తల్లి, బిడ్డకు చనుబాలు ఇవ్వకపోతే ఆ పాలు ఏమవుతాయి?

Posted By: Gandiva Prasad Naraparaju
Subscribe to Boldsky

మీరు చనుబాలు ఇవ్వకపోతే ఆ పాలు ఏమవుతాయి? దీని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కొంతమంది తల్లులు చనుబాలు ఇస్తుంటే, మరికొంతమంది వేరే పద్ధతులను ఎంచుకుంటున్నారు. కాబట్టి, మీరు చనుబాలు ఇవ్వకపోతే మీ పాలు ఏమవుతాయి?

మీకు చనుబాలు ఇవ్వకపోతే, పాల ఉత్పత్తి త్వరగా తగ్గిపోయి, చివరికి పాలు అసలు పడకుండ ఉండే పరిస్ధితి సంభవిస్తుంది!

బిడ్డకు పాలిస్తున్న సమయంలో వక్షోజాలకు ఏం జరుగుతుంది

ప్రసవం అయిన, తొలి రోజుల్లో, పాలు కారడం సహజం. రొమ్ము గడ్డకట్టడ౦ కూడా సంభవించవచ్చు. కానీ చనుబాలు ఇవ్వకపోతే, పాలు పడడం క్రమంగా ఆగిపోతుంది.

దీనికి ఎంత సమయం పడుతుంది?

దీనికి ఎంత సమయం పడుతుంది?

6-7 రోజులలో, పాల ఉత్పత్తి జీరోకి చేరుతుంది! కాబట్టి, మీరు చనుబాలు ఇవ్వకపోతే ఆ పాలు ఏమవుతాయి? దీని ఉత్పత్తి నిలిచిపోతుంది!

దీనికి గల కారణాలు ఏమిటి?

దీనికి గల కారణాలు ఏమిటి?

పాల ఉత్పత్తి మొత్తం బిడ్డ అవసరం మీద ఆధారపడి ఉంటుంది. బిడ్డ పాలు ఎక్కువగా తాగితే, పాలు బాగా పడతాయి. బిడ్డ పాలు తాగకపోతే, పాలు పడడం ఆగిపోతాయి.

రొమ్ము వాపును తగ్గించడానికి ఏమి చేయాలి?

రొమ్ము వాపును తగ్గించడానికి ఏమి చేయాలి?

చనుబాలు ఇవ్వడం ఇష్టంలేని తల్లులు వాటికి సహాయంగా గట్టిగా పట్టి ఉండే బ్రా లను వాడితే రొమ్ము వాపు తగ్గుతుంది.

శిశువుకు పాలుపట్టించడానికి సులభ చిట్కాలు

ఆ పాలు ఎందుకు కనిపించవు?

ఆ పాలు ఎందుకు కనిపించవు?

చనుబాలు ఇవ్వకపోతే, శరీరం ఆ పాలను తిరిగి పీల్చుకుంటుంది, ఉత్పత్తిని నిలిపి వేస్తుంది. కాబట్టి ఆ పాలు ఎక్కడికీ పోవు. అవి కేవలం ఆవిరైపోతాయి.

దీనివల్ల; ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా?

దీనివల్ల; ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా?

కొంతమంది స్త్రీలలో దీనివల్ల రొమ్ములో నొప్పి, నాళాలు అడ్డుపడడం, స్తనాలు గట్టిపడడం వంటివి జరుగుతాయి.

ఏమి చేయాలి?

ఏమి చేయాలి?

మీ నిర్ణయం గురించి డాక్టరుతో మాట్లాడాలి. మీరు చనుబాలు ఇవ్వడం ఇష్టం లేకపోతే దాన్ని నివారించడానికి లేదా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండడానికి వైద్యుని సహాయం తీసుకోవచ్చు.

English summary

If You Don't Breastfeed What Happens To The Milk?

If you don't breastfeed what happens to the milk? Have you ever wondered about this? Some mothers choose to breastfeed whereas some choose other options.
Story first published: Saturday, September 9, 2017, 9:00 [IST]