For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో చనుమొనల దురదకు హోం రెమెడీస్

By Lakshmi Perumalla
|

ఒక మహిళ జీవితంలో గర్భం అనేది అత్యంత కీలకమైన కాలం. ఈ సమయంలో శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. గర్భధారణ అనేది ప్రతి స్త్రీ జీవితంలో సంతోషకరమైన క్షణం. శరీరంలో జరిగే మార్పులు కొన్ని అసౌకర్యంగా ఉంటాయి. దాంతో తల్లికి విసుగు మరియు అసహ్య అనుభూతి కలుగుతుంది.

ప్రతి స్త్రీ గర్భధారణ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటారు. గర్భిణీ స్త్రీని ఎదుర్కొనే అత్యంత అసౌకర్యకరమైన మార్పులలో దురద అనేది ఒకటి.

గర్భిణీ స్త్రీలలో కలిగే మొదటి మార్పుగా రొమ్ము నొప్పి ,సున్నితత్వం మరియు దురద వస్తాయి. గర్భధారణ సమయంలో హార్మోన్స్ మార్పుల కారణంగా నిపుల్స్ దురద వస్తాయి. ఇవి గర్భంతో పాటే వస్తాయి.

home remedies for itchy nipples | remedies for itchy nipples during pregnancy

రొమ్ము సున్నితంగా మారటంతో విపరీతమైన బాధ కలుగుతుంది. అలాగే రక్త ప్రసరణ పెరిగి రొమ్ము బారంగాను,పెద్దదిగాను ఉంటుంది. నిపుల్స్ చాలా సున్నితంగా ఉండి చిన్న టచ్ కి కూడా జలదరింపు భావన కలుగుతుంది.

గర్భధారణ సమయంలో నిపుల్స్ దురద సాధారణమే. గర్భం ధరించిన స్త్రీ బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. భారీ రొమ్ముల కారణంగా నిపుల్స్ దురద వస్తాయి.

అంతేకాక ఛాతీపై సాగిన గుర్తులకు కారణం అవుతుంది. మూడవ త్రైమాసికంలో రొమ్ములు పెద్దగా అవ్వటంతో నిపుల్స్ దురద ఎక్కువగా మరియు తీవ్రంగా మారుతుంది.

గర్భధారణలో చనుమొనల సంరక్షణకు చిట్కాలుగర్భధారణలో చనుమొనల సంరక్షణకు చిట్కాలు

గర్భధారణ సమయంలో నిపుల్స్ దురదను తగ్గించటానికి అనేక ఇంటి చిట్కాలు ఉన్నాయి. వాటిని ఒకసారి పరిశీలన చేయండి.

కోల్డ్ కంప్రెస్

కోల్డ్ కంప్రెస్

ఎరుపు లేదా మంట నిరోధించడానికి దురద ప్రాంతాలలో కోల్డ్ కంప్రెస్ లేదా ఐస్ ప్యాక్ పెట్టాలి. ఈ విధంగా ప్రతి రోజు ఐస్ ప్యాక్ పెడుతూ ఉంటే చిరాకు దురద నుండి ఉపశమనం కలుగుతుంది.

కలబంద జెల్

కలబంద జెల్

కలబంద జెల్ నిపుల్స్ దురదకు చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. గర్భిణీ స్త్రీలు చికాకుగా ఉన్న ప్రదేశంలో కలబంద జెల్ రాయాలి. కలబంద జెల్ ఆ ప్రాంతంలో దురద మరియు వాపును తగ్గిస్తుంది. జెల్ రక్షణ పొరను సృష్టించడంలో సహాయపడుతుంది. అలాగే చర్మ నష్టాన్ని నిరోధిస్తుంది.

గర్భధారణ సమయంలో వచ్చే ఆరోగ్య సమస్యలు గర్భధారణ సమయంలో వచ్చే ఆరోగ్య సమస్యలు

సీమ చామంతి

సీమ చామంతి

సీమ చామంతిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నిపుల్స్ దురదను తగ్గించటంలో చాలా బాగా సహాయపడతాయి. ప్రభావిత ప్రాంతాలలో సీమ చామంతిని రాసినప్పుడు దురద మరియు పొడిదనం తగ్గుతాయి. అటోపిక్ చర్మ సంబంధ సమస్యలపై సీమ చామంతి హెడ్రోకార్టిసోనే క్రీమ్ కన్నా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె

గర్భధారణ సమయంలో ఛాతి భాగంలో చర్మం సాగి దురదకు దారితీస్తుంది. కృత్రిమ ఫైబర్స్ ధరించినప్పుడు కూడా చర్మం విసుగు చెందుతుంది. ఛాతి మరియు నిపుల్స్ పొడిగా లేకుండా తేమగా ఉండటానికి కొబ్బరినూనె చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కొబ్బరినూనె గర్భిణీ స్త్రీకి చాలా ఉపశమనాన్ని కలిగిస్తుంది.

