తల్లి బిడ్డల మధ్య బంధం ప్రపంచంలోనే అన్నిటికన్నా అందమైనది. దీన్ని మాటల్లో ఎంత వర్ణించినా తక్కువే అవుతుంది. జీవితాంతం మధురంగా నిలిచిపోయే ఈ బంధం వారిద్దరూ ఇంకా కలవకముందే గర్భంలోనే ఎప్పుడో మొదలవుతుంది.
ఆశ్చర్యంగా ఉంది కదూ? ఈ వాస్తవిక ప్రపంచంలో తల్లీ బిడ్డలాంటి అద్భుత బంధం ఉండటం చాలా విచిత్రమే మరి.
తల్లికి ఆరోగ్యపరంగా మొదటి మూడు నెలలు చాలా అలసటగా ఉంటాయనే చెప్పాలి. అందుకని తనకు పుట్టబోయే బిడ్డ గురించి ఆమె ధ్యాస పెట్టలేదు. కానీ నెలలు నిండుతున్న కొద్దీ, బేబీ అన్ని విషయాలకు స్పందిస్తుంది, అలా వారి బంధం కూడా గట్టిపడుతుంది.
బేబీ కడుపులో చేసే అల్లరి విషయాలు చూడటానికి చాలా అందంగా, ఆనందంగా ఉంటాయి. చూడటం అంటే కడుపు పెరిగాక బిడ్డ కదలికలు కన్పిస్తాయి,అలా కన్పించకపోయినా తల్లి సులభంగా ఫీలవగలదు. మీ పెరిగిన పొట్టలో పెరుగుతున్న బేబీతో ఎన్ని రకాలుగా సమయం గడపవచ్చో మేమిక్కడ తెలియచేసాం. ఈ లిస్టులో 8 మార్గాలు ఉన్నాయి. అవేంటో చూడండి....
కొంచెం కొంచెం మాట్లాడుతూ ఉండండి.
కడుపులో ఉన్న బిడ్డ 23 వారాల సమయం నుంచి అన్నిటినీ వినటం మొదలుపెడుతుంది. మొదటగా తల్లి గుండెచప్పుడు, రెండవది తల్లి గొంతు వింటుంది. బేబీకి ఇవి ఎంత అలవాటయిపోతాయంటే పుట్టిన వెంటనే కూడా తల్లిని సులభంగా గుర్తించగలదు. అవును, మీ పుట్టబోయే బిడ్డ మీరు చెప్పేవన్నీ వింటోంది. కేవలం తనతో మాట్లాడేవే కాదు, ఇతరులతో మాట్లాడే విషయాలు కూడా. కొందరు తల్లులు తమ పొట్టతో మాట్లాడటానికి సిగ్గుపడతారు కానీ, మీరు మొదలుపెడితే అదే అలవాటయిపోతుంది. కొంచెం సమయం కేవలం మీకు, మీ కడుపులోని బిడ్డకి మాత్రమే కేటాయించుకోండి. ఒక అధ్భుతమైన ఆలోచన మీ బేబీకి కథలను పైకి చదివి విన్పించటం.
మన సంగీత సమయం
సంగీతం మనస్సును శాంతింపచేస్తుంది, అలాగే మీ కడుపులోని బిడ్డను కూడా. పైగా తల్లి మానసిక వత్తిడిలో ఉంటే తగ్గిస్తుంది కూడా. చాలామంది అనేది ఏంటంటే మీరు మీ బిడ్డకి పరిచయం చేసే సంగీతరకాలే వారికి తర్వాత జీవితంలో నచ్చుతాయి. మీరు బాగా పాడగలిగినా లేకపోయినా ఫర్వాలేదు. అయినా మీకోసం, మీ బిడ్డకోసమేగా పాడుతున్నారు. ఎవరూ అడ్డుకోలేరు కూడా.
