For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్తగా పెళ్లై, ఇప్పుడప్పుడే పిల్లలు వద్దనుకునే వారికి సేఫ్ పీరియడ్ టెక్నిక్స్..!!

కొంతగా పెళ్ళైన వారు అప్పడే పిల్లలు వద్దనుకునే వారు ఎలాంటి కాంట్రాసెప్టివ్ పిల్స్ తీసుకోకుండా, అధునాత పద్దతులను ఉపయోగించకుండా ఒకటి రెండు సంవత్సరాలు గర్భందాల్చకుండా ఉండాలంటే ఏం చేయాలి?

|

కొంతగా పెళ్ళైన వారు అప్పడే పిల్లలు వద్దనుకునే వారు ఎలాంటి కాంట్రాసెప్టివ్ పిల్స్ తీసుకోకుండా, అధునాత పద్దతులను ఉపయోగించకుండా ఒకటి రెండు సంవత్సరాలు గర్భందాల్చకుండా ఉండాలంటే ఏం చేయాలని కొత్త దంపతులు ఆలోచిస్తుంటారు. అందుకోసం ఒక సురక్షితమైన నేచురల్ పద్దతి ఒకటి ఉంది. అదే సేఫ్ జోన్ లేదా సేఫ్ పీరియడ్ అంటారు.

సాధారణంగా రుతుక్రమం నెలరోజులకోసారి వస్తుంది. ఇక్కడ నెల అంటే సరిగ్గా క్యాలండర్‌లోని నెల అని అర్థం కాదు. చాంద్రమానం ప్రకారం నెల అనుకోవచ్చు. అంటే 28 రోజులన్నమాట. ఒక రుతుక్రమంలోని నెలరోజుల వ్యవధిలో జరిగే పరిణామాలను మూడు దశలుగా విభజించవచ్చు.

మొదటిది అండం విడుదలకు ముందుదశ. దీన్ని ఫాలిక్యులార్ ఫేజ్ అంటారు. ఇక రెండోది అండం విడుదల దశ. దీన్ని ఒవ్యులేషన్ ఫేజ్ అంటారు. ఇక అండం విడుదలైన తర్వాతది లూటియల్ ఫేజ్. కాబట్టి, త్వరగా పిల్లలు వద్దనుకునే సేఫ్ పీరియడ్ టెక్నిక్స్ ఎలా ఫాలోఅవ్వాలో తెలుసుకుందాం..

 రుతుస్రావం వచ్చాక

రుతుస్రావం వచ్చాక

రుతుస్రావం వచ్చాక రక్తస్రావం కనిపించిన మొదటి రోజు నుంచి లెక్కవేసి ఈ దశలను నిర్ణయించుకోవచ్చు.

ఇలా విడుదలైన అండం

ఇలా విడుదలైన అండం

ఇలా విడుదలైన అండం ఫెలోపియన్ ట్యూబ్స్ ద్వారా గర్భాశయం (యుటెరస్)లోకి చేరుతుంది. ఈ దశలోనే 24 గంటల వ్యవధిలో వీర్యం అండంతో కలిస్తే ఫలదీకరణ జరిగి అది బిడ్డగా ఎదుగుతుంది.

 అలా జరగడానికి వీలుగా అండంలో

అలా జరగడానికి వీలుగా అండంలో

అలా జరగడానికి వీలుగా అండంలో ఉండే కార్పస్ ల్యూటియమ్ అనే జీవరసాయనాలు తోడ్పడతాయి. అండం విడుదల తర్వాతి దశను ల్యూటియల్ ఫేజ్ అంటారు. ఈ లూటియల్ ఫేజ్ 14 రోజులు ఉంటుంది.

సాధారణంగా పీరియడ్స్ క్రమం తప్పకుండా వచ్చే

సాధారణంగా పీరియడ్స్ క్రమం తప్పకుండా వచ్చే

సాధారణంగా పీరియడ్స్ క్రమం తప్పకుండా వచ్చే వారిలో మాత్రమే సేఫ్ పీరియడ్‌కు ఆస్కారం ఉంటుంది.

ఉదాహరణకు

ఉదాహరణకు

ఉదాహరణకు ప్రతి 28 రోజులకు క్రమం తప్పకుండా పీరియడ్స్ వచ్చేవారికి 14 రోజున అండం విడుదలై ఉంటుంది.

 ఒకవేళ ఆ టైమ్‌లో గర్భధారణ జరగకపోతే

ఒకవేళ ఆ టైమ్‌లో గర్భధారణ జరగకపోతే

ఒకవేళ ఆ టైమ్‌లో గర్భధారణ జరగకపోతే ల్యూటియల్ ఫేజ్ మొదలై ఆ తర్వాత 14 రోజున రుతుస్రావం అవుతుంది.

ఇక గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే...

ఇక గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే...

అండం ఎప్పుడు విడుదలైనా కూడా గర్భధారణ జరగకపోతే ల్యూటియల్ ఫేజ్ మాత్రం తప్పనిసరిగా 14 రోజులు ఉంటుంది.

మరీ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే..

మరీ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే..

. క్రమం తప్పకుండా పీరియడ్స్ వచ్చే వారిలో పీరియడ్స్ మొదలైన తర్వాత మొదటి ఏడురోజులూ, రుతుస్రావం వస్తుందనుకునే రోజుకు ముందుగా ఉండే ఆ ఏడురోజుల్లో భార్యాభర్తలు కలిసినా గర్భధారణకు అవకాశం ఉండదు.

గర్భనిరోధానికి ‘సేఫ్ పీరియడ్’ ఉపయోగపడదు.

గర్భనిరోధానికి ‘సేఫ్ పీరియడ్’ ఉపయోగపడదు.

అయితే రుతుక్రమం అన్నది అందరిలోనూ ఒకేవిధంగా ఉండదు. కొందరికి నెలకంటే ఆలస్యంగానూ కావచ్చు. మరికొందరిలో ముందుగానే నెలసరి రావచ్చు. ఈ విషయంలో 35 రోజులు దాటితే దాన్ని ఆలస్యంగానూ, 21 రోజులైతే దాన్ని ముందుగా వచ్చే నెలసరి అని డాక్టర్లు పరిగణిస్తారు. ఇటువంటి వారిలో గర్భనిరోధానికి ‘సేఫ్ పీరియడ్' ఉపయోగపడదు.

గత ఆర్నెల్ల వ్యవధిలో పీరియడ్స్ సక్రమంగా వస్తున్నవారు మాత్రమే దీనిపై కొంతమేరకు ఆధారపడవచ్చు.

గత ఆర్నెల్ల వ్యవధిలో పీరియడ్స్ సక్రమంగా వస్తున్నవారు మాత్రమే దీనిపై కొంతమేరకు ఆధారపడవచ్చు.

ఇక ప్రసవం అయిన మహిళలు దీన్ని అనుసరించదలచుకుంటే తమ రుతుస్రావం పూర్తిగా క్రమబద్ధం అయ్యాక తమ పీరియడ్స్ అయ్యే తీరును కనీసం ఆర్నెల్లు గమనించాక మాత్రమే దీన్ని అనుసరించాల్సి ఉంటుంది.

English summary

How To Calculate Safe Period To Avoid Pregnancy?

Sex gives natural pleasure. But it comes with a baggage called pregnancy. Children are a blessing for those who are ready to expand their family. However, not every adult having an active sex life would want a baby. Would they? While there are several birth control measures you can follow, it is imperative to make your safe days calculation in order to avoid an unwanted pregnancy.
Desktop Bottom Promotion