ది పరుచుకోవడం ప్రారంభిస్తారు

పిల్లలు గర్భంలో ఉన్నపుడే హాండ్-టు-ఐ సమన్వయాన్ని అభివృద్ది పరుచుకోవడం ప్రారంభిస్తారు

బిడ్డ గర్భం నుండి బైటికి వచ్చిన తరువాత అనేక భౌతిక సామర్ధ్యాలను అభివృద్ది చేసుకుంటాడు, కానీ తను గర్భంలో ఉన్నపుడే ఈ అభివృద్ది ప్రారంభ మవుతుంది. దీనికి హాండ్-టు-ఐ సమన్వయమే ఒక మంచి ఉదాహరణ. గర్భంలో ఉన్నపుడే బిడ్డ తన బొటన వేలు లేదా ఇతర వెళ్ళాను చీకుతాడు. ఈ చర్య భవిష్యత్తులో తనకు తానీ తినిపించుకోడానికి పూర్వగామిగా పనిచేస్తుంది.

English summary

Eight Things That The Babies Feel In The Womb

There are a lot of amazing things that a baby feels and learns when in the womb. Today's technology gives us ways to look into the womb and learn more about the unknown. This knowledge can be put to use to help give our children a great start even before they are born..
Desktop Bottom Promotion