మీ పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ తప్పనడానికి 6 కారణాలు

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

ఇంటివద్ద చేసే గర్భధారణ పరీక్షలు మీ మూత్రంలో హెచ్ సిజి( హ్యూమన్ కోరియోనిక్ గొనాడోట్రోపిన్) స్థాయిలను పరీక్షిస్తాయి. ఈ హార్మోన్ మీ గర్భంలో ఫలదీకరణం చెందిన భ్రూణం స్రవించటం వల్ల జరుగుతుంది.

గర్భపరీక్ష పాజిటివ్ గా రావటం కొంతమందికి సంతోషం కలిగించవచ్చు కానీ మరికొంతమందికి బాధ మిగులుస్తుంది. అవి పూర్తిగా శాస్త్రీయం కాదు.

అంటే మీ గర్భధారణ పాజిటివ్ ఫలితం కొన్నిసార్లు తప్పు అయి మీరు నిజంగా కడుపుతో ఉండకపోవచ్చు.

గర్భనిర్ధారణ కోసం వెనిగర్ టెస్ట్ : హోం టిప్

అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాలని ఉందా?

పూర్తిగా చదివి తెలుసుకోండి........

#1 పరీక్షించే స్టిక్ మూత్రంలో ఎక్కువసేపు ఉంటుంది

#1 పరీక్షించే స్టిక్ మూత్రంలో ఎక్కువసేపు ఉంటుంది

ఈ కారణం వల్ల ఇంట్లో పరీక్షించుకునే గర్భధారణ టెస్ట్ లు కొన్ని సూచనలతో పాటు వస్తాయి. ఇది ఎందుకంటే నిర్దేశించిన సమయం తర్వాత మూత్రం సాంపిల్ నుంచి స్టిక్ ను బయటకి తీయకపోతే మీకు తప్పుడు పాజిటివ్ ఫలితం వస్తుంది.

ఇలా ఎందుకవుతుందంటే, ఎక్కువ సేపు ఉంచితే మూత్రం ఆవిరి అయిపోతుంది. ఈ ఆవిరి అయ్యే గీత మీ తప్పు ఫలితంకి అదనంగా పనిచేస్తుంది.

అందుకని మీరు గర్భవతో కాదో తెలియనప్పుడు, మీరు మరోసారి కొత్త స్టిక్ తో ప్రయత్నించి సూచనల ప్రకారం చూడండి.

#2 టెస్ట్ ఎక్స్పైర్ అయిపోయింది

#2 టెస్ట్ ఎక్స్పైర్ అయిపోయింది

ప్రెగ్నెన్సీ కిట్ లు మెడికల్ షాపుల్లో ఎక్కువకాలం ఉండిపోవచ్చు. అందుకని కొనేప్పుడు జాగ్రత్తగా ఎక్స్పైరీ డేట్లు చూసి కొనుక్కోండి.

ఎందుకంటే ఒకసారి స్టిక్ ఎక్స్ పైర్ అయిపోయాక, పరీక్ష ఫలితం సరిగ్గా రాదు, ఒకవేళ పాజిటివ్ గా వచ్చినా అది నిజం కాకపోవచ్చు.

#3 ఇదివరకు మీకు గర్భస్రావం జరిగింది

#3 ఇదివరకు మీకు గర్భస్రావం జరిగింది

ఈ కేసులో ఫలితం నిజంగానే పాజిటివ్ గా వస్తుంది. కానీ దురదృష్టవశాత్తూ, మీ శరీరం పిండాన్ని(అబ్ నార్మల్ డిఎన్ ఎ కారణంగా) తిరస్కరించటంతో, మీకు పిరియడ్ వచ్చి ఫలితం పాజిటివ్ గా వచ్చింది.

ఈ పరిస్థితిని కెమికల్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇది 50-75% గర్భస్రావాలకి కారణమవుతుంది.

#4 మీరు గర్భధారణ మందులను వాడుతున్నారు

#4 మీరు గర్భధారణ మందులను వాడుతున్నారు

కణజాల ఫలదీకరణం ద్వారా ప్రెగ్నెంట్ కావాలని ప్రయత్నిస్తున్నప్పుడు, మీరు వాడే హెచ్ సిజి మందులు, ఇంజెక్షన్ల వల్ల కూడా ఈ పరీక్ష ఫలితం పాజిటివ్ గా రావచ్చు.

అందుకే వైద్యులు మీరు మందులు వాడుతున్నట్లయితే, కొన్ని వారాలు ఆగి పరీక్ష చేసుకోమంటున్నారు. అప్పుడు తప్పుడు సానుకూల ఫలితాలను ఆపి మీరు నిరాశపడకుండా ఉండవచ్చు.

#5 మీకు అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు

#5 మీకు అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు

మూత్రనాళ ఇన్ఫెక్షన్, అండాశయ కణితులు, కిడ్నీ వ్యాధుల వల్ల మూత్రంలో రక్తం పడటం వంటి అనేక అనారోగ్య కారణాల వల్ల కూడా మీ గర్భధారణ ఫలితాలు సానుకూలంగా రావచ్చు. అంతేకానీ మీరు నిజంగా గర్భవతి కాదు.

#6 అండాశయ కాన్సర్

#6 అండాశయ కాన్సర్

అండాశయ కాన్సర్ మౌనంగా మిమ్మల్ని హరించే మహమ్మారి. మీ గర్భాశయంలోనే పెరుగుతూ కూడా చివరి దశల్లోనే బయటపడుతుంది.

అండాశయ కాన్సర్ ఉందో లేదో ఇంటివద్దనే చేసుకునే ప్రెగ్నెన్సీ టెస్ట్ తో తెలుసుకోవచ్చు. ఎందుకంటే అండాశయ కాన్సర్ ఉన్న కణాలు హెచ్ సిజి హార్మోన్ ను అసాధారణంగా ఉత్పత్తి చేయటం వల్ల పరీక్షలో సులభంగా తెలుస్తుంది.

అందుకని మీరు ఒకవేళ లైంగికంగా యాక్టివ్ గా లేకపోయినా, మీ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ గా వస్తే వెంటనే గైనకాలజిస్టును సంప్రదించండి.

ఈ వ్యాసం మీకు సాయపడిందా?

బోల్డ్ స్కైలో, మేము మీ మానసిక వత్తిడి లేని సంతోషకర జీవితం కోసం ఆధునిక వైద్య సమాచారం, ఆరోగ్యచిట్కాలు, ఇంటి వైద్యాలు ఎప్పటికప్పుడు మేటిగా అందించాలని తపనపడతాం.

మీకు ఈ వ్యాసం ఉపయోగకరంగా అన్పిస్తే, సోషల్ మీడియాలో మీ మిత్రులతో పంచుకోండి. వారు కూడా దీని ఉపయోగం పొందుతారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    6 Reasons Why Your Positive Pregnancy Test is Wrong

    That means there is a possibility that your positive pregnancy test is actually false-positive and you are not really pregnant. Want to know why that happens? Read on to find out.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more