For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ సర్వికల్ మ్యూకస్ (గర్భాశయ శ్లేష్మం)ఫెర్టిలిటీకి ఎలా సహాయపడుతుంది?

By Lakshmi Perumalla
|

మీ గర్భాశయ శ్లేష్మం ఫెర్టిలిటీకి ఎలా సహాయపడుతుంది? మీరు గర్భం పొందటం కష్టంగా ఉందా? గర్భధారణ పొందే ప్రక్రియలో గర్భాశయ శ్లేష్మం పాత్రను తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే శ్లేష్మం లేకుండా స్పెర్మ్ కణాలు గుడ్లు ఫలదీకరణం జరగదు.

ఎందుకు అని ఆలోచిస్తున్నారా? స్పెర్మ్ మరియు గుడ్డు గర్భాశయాన్ని చేరుకోవటానికి గర్భాశయ శ్లేష్మం సహాయపడుతుంది. గర్భాశయ శ్లేష్మం కూడా మీ సంతానోత్పత్తి స్థాయిలు మరియు అండోత్సర్గము చక్రాలను కూడా నిర్ణయించగలదు.

అలర్ట్: కాఫీ తాగితే పిల్లలు పుట్టే అవకాశం లేదా!?అలర్ట్: కాఫీ తాగితే పిల్లలు పుట్టే అవకాశం లేదా!?

ఇక్కడ మీ గర్భాశయ శ్లేష్మం సారవంతం చేయడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.

నీరు త్రాగండి : ఫెర్టిలిటీకి నీటికి సంబంధం ఏమిటి?

నీరు త్రాగండి : ఫెర్టిలిటీకి నీటికి సంబంధం ఏమిటి?

గర్భాశయ శ్లేష్మం నీటిలో ఉంటుంది. కాబట్టి ప్రధానంగా నిర్జలీకరణ ఒక పెద్ద సమస్యగా ఉంటుంది. మీరు నీటిని సరిగ్గా త్రాగకపోతే గర్భాశయం పొడిగా మారవచ్చు. ద్రవాలు సరిగా లేకపోతే స్పెర్మ్ కణాలు, గుడ్డు గర్భాశయంలోకి చేరటానికి కష్టం అవుతుంది.

వెల్లుల్లిని తినండి

వెల్లుల్లిని తినండి

వెల్లుల్లి గర్భాశయ శ్లేష్మం పలుచగా ఉండేలా చేస్తుంది. వెల్లుల్లిలో జింక్, సోడియం, పొటాషియం, భాస్వరం, మాంగనీస్, మెగ్నీషియం, ఇనుము, కాల్షియం, విటమిన్ సి, ఫోలేట్, విటమిన్ B1, B2, B3 మరియు విటమిన్ B6 ఉంటాయి. ఈ పోషకాలు గుడ్డు యొక్క ఆరోగ్యాన్ని కూడా పెంచుతాయి.

ఆకుకూరలు తినండి

ఆకుకూరలు తినండి

ఆకుకూరలు చాలా ముఖ్యమైనవి. గర్భాశయ శ్లేష్మం మరియు స్పెర్మ్ కి మంచి ఆల్కలైన్ గా ఉంటాయి.

ఈవినింగ్ ప్రింరోజ్ ఆయిల్ ని ట్రై చేయండి

ఈవినింగ్ ప్రింరోజ్ ఆయిల్ ని ట్రై చేయండి

ఈ నూనె మీ హార్మోన్లు, గర్భాశయ ఆరోగ్యాన్ని క్రమబద్దీకరించవచ్చు. అలాగే శ్లేష్మం ఉత్పత్తిలో శరీరానికి సహాయపడుతుంది. ఈవినింగ్ ప్రింరోజ్ ఆయిల్ లో మంటను తగ్గించే పోషకాలు ఉంటాయి. అలాగే, ఈ నూనె స్పెర్మ్ కణాల కదలికకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించగలదు. డాక్టర్ సలహాతో ప్రతి రోజు ఈ నూనెను 1200 mg తీసుకుంటే మంచిది.

దగ్గు సిరప్ ట్రై చేయండి

దగ్గు సిరప్ ట్రై చేయండి

సాధారణంగా దగ్గు సిరప్ శ్లేష్మాన్ని తగ్గిస్తుంది. కానీ ఇక్కడ గర్భాశయ శ్లేష్మమునకు బాగా పనిచేస్తుంది. దగ్గు సిరప్ లో ఉండే గుయిఎఫెనెసిన్ మిశ్రమం గర్భాశయ ద్రవాలను పలుచన చేస్తుంది. అయితే దగ్గు సిరప్ ఎక్కువగా వాడకూడదు.

వాస్తవానికి, ఒక రోజు (అండోత్సర్గపు మరుసటి రోజు)మాత్రమే వాడటం మంచిది. దగ్గు సిరప్ త్రాగిన తరవాత ఎక్కువగా నీటిని త్రాగాలి.

సంతానోత్పత్తిని పెంచడానికి సహజ మార్గాలు..!సంతానోత్పత్తిని పెంచడానికి సహజ మార్గాలు..!

హెచ్చరిక

దగ్గు సిరప్ వాడే ముందు డాక్టర్ ని సంప్రదించాలి. మీకు కాలేయ సమస్యలు లేదా ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం దగ్గు సిరప్ కి దూరంగా ఉండాలి.

గ్రీన్ టీ త్రాగటం

గ్రీన్ టీ త్రాగటం

కొన్ని అధ్యయనాలు మగ మరియు ఆడ ఇద్దరిలోను సంతానోత్పత్తి స్థాయిలను పెంచటానికి గ్రీన్ టీ మంచిదని తెలుపుతున్నాయి. గ్రీన్ టీ లో కాటెచిన్స్, ఫ్లావానాయిడ్స్, పోలిఫెనోల్స్ మరియు హైపాక్సాన్టిన్ సమృద్ధిగా ఉన్నాయి. అంతేకాకుండా, గ్రీన్ టీలో టీ థెనైన్, జింక్ మరియు మాంగనీస్ ఉండుట వలన ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది. అయితే రోజుకి ఒక కప్పు మాత్రమే త్రాగాలి.

English summary

How To Make Your Cervical Mucus More Fertile

Cervical mucus can also decide your fertility levels and ovulation cycles. Here are some ways to make your cervical mucus fertile.
Desktop Bottom Promotion