మసాజ్ తో ముద్దు చేయండి
మీకు తెలుసా మీ లోపల ఉన్నప్పుడు మీ స్పర్శ కూడా బేబీకి తెలుస్తుందని? అవును, ఆసక్తికర విషయం ఏంటంటే బేబీ తల్లి స్పర్శకి, ఇతరుల స్పర్శకి తేడా తెలుసుకోగలదు. మీరు కూర్చుని విశ్రాంతి తీసుకునేటప్పుడు, కొంత సమయం మీ పొట్టను మెల్లగా రుద్దుతూ ఉండండి. ఇది మీ బేబీకి మీరున్నారనే ధైర్యాన్ని, తనని చాలా బాగా చూసుకుంటున్నారనే ప్రేమను తెలియచేస్తుంది. మీ పాపాయితో సమయం గడపటానికి ఇంతకన్నా గొప్ప విధానం ఉండదు.
ప్రతిసారి తన్నినప్పుడు అక్కడ తట్టి మీ రియాక్షన్ తెలియచేయటం
రెండవ త్రైమాసం నుంచి బేబీలు తల్లి కడుపును తన్నటం మొదలుపెడతారు. కొన్నిసార్లు ఈ తన్నటం ఎంత గట్టిగా ఉంటుందంటే మీ పొట్ట తన్నిన ప్రదేశంలో మిల్లీసెకండ్ పాటు బయటకి పొడుచుకువచ్చి లోపలికి వెళ్తుంది. అంతేకాదు, పాపాయి లోపల బోర్లా పడటం, వెల్లికిలా పడటం కూడా చేస్తూ ఉంటుంది. ఈ తన్నులు, అటు ఇటూ కదలటం ఇవన్నీ మీతో మాట్లాడటానికి బేబీ చేసే ప్రయత్నం. ఉదాహరణకి మీరు ఏదన్నా ఆహారం తిన్నప్పుడు, అది పాపాయికి చాలా రుచికరం అన్పిస్తే, మీకు వెంటనే కదిలి,ఇంకా తినమని తన అభిప్రాయాన్ని తెలియచేస్తుంది. మీరు తను కదిలిన చోట మెల్లగా తట్టి మీ జవాబును తెలియచేయండి.
నాన్న కూడా ఈ ప్రయాణంలో భాగమే
నాన్న కూడా ఈ తొమ్మిది నెలల ప్రయాణంలో భాగస్వామి అయి తీరాలి. బిడ్డని తల్లి, తండ్రి ఇద్దరూ కలిసి పెంచాలి. అందుకని బేబీకి నాన్న కూడా పుట్టకముందే తెలిస్తే, అలవాటయిపోతే చాలా మంచిది. మీ భాగస్వామికి మీ పొట్టలోని పాపాయితో బంధం పెంచుకోమని, దానితో మాట్లాడమని, ముద్దు చేయమని చెప్పండి. ఇద్దరూ సృజనాత్మకంగా మీ పాపాయి ఎలా ఉండబోతోందో ఊహిస్తూ కడుపుపై బొమ్మ కూడా గీయవచ్చు. మీ భాగస్వామి కూడా మీతో కలిసి డెలివరీ తర్వాత సంరక్షణా తరగతులకి హాజరవటం మంచిది.
చిన్నపాటి నడకకి వెళ్తుండండి.
కడుపుతో ఉన్నప్పుడు విశ్రాంతి తప్పనిసరి, కానీ విశ్రాంతిగా కాస్త అటూ ఇటూ నడవడంలో తప్పులేదు. మీకు దగ్గరిలో పార్కుకి వెళ్ళి అక్కడ ప్రకృతిని ఆస్వాదిస్తూ కాసేపు నడవండి. మీరు నడుస్తున్నప్పుడు ఏమేం చూస్తున్నారో అవన్నీ మీ పాపాయికి చెప్తూ, మాట్లాడండి. ఈ విశ్రాంతి నడకలు మెల్లగా వ్యాయామంలా మారుతుంది. ఇది మీ డెలివరీ సమయంలో చాలా ఉపయోగపడుతుంది.
