For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాపం గర్భిణీలకు వచ్చే సమస్య ఒకటా..? రెండా?

|

ఏ ఆరోగ్యస్థితిలో అయినా లక్షణాలను తప్పించుకోలేం మరియు ముఖ్యంగా కడుపుతో ఉన్న సమయంలో కొన్ని లక్షణాలు విచిత్రంగా అన్పిస్తాయి. ఒకటో రెండో కాదు,పొద్దున్నే వికారం,మలబద్ధకం, కడుపు ఉబ్బరం, స్తనాలలో మార్పులు వంటి అనేక లక్షణాలు చాలా మంది స్త్రీలు కడుపుతో ఉన్నసమయంలో అనుభవిస్తారు.

అలాంటిదే అధిక లాలాజలం స్థితికూడా. దీన్నే టయాలిజం అని కూడా అంటారు. మరోపేరు సియాలోరియా.

<strong>గర్భిణీ స్త్రీలు కీరదోసకాయ తినడం వల్ల పొందే అద్భుత ప్రయోజనాలు..!!</strong>గర్భిణీ స్త్రీలు కీరదోసకాయ తినడం వల్ల పొందే అద్భుత ప్రయోజనాలు..!!

కడుపుతో ఉన్నప్పుడు అధిక లాలాజల స్థితి మీరు ఇది మొదటిసారి చదివే అవకాశాలు ఎక్కువ.ఇలా మీకు జరిగితే లేదా మీ దగ్గరివాళ్ళకు జరిగితే ఏం చేయాలని అనుకుంటుంటే మరింత చదవండి...

అధిక లాలాజలం గూర్చి మీ ప్రశ్నలన్నిటికి ప్రాథమికంగా ఈ వ్యాసంలో జవాబులివ్వబడ్డాయి. దాని గురించి తెలుసుకుంటే అది అంత సీరియస్ విషయం కాదని మీరూ తెలుసుకుంటారు.

లాలాజలం అంటే ఏంటి?

లాలాజలం అంటే ఏంటి?

ఇది నోటిలో స్రవించబడే ఒక ద్రవం. లాలాజలంలో ముఖ్యపదార్థం కేవలం నీరే. ఇదికాక,లాలాజలంలో ఆహారం జీర్ణం కావటానికి ప్రొటీన్లు, ఖనిజలవణాలుంటాయి. ఆరోగ్యకర శరీరానికి, ముఖ్యంగా నోటి ఆరోగ్యానికి లాలాజలం చాలాముఖ్యం. అది నమలటానికి,రుచికి, మింగటానికి ఉపయోగపడి మరియు పళ్ళను,చిగుళ్ళను రక్షిస్తుంది.

ఎంత లాలాజలం అధికం?

ఎంత లాలాజలం అధికం?

మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు కానీ ప్రతిరోజు ఒక సాధారణ వ్యక్తి దాదాపు ఒకటిన్నర లీటర్ల లాలాజలాన్ని స్రవిస్తారు. ఇది కొంచెం పెద్దమొత్తమే కదా.

ఇది ఎవరికీ పెద్దగా ఎందుకు తెలియదంటే, లాలాజలాన్ని పెద్ద పట్టించుకోకుండా మింగేస్తూనే ఉంటాం కాబట్టి. అదే కడుపుతో ఉన్న స్త్రీలలో లాలాజలం పరిమాణం రెండు లీటర్లు లేదా ఇంకా ఎక్కువయి వారికి అసౌకర్యం కలిగిస్తుంది.

గర్భవతులకి అధిక లాలాజలం ఎందుకు ఉత్పత్తి అవుతుంది?

గర్భవతులకి అధిక లాలాజలం ఎందుకు ఉత్పత్తి అవుతుంది?

అధిక లాలాజల స్థితి కేవలం కడుపుతో ఉన్నవారికి మాత్రమే రాదు. ఎవరికైనా వస్తుంది కానీ గర్భవతులలో ఇది ఎక్కువగా కన్పిస్తుంది. దీనికి కారణాలు ఇంకా వైద్యశాస్త్రంలో స్పష్టం కాలేదు. కానీ కొన్ని ఊహాగానాలను ఈ వ్యాసంలో చర్చించాం.

కడుపుతో ఉన్నప్పుడు ఏ దశలో ఇలా జరుగుతుంది?

కడుపుతో ఉన్నప్పుడు ఏ దశలో ఇలా జరుగుతుంది?