జోజోబా ఆయిల్

జోజోబా ఆయిల్

జోజోబా ఆయిల్ లో శోథ నిరోధక లక్షణాలు ఉన్నాయి. అందువల్ల ఛాతి మరియు నిపుల్స్ తేమగా ఉండేలా చేస్తుంది. దాంతో రొమ్ము చర్మం కూడా పొడిగా లేకుండా ఉంటుంది. గర్భధారణ సమయంలో జొజోబా నూనెను ఉపయోగించడం చాలా మంచిది. ఎందుకంటే యాంటి సెప్టిక్ క్రీమ్ ల మాదిరిగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

పెట్రోలియం జెల్లీ

పెట్రోలియం జెల్లీ

గర్భధారణ సమయంలో నిపుల్స్ దురద అనేది సాధారణంగా వచ్చే సమస్య. ఈ సమయంలో హార్మోన్స్ మార్పుల కారణంగా ఛాతి పెరగటం,చర్మం సాగటం వంటి వాటి కారణంగా నిపుల్స్ దురద,పొడిదనం వస్తాయి. నిపుల్స్ మరియు చర్మం తేమగా ఉంటే దురద సమస్య నియంత్రణలో ఉంటుంది.

పిప్పరమెంటుట్ టీ

పిప్పరమెంటుట్ టీ

శిశువు జన్మించినప్పుడు తల్లి శిశువుకు పాలు ఇవ్వటానికి ప్రారంభించినప్పుడు నిపుల్స్ దురద వస్తుంది. నిపుల్స్ దురద మరియు పొడిగా మారిపోతాయి. ఇది నవజాత శిశువు ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. శిశువు జన్మించే ముందు ఈ పరిస్థితికి చికిత్స చేయాలి. ప్రభావిత ప్రాంతాల్లో వెచ్చని పిప్పరమెంటుట్ టీని రాయటం ద్వారా నిపుల్స్ పగుళ్లు మరియు దురదను తగ్గించవచ్చు.

హైడ్రేడ్ గా ఉంచాలి

హైడ్రేడ్ గా ఉంచాలి

రాత్రి పడుకొనే సమయంలో రొమ్ము మరియు నిపుల్స్ కి లోషన్ రాసి మసాజ్ చేస్తే మరుసటి రోజు ఉదయం మృదువుగా మారతాయి. చర్మం స్నానం చేసిన తరువాత కూడా పొడిగా ఉంటుంది.శరీరంలో బాధిత ప్రాంతాల్లో ఈ లోషన్ ని రాయవచ్చు.

వోట్మీల్ పేస్ట్

వోట్మీల్ పేస్ట్

వోట్మీల్ పేస్ట్ నిపుల్స్ దురదను తగ్గించటంలో బాగా పనిచేస్తుంది. గర్భిణీ స్త్రీలు వోట్మీల్ స్నానం చేయవచ్చు. ఈ విధంగా చేయటం వలన రొమ్ములు మరియు నిపుల్స్ దురదకు ఉపశమనం కలుగుతుంది.

నువ్వుల నూనె

నువ్వుల నూనె

నువ్వుల నూనె గర్భధారణ సమయంలో సమస్యల పరిష్కారానికి ఉత్తమమైనది. నువ్వుల నూనెను రొమ్ము మరియు నిపుల్స్ కి రాసి సున్నితంగా మసాజ్ చేయాలి. ఇది నిపుల్స్ ని తేమగా ఉంచటమే కాకుండా మృదువుగా ఉంచుతుంది. నువ్వుల నూనె గర్భధారణ సమయంలోనే కాకుండా ఇతర సమయాల్లో కూడా దురద తగ్గించటానికి ఉత్తమ ఇంటి చిట్కా అని చెప్పవచ్చు. స్నానం చేసే ముందు నువ్వులనూనెను రాసుకోవాలి. మహిళలు గోరువెచ్చని నువ్వుల నూనెను ఉపయోగిస్తే మరింత ప్రభావవంతంగా పని చేస్తుంది.

చర్మ సంరక్షణ కోసం ఉపయోగించే ఉత్పత్తులు కూడా దురదను కలిగించవచ్చు. కఠినమైన సబ్బులు మరియు పరిమళ ద్రవ్యాలను నివారించవలసిన అవసరం ఉంది. గర్భధారణ సమయంలో నిపుల్స్ దురదను తగ్గించడంలో గృహ చికిత్సలు సమర్థవంతంగా సహాయపడతాయి.

English summary

home remedies for itchy nipples | remedies for itchy nipples during pregnancy

home remedies for itchy nipples | remedies for itchy nipples during pregnancy ,Check out the home remedies for itchy nipples during pregnancy.home remedies for itchy nipples, remedies for itchy nipples during pregnancy
Desktop Bottom Promotion