ఫస్ట్ టైమ్- ఐవీఎఫ్ సక్సెస్ కావాలంటే ఇలా చేయాలి..

Posted By: Bharath Reddy
Subscribe to Boldsky

ప్రతి స్త్రీ మాతృత్వాన్ని ఆస్వాదించాలని కోరుకుంటుంది. పెళ్లయిన దంపతుల్లో సగం కంటే ఎక్కువ మందే సహజ సిద్ధంగా సంతాన భాగ్యాన్ని పొందుతున్నారు. మిగిలిన వారు వెంటనే దానికి నోచుకోకపోవడానికి ఎన్నోకారణాలు ఉండి ఉండవచ్చు. అయితే కొన్ని పద్ధతులు ద్వారా మహిళలకు సంతాన భాగ్యం కలుగుతుంది. అందులో ఒకటి ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) విధానం. ఈ పద్ధతిలో పిల్లను కనాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

chances of ivf working first time

మొదటిసారి ఈ విధానాన్ని అనుసరించాలనుకుంటే వీలైనన్నీ సూచనలు తెలుసుకోవడం మంచిది.అయితే ఈ విధానం సక్సెస్ రేట్ 40 శాతంగా ఉంటుంది. ఇది పలు దశల వారీగా జరిగే ప్రక్రియ. ఈ విధానంలో మహిళ నుంచి అండాన్ని సేకరిస్తారు. దాన్ని ల్యాబ్ లో వీర్యకణంతో ఫలదీకరణ చెందిస్తారు.

ఆ ఫలదీకరణ చెందిన అండాన్ని తీసుకెళ్లి మహిళ గర్భాశయంలో ప్రవేశపెడతారు. మహిళలు మాత్రం ఈ విధానానికి సంసిద్దులు కావడానికి కొన్ని రోజుల ముందు నుంచే చాలా సూచనలు పాటించాలి. ఆహార నియమాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య సూచనలు పాటించాలి. ఆ తర్వాతే ఐవీఎఫ్ ఇంప్లాంటేషన్ కోసం వెళ్లాలి. మరి ఆ జాగ్రత్తలు ఏమిటో మీరూ తెలుసుకోండి.

పిల్లలు కనడానికి IVF పద్దతి చాలా బాధాకరమైనదా?

డిటాక్స్

డిటాక్స్

మీరు ఐవీఎఫ్ విధానానికి సంసిద్దులై ఉంటే మొదట మీ శరీరాన్ని పూర్తిగా డెటాక్స్ చేయాలి. శరీరంలోని మలినాలన్నింటినీ బయటకు పంపించాలి. దీంతో మీ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది ఆటోమేటిక్ గా పెరుగుతుంది. మీరు స్వల్పకాలిక డిటాక్స్ ప్రోగ్రామ్ను అనుసరించాలి. ఇందుకోసం నిపుణుడిని సంప్రదిస్తే చాలా మంచిది. తద్వారా మీరు 3-5 రోజుల్లో బాడీని డిటాక్స్ చేసుకోవొచ్చు. మీరు ఐవీఎఫ్ ట్రీట్ మెంట్ తీసుకోవాలనుకుంటే మొదట చేయాల్సిన పని ఇదే.

మీ డైట్ ను గుర్తుంచుకోండి

మీ డైట్ ను గుర్తుంచుకోండి

ఐవీఎఫ్ విధానం అనుసరిచే ముందు మీరు కనీసం 100 రోజుల ముందు నుంచే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడానికి ప్రణాళిక తయారు చేసుకోవాలి. మీరు మంచి పోషకాహారం తీసుకోవాల్సి ఉంటుది. మీ పునరుత్పత్తి అవయవాలకు కావాల్సిన రక్తం, పోషకాలు అందేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫలదీకరణం విజయం కావాలంటే అలాగే మీ భాగస్వామి కూడాస్పెర్మ్ నాణ్యత పెంచడానికి దోహదం చేసే వాటిని అనుసరించాలి.

ఆక్యుపంక్చర్

ఆక్యుపంక్చర్

ఆక్యుపంక్చర్ విధానం అనేది గర్భాశయానికి రక్తం సరఫరా పెంచడానికి సహాయపడుతుంది. అలాగే అండాశయ పనితీరును మెరుగుపరుస్తుంది ఒత్తిడి స్థాయిలను కూడా తగ్గిస్తుంది. మీరు ఐవీఎఫ్ విధానాన్ని అనుసరించడానికి కనీసం 3-4 నెలల ముందు ఆక్యుపంక్చర్ ను పాటించడం చాలా మేలు. దీని వల్ల సక్సెస్ రేట్ కనీసం 20% పెరుగుతుంది. కానీ మీరు డాక్టర్ ను సంప్రదించకుండా ఆక్యుపంక్చర్ మాత్రం ప్రయత్నించకండి. అలాగే యోగ, మసాజ్ వంటివి కూడా మేలు చేస్తాయి. వాటిని కూడా ప్రయత్నించండి.