విశ్రాంతిగా స్నానం చేయండి
శరీరాన్ని, మనస్సును విశ్రాంతిగా ఉంచుకోవటం వలన మీ బేబీపై ఎక్కువ శ్రద్ధ పెట్టగలుగుతారు. మంచి స్నానం దీనికి తరుణోపాయం. మీ బాత్ టబ్ ను గోరువెచ్చని నీరుతో నింపండి. మంచి సంగీతం పెట్టుకుని అందులో కాసేపు విశ్రాంతిగా పడుకోండి. ఇది మీ ఒళ్ళునొప్పులు కూడా తగ్గిస్తుంది. మీరు మీ పాపాయి ఈ చిన్న పనివలన హాయిగా ఫీలవుతారు. కానీ నీళ్ళు మరీ వేడిగా ఉండకుండా చూసుకోండి. లేకపోతే బేబీకి హానికరం. అది గోరువెచ్చగా మాత్రమే ఉండాలి.
ప్రెగ్నెన్సీ యోగాతో యాక్టివ్ గా మారండి
యోగాలోని మెల్లమెల్లగా స్ట్రెచెస్ మరియు బ్రీతింగ్ టెక్నిక్స్ కడుపుతో ఉన్నప్పుడు చాలా ఉపయోగపడతాయి. ఈ స్ట్రెచ్ లు మారుతున్న శరీరాన్ని బాగా చూసుకోవటమే కాక, శ్వాసపై నియంత్రణ డెలీవరి సమయంలో ఉపయోగపడతాయి. యోగాకి ఈ మధ్య చాలా ప్రాచుర్యం వచ్చింది, కడుపుతో ఉన్నవారు కూడా నిపుణుడి ఆధ్వర్యంలో సురక్షిత యోగాను ప్రాక్టీసు చేసి దాని లాభాలు పొందవచ్చు. రెండవ త్రైమాసంలో యోగాను మొదలుపెడితేనే మంచిది,అంతకు ముందు వద్దు ఎందుకంటే మీ పాపాయికి సంబంధించి ఏమన్నా సంక్లిష్ట సమస్యలు కలగవచ్చు. యోగా ఒకరకంగా బేబీపై మీ శ్రద్ధ పెరగటానికి సాయపడుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.
Related Articles
సమ్మర్ లో గర్భిణీలు తీసుకోవలసిన జాగ్రత్తలు
గర్భధారణ తొలినాళ్లలో సురక్షితంగా గర్భస్రావం జరిగే మార్గముందా?
ప్రీనేటల్ యోగా వలన కలిగే లాభాలు.
ప్రసవానంతరం మహిళలకు సూచించబడిన చిట్కాలు
సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించే 7 ఆహారపదార్థాలు
ఒక నెల ప్రెగ్నన్సీని అబార్షన్ లేకుండా అవాయిడ్ చేయడమెలా?
గర్భవతుల ఆహార ప్రణాళిక : 9 వ నెలలో నెయ్యి తీసుకోవడం మంచిదేనా ?
గర్భం దాల్చినవారు మొదటి త్రైమాసికంలో నిద్ర పోవడానికి సూచించిన రెండు ముఖ్యమైన పద్దతులు
ప్రెగ్నన్సీ సమయంలో కాకరకాయను తింటే గర్భస్రావం జరుగుతుందా?
పీరియడ్స్ వచ్చిన తరువాత కూడా ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలున్నాయా?
గర్భంపై గ్లైఫోసేట్ దుష్ప్రభావాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోండి!
విటమిన్ సి ప్రెగ్నన్సీని ఎలా ప్రివెంట్ చేస్తుంది?
గర్భం దాల్చిన తరువాత ఎన్ని రోజులకు వాంతులు మొదలవుతాయి?