మీరు గర్భవతిగా ఉన్నపుడు కడుపులో బిడ్డ రాత్రిపూట ఎందుకు కదులుతుందో తెలుసా?

By: Gandiva Prasad Naraparaju
Subscribe to Boldsky

కడుపుతో ఉన్నవారు లోపల వారి బిడ్డ కదలికలకు ఎప్పుడూ సంతోషపడుతూ ఉంటారు. ప్రతి శిశువు గర్భంలో ఉన్నప్పటికంటే, ప్రపంచంలోకి అడుగుపెట్టిన తరువాత చాలా భిన్నంగా మారుతుంది అనేది మనం గమనించాలి. మీరు ఏడు లేదా ఎనిమిదో నెలలో ఉన్నపుడు మీ శిశువు ప్రవర్తన, ఎంపిక నమూనాలను మీరు గమనించవచ్చని అమెరికన్ ప్రెగ్నెన్సీ అసోసియేషన్ వెల్లడించింది. సాధారణంగా, కదలిక అనేది ఏరోజు ఏ సమయంలో జరిగిన అది ఎంతో ఆనందంగా అనిపిస్తుంది.

గర్భవతిగా ఉన్నపుడు కడుపులో బిడ్డ రాత్రిపూట ఎందుకు కదులుతుంది

ఏడు నెలల గర్భధారణ సమయంలో మీ శిశువు సాధారణంగా ఎక్కువ సమయం నిద్రపోతూ ఉంటుంది. శిశువులు దాదాపు గంటకు 50 సార్లు కదులుతూ ఉంటె, 95% మగత నిద్రలో ఉంటారని నేటి సైకాలజీ చెప్పింది. నమూనా రోజువారీ మారుతూ ఉండవచ్చు, కానీ శిశువుకు జన్మనిచ్చే సమయానికి కదలికలు చాలా ఊహాజనితంగా ఉంటాయి.

కొంతమంది శిశువులు రోజంతా చాలా ఉత్సాహంగా ఉంటారు అని అమెరికన్ ప్రెగ్నెన్సీ అసోసియేషన్ వారు సూచించారు. మీరు రాత్రి సమయంలో కదలికలను గమనించ గలరు గానీ పగటి సమయంలో ఎక్కువ గమనించలేరు. నెలలు గడవక ముందు లేదా మీరు స్ధిరంగా ఉన్నపుడు కదలికలను అనుభవించలేరు. కొన్నిసార్లు మీ శిశువు ఎక్కిళ్ల రూపంలో చేసే చిన్ని కదలికలు మీరు గమనించక పోవచ్చు ఎందుకంటే మీరు ముందుగా కంగారుగా ఉంటారు కాబట్టి. కానీ శిశువు కదలికలు తీవ్రంగా ఉన్నపుడు లేదా శిశువు మిమ్మల్ని గట్టిగా తన్నినపుడు మీరు కదలికలను గమనిస్తారు.

గర్భవతిగా ఉన్నపుడు కడుపులో బిడ్డ రాత్రిపూట ఎందుకు కదులుతుంది

మీ శిశువు రాత్రులందు ఎక్కువ చలాకీగా ఎందుకు కనిపిస్తుందో వివరించడానికి ఒక కారణం ఉంది, ఏమిటంటే ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండడం, అంటే ఆ సమయంలో ఎటువంటి పనీ చేయకుండా ఉండడం లేదా ఎటువంటి కదలికా లేకపోవడం వల్ల. పగలు, మీరు అటూ ఇటూ కదులుతూ ఉంటారు, మీ కదలికల వల్ల శిశువు దాదాపు నిద్రకు ఉపక్రమిస్తుంది. మీరు పడుకున్నపుడు, కదలికలు ఆగిపోతాయి, శిశువు తన చుట్టూ ఏమి జరుగుతుందా అని అటూ ఇటూ తిరగడం ప్రారంభిస్తుంది.

గర్భవతిగా ఉన్నపుడు కడుపులో బిడ్డ రాత్రిపూట ఎందుకు కదులుతుంది

అదికాకుండా, ఏడు నెలల గర్భధారణ సమయంలో ఫీటస్ శబ్దాలను గ్రహించడం ప్రారంభిస్తుంది, ప్రాధాన్యతలు చూపించడం ప్రారంభిస్తుంది. తల్లి గొంతును గుర్తించడం, ప్రాధాన్యతలు చూపించడం కూడా చేస్తుంది. మీ శిశువు చుట్టుపక్కల కొత్త గొంతును వింటే, మీ బిడ్డ మరింత ఉత్సాహంగా ఉంటుంది. మరోవైపు, సమయం కాని సమయంలో స్నాక్ లేదా స్నాక్ లో మీరు ఏమి తింటున్నారు అనేది కూడా మీ శిశువు గమనించడం అనేది మరో సామాన్య విషయం. మీ శిశువు ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ద్వారా మీరు తినే పదార్ధాల రుచులను కూడా గ్రహిస్తుంది. కఠినమైన రుచి ఉంటె, మీ బిడ్డ ఆ వాసనను గుర్తించడం నేర్చుకుంటుంది.

గర్భవతిగా ఉన్నపుడు కడుపులో బిడ్డ రాత్రిపూట ఎందుకు కదులుతుంది

మీ శిశువు రాత్రిళ్ళు ఎక్కువగా కదులుతూ ఉంటె ఏమీ బాధపడకండి, మధ్యరాత్రి సమయంలో కాసేపు నిఠారుగా కూర్చోండి చాలు. మీ దైనందిన పనులను చేసుకోండి. మీ రోజువారీ కార్యక్రమాలతో పాటు మీ శిశువు స్పందిస్తుందా లేదా గమనించుకోండి.

ఏవైనా తేడాలు ఉంటె గమనించండి. మీ ;శిశువు నిశ్సబ్దంగా ఉన్నాడని అనుకుంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ బిడ్డ నిద్రపోయే విధానంలో అభివృద్ది చేస్తున్నట్లు తెలుసుకోవాలి. మీకు ఎప్పుడైనా భయంగా అనిపిస్తే, మీ వైద్యుని సంప్రదించి మాట్లాడడం మంచిది.

English summary

Here's Why Your Baby Moves At Night When You Are Pregnant

Preggos are always excited to feel their baby’s movements inside. As it may seem, every baby turns out to be different while in the womb than after it enters the world. The American Pregnancy Association says that by your seventh or the eighth month of your pregnancy a woman might observe a set pattern in her baby’s behavior and choices. In general, any movement is supposed to be good movement irrespective of what time of the day or when it occurs
Subscribe Newsletter