నివేదికల ప్రకారం చాలా కేసుల్లో అధిక లాలాజలం మొదటి మూడునెలల్లో, అంటే ఆరవ వారం లేదా అంతకన్నా ముందే మొదలై మెల్లగా తగ్గిపోతుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, అధిక లాలాజలం, పొద్దున్న వికారం మొదలైనపుడు మొదలై, అది తగ్గగానే,ఆగిపోతుంది.కొందరు దురదృష్టం ఉన్న స్త్రీలలో ఇది కడుపుతో ఉన్నంతకాలం ఉంటుంది.

అధిక లాలాజలానికి కొన్ని కారణాలు ;

అధిక లాలాజలానికి కొన్ని కారణాలు ;

హార్మోన్స్

గర్భానికి సంబంధించిన ఏ చిన్నవిషయమైనా, హార్మోన్లే మొదటికారణంగా ఉంటాయి. హార్మోన్ల అసమతుల్యతే దీనికి ముఖ్యకారణం అయివుండవచ్చు. వైద్యశాస్త్రం ఇంకా ఈ కారణాన్ని నిర్థారించలేదు కానీ కడుపుతో ఉన్న శరీరంలో ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్ పనితీరు అధికంగా ఉండటంతో దాన్ని కొట్టిపారేయలేకపోతున్నారు.

వికారం

వికారం

వికారం, కడుపుతో ఉండటం కలిసి సాగుతాయి. అనుక్షణం వికారం వల్ల ఏ ఆహారం తీసుకోలేరు, అలాగే లాలాజలం కూడా మింగలేరు. ఫలితంగా నోటిలో లాలాజలం పెరిగిపోయి బయటకి ఉమ్మాల్సి వస్తుంది. ఈ అధిక లాలాజలం హైపెరెమెసిస్ గ్రావియాడరం ఉన్న స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది.

గుండెల్లో మంట

గుండెల్లో మంట

కడుపుతో ఉన్నప్పుడు మరో లక్షణం గుండెల్లో మంట, ఇది అధికలాలాజలానికి మరో కారణం. కడుపులో ఉండే ఆమ్ల పదార్థం పైకి ఎగదన్నినపుడు ఆహారనాళంలో మంట కలిగిస్తుంది. దీన్ని ఎదుర్కోటానికి క్షారమైన అధిక లాలాజలం ఉత్పత్తి అవుతుంది. మింగినప్పుడు అది ఆహారనాళానికి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

ఇతర కారణాలు

ఇతర కారణాలు

పొగ ఎక్కువ తాగడం కూడా లాలాజల గ్రంథులను ప్రేరేపించి అధిక లాలాజలం ఉత్పత్తి చేస్తుంది.

పళ్ళలో, చిగుళ్ళలో ఇన్ఫెక్షన్లు పట్టించుకోకపోయినా ఇలా జరుగుతుంది. అందుకే కడుపుతో ఉన్నప్పుడు డెంటల్ చెకప్ చేస్తారు.

పాదరసం,క్రిమిసంహారకాల వంటి విషపదార్థాల వద్దకి వెళ్ళినపుడు కూడా ఇలా జరుగుతుంది.

తల్లి ద్వారా వచ్చిన కొన్ని అనారోగ్య స్థితులు కూడా కారణమవుతాయి.

ఇది హానికారకమా?

ఇది హానికారకమా?

ఆరోగ్యపరంగా చూస్తే అధికలాలాజలం తల్లికి, గర్భాశయంలో బిడ్డ ఎదుగుదల,ఆరోగ్యానికి పెద్ద ప్రభావం ఏం చూపించదు.

కడుపుతో ఉన్నప్పుడు ఉన్న కారణాలు తప్ప ఇతర కారణాలు ఏవీ లేవని వైద్యుడిని కలిసి నిర్థారించుకోవటం మంచిది.

అధిక లాలాజలాన్ని తగ్గించటానికి ఇంటి చిట్కాలు

అధిక లాలాజలాన్ని వీటితో నియంత్రించవచ్చు.

ఎప్పుడూ నీరు తాగుతూ ఉండండి. వాటర్ బాటిల్ ను ఎప్పుడూ మీతో ఉంచుకోండి.

పిండిపదార్థాలు ఎక్కువ తినకుండా, చిన్న మొత్తాలలో భోజనాలు చేయండి.

నోటి పరిశుభ్రత చాలా ముఖ్యం. బ్రష్ చేసుకుంటూ నోటిని చాలాసార్లు శుభ్రపరుచుకోండి.

బబుల్ గమ్ తింటూ ప్రయత్నించండి.

తక్కువ ఉమ్మేయండి.

English summary

Excessive Salivation During Pregnancy

Are you wondering about the reasons behind excessive salivation during pregnancy? It is also called ptyalism. It is also referred to as sialorrhea. Read to know more about..
Story first published:Saturday, October 28, 2017, 17:48 [IST]
Desktop Bottom Promotion