అక్కడ ఆనందంగా ఉండండి

అక్కడ ఆనందంగా ఉండండి

మీ దాంపత్య జీవితాన్ని సక్రమంగా సాగించాలి. పడక గది జీవితం కూడా మీపై ప్రభావం చూపుతుంది. అది మీరు చురుకుగా ఉంచేలా చేస్తుంది. ఐవీఎఫ్ విధానాన్ని మీరు అనుసరించడానికి ముందు మీలో ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో ఇది చాలా సహాయపడుతుంది. భావప్రాప్తి సమయంలో విడుదలయ్యే హార్మోన్లు మీ మనస్సును హాయిగా ఉంచుతాయి. ఇలాంటి అనుభూతుల్ని మీరు ఐవీఎఫ్ స్టార్ట్ చేసే రోజూ వరకూ అనుభవించండి.

విటమిన్లు బాగా తీసుకోవాలి

విటమిన్లు బాగా తీసుకోవాలి

మీరు A, C, B, E విటమిన్లతో పాటు ఐరన్, సెలీనియం, మెగ్నీషియం. జింక్ వంటి ఖనిజాలున్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. అలాగే అవసరమైన ఫ్యాటీ యాసిడ్స్, ఫోలిక్ యాసిడ్ ఉన్న ఆహారాలు కూడా తీసుకోవడం చాలా మంచిది. ఇందుకోసం మీరు డాక్టర్ ను సంప్రదిస్తే ఆయన పోషకాలను అందించే ఆహారాలను సూచిస్తారు.

మీ పార్టనర్ కూడా జాగ్రత్తలు పాటించాలి

మీ పార్టనర్ కూడా జాగ్రత్తలు పాటించాలి

మొదట ఇక మీ భాగస్వామి ఒత్తిడి లేకుండా ఉండాలి. సైక్లింగ్, వేడి స్నానాలు, స్టీమింగ్, జాకుజీస్ లకు దూరంగా ఉండాలి.

వృషణాలను వేడెక్కించేది ఏదైనా సరై దూరంగా ఉండాలి. వేడి అనేది వీర్యకణాల్ని గ్గిస్తుంది. అందువల్ల వీర్యకణాలు ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నీరు తాగుతుండాలి. అలాగే మీ భర్త విటమిన్ A, B6,B12,C,E, సెలీనియం, మాంగనీస్, అమైనో ఆమ్లాలు, అనామ్లజనకాలు, జింక్ వంటి పోషకాలు ఉన్న ఆహారాలు తీసుకోవాలి.

ఐవిఎఫ్ ట్రీట్మెంట్ తో గర్భం పొందిన తర్వాత అబార్షన్ జరగకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలు..!

వ్యాయామం

వ్యాయామం

ఐవీఎఫ్ సక్సెస్ కావాలంటే వీరు కచ్చితంగా వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. మీ BMI 20-23 మధ్యలో ఉంటే ఐవీఎఫ్ సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. మీకు వ్యాయామం రెండు విధాలుగా సహాయపడుతుంది. మొదట అది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది అలాగే మీ BMI ని తక్కువ ఉంచేలా చేస్తుంది. మీ ప్రస్తుత బిఎమ్ఐ ఎక్కువగా ఉన్నట్లయితే, మీరు ఆరోగ్యకరమైన BMIకి చేరుకునే వరకు వేచి ఉండడం చాలా అవసరం.

పొగ, మద్యం తాగొద్దు

పొగ, మద్యం తాగొద్దు

స్మోక్ లేదా డ్రింక్ చేయకుండా ఉండాలి. ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ను పెంచుకోవాలనకుంటే మీరు తప్పకుండా పొగ, మద్యం తాగకూడదు. కనీసం 3-6 నెలల ముందుగానే ధూమపానానికి దూరంగా ఉండాలి. అలాగే మీ భాగస్వామి కూడా తన వీర్యకణాల కౌంట్ ను పెంచుకునేందుకు ధూమ, మద్య పానాలకు దూరంగా ఉండాలి.

చివరి రోజు మీరు చేయాల్సింది ఇదే

చివరి రోజు మీరు చేయాల్సింది ఇదే

ఇక మీరు చివరి రోజు కొన్ని సూత్రాలు పాటించాల్సి ఉంటుంది. మీరు ఆ రోజు చారు లేదా రసం వంటి వాటితో కలిపి కాస్త వేడి ఆహారాలు తినాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. మీలో కర్టిసోల్ స్థాయిలను ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. కార్టిసాల్ అనేది ఒత్తిడి హార్మోన్.

ప్రక్రియకు ఎంత కాలంపడుతుంది ?

ప్రక్రియకు ఎంత కాలంపడుతుంది ?

ఐవీఎఫ్ విధానం ఇంప్లాంటేషన్ కోసం 3 రోజులు పట్టవచ్చు. ఇది పూర్తి చేసిన తర్వాత, 2-3 రోజులు విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రక్రియ పూర్తయిన తరువాత మీరు అనుసరించాల్సిన విధానాల గురించి డాక్టర్ వివరిస్తారు. IVF విధానంలో సక్సెక్ రేట్ సాధించడానికి మీరు అన్ని సూచనలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.

English summary

How To Make IVF Successful The First Time

The IVF procedure is surely expensive and therefore, it is better to know how to make it successful in your first attempt itself. Read this!
Story first published: Friday, October 27, 2017, 8:00 [IST]