సాల్ట్ ఫుడ్స్ ను ఇష్టపడితే మగపిల్లాడు పుడతాడు! మరికొన్ని అపోహలు,అవాస్తవాలు పటాపంచలు

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

మీరు గనుక గర్భం దాల్చిన స్త్రీ అయితే లేదా గర్భం దాల్చాలనుకుంటే శృంగారం, అప్పుడు చేయవలసిన పనులు మరియు అందువల్ల ఎదురయ్యే క్లిష్టపరిస్థితుల గురించి ఎంతో ఆతురత చెందుతారు. భారతదేశంలో ఈ విషయానికి సంబంధించి ఎన్నో కల్పితాలు ప్రచారంలో ఉన్నాయి. కానీ, అవన్నీ అవాస్తవాలు. చాలా మంది నమ్ముతున్న నమ్మకాల వెనుక ఉన్న అసలైన నిజాలు ఇప్పుడు తెలుసుకోండి.

మగబిడ్డ జన్మించాలంటే ఈ ఆహారాలు రెగ్యులర్ తినండి

గర్భధారణ సమయంలో కొన్ని సాధారణ విషయాలు గురించి మీరు వింటుంటారు. వాటిని పాటించే ప్రయత్నం కూడా చేస్తుంటారు. వేటిని మీరు నమ్మకూడదో ఇప్పుడు తెలుసుకోండి.

1. కల్పితం(అపోహ) :

1. కల్పితం(అపోహ) :

పొట్ట యొక్క ఆకారం. ఒక స్త్రీ పొట్ట గనుక గర్భం వచ్చిన సమయంలో మరీ ఎక్కువగా ఉబ్బిపోయి ఉంటే అమ్మాయి పుడుతుందని మరియు ఒకవేళ ఆ ఉబ్బడం తక్కువ గనుక ఉంటే అబ్బాయి అని అంటుంటారు.

నిజం(వాస్తవం):

నిజం(వాస్తవం):

లోపల పెరుగుతున్న బిడ్డ యొక్క కండరాల పరిమాణం, నిర్మాణం మరియు ఆ బిడ్డ యొక్క స్థానాన్ని బట్టి పొట్ట యొక్క ఆకారం మరియు పరిమాణం మారుతుంది. పైన చెప్పబడిన ఊహగానానికి, ఎటువంటి బిడ్డ పుడతాడు అనే విషయానికి సంబంధించి ఎటువంటి శాస్త్రీయ ఆధారంలేదు.

2. కల్పితం :

2. కల్పితం :

మీరు గనుక ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని కావాలనుకుంటే బాబు పుడతాడని మరియు మీరు తియ్యటి పదార్ధాలను ఎక్కువగా కోరుకుంటే అమ్మాయి పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతుంటారు.

నిజం :

నిజం :

మీరు ఇలా రకరకాల ఆహారాన్ని కోరడానికి, మీ కడుపులో పెరిగే పిండం ఎవరై ఉంటారు అనే విషయానికి ఎటువంటి సంబంధం లేదని పరిశోధనలు చెబుతున్నాయి.

3. కల్పితం :

3. కల్పితం :

మీరు ఒక తీగను ఒక ఉంగరానికి చుట్టి మీ పొట్ట పై ముందుకి వెనకకు అనుకుంటే అబ్బాయి పుడతాడని, వృత్తాకారంలో గనుక అంటే అమ్మాయి పుడుతుందని చాలా మంది నమ్ముతుంటారు.

నిజం :

నిజం :

ఇలాంటిది అసలు ఏమి లేదు, అసలు ఇటువంటి పనులు చేయడం చాలా హాస్యాస్పదం. మీరు నవ్వుకోవాలనుకుంటే ఇలాంటి పనులు చేసుకోవచ్చు. వీటిల్లో ఎటువంటి నిజం లేదు.

గర్భిణీ పొట్టలో మగ లేదా ఆడశిశువో తెలిపే లక్షణాలు

4. కల్పితం :

4. కల్పితం :

మీ అమ్మకు గనుక ప్రసవం చాలా సులభంగా అయ్యి ఉంటే మీకు కూడా అలానే జరుగుతుందట .

నిజం:

నిజం:

వంశపారంపర్యంగా మీకు సంక్రమించే కొన్ని లక్షణాలకు, మీరు గర్భం దాల్చిన తర్వాత ప్రసవ సమయంలో మీరు ఎదుర్కోబోయే అనుభవాలకు ఎటువంటి సంబంధం ఉండదు. బిడ్డ యొక్క ఆకారం, స్థానం మరియు మీరు తీసుకొనే సమతుల్యమైన ఆహారం మరియు మీరు అనుసరించే జీవిన విధానం పై మాత్రమే మీ ప్రసవం ఎలా జరుగుతుంది అనేది ఆధారపడి ఉంటుంది.

5.కల్పితం :

5.కల్పితం :

మీ వెనుక భాగాన్ని వాల్చి పడుకుంటే అది మీ బిడ్డకు హాని చేస్తుంది.

నిజం :

నిజం :

మీరు పడుకొనే సమయంలో ఎడమ వైపుకు తిరిగి పడుకుంటే మీ గర్భాశయానికి మరియు అండాశయానికి రక్తప్రసరణ పెరుగుతుందని వైద్యులు సలహా ఇస్తుంటారు. కానీ, మీ వెనుక భాగాన్ని వాల్చి పడుకోవడం ద్వారా కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఎటువంటి హాని జరగదు.

6. కల్పితం :

6. కల్పితం :

శృంగారం చేస్తే మీ బిడ్డకు హాని కలుగుతుంది.

నిజం :

నిజం :

మీ బిడ్డను ఏడు పొరల చర్మం సంరక్షిస్తుంది. మీ గర్భాశయ చివరి భాగం కొద్దిగా పొడవై గట్టిపడటం వల్ల మీ గర్భసంచి ఎటువంటి ఒత్తిడికి గురికాదు మరియు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంటుంది. అందువల్ల గర్భం దాల్చిన సమయం లో శృంగారం చేసినా అది పెరుగుతున్న బిడ్డ పై ఎటువంటి ప్రభావం చూపదు మరియు హాని కూడా జరగదు.

English summary

If You Crave Salty Food, Its A Boy! Six Common Pregnancy Myths Busted

Here are some common things you hear and try during pregnancy. Know what to believe.
Subscribe Newsletter