కడుపుతో ఉన్నవారు అల్లం టీ తాగటం సురక్షితమేనా?

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

కడుపుతో ఉన్నప్పుడు అల్లం టీ తాగటం సురక్షితమా కాదా అని ఆలోచిస్తున్నారా, మీ టెన్షన్ ను మేము ఈరోజు దూరం చేస్తాం. కడుపుతో ఉన్నప్పుడు అల్లం టీ తాగడం మంచిదే. గర్భవతిగా ఉన్నసమయంలో అల్లం లాభాలు చాలా ఉంటాయి.

Is It Safe For Pregnant Women To Drink Ginger Tea?

మొదటి మూడు నెలల్లో పొద్దున్నే వచ్చే వికారాన్ని తగ్గిస్తుంది. సర్వేల ప్రకారం చాలామంది స్త్రీలు హెర్బల్ మందులను, ఉత్పత్తులను వాడతారు. వాటిల్లో అల్లం కూడా ఉంటుంది. కానీ అతిగా వాడవద్దు. అల్లాన్ని రోజుకి 1 గ్రాము మాత్రమే తీసుకోండి, ముఖ్యంగా వైద్యుడిని అడగండి.....

Is It Safe For Pregnant Women To Drink Ginger Tea?

1. మీ నీటిశాతాన్ని తగ్గనివ్వదు

కడుపుతో ఉన్నప్పుడు చిరాకు తెప్పించే విషయం పదేపదే బాత్రూంకి వెళ్ళి రావాల్సి రావటం. మీరు ఇన్నిసార్లు బాత్రూంకి వెళ్ళటం వలన మీరు తెలుసుకోవాల్సింది అంతే మొత్తంగా మీ శరీరంలో నీటిశాతం కూడా నిలుపుకోవాలని. మీరు కెఫీన్ ఉన్న కాఫీ టీలు, చక్కెర ఎక్కువున్న సోడాలకి దూరంగా ఉండాలి. మీరు రోజుకి 2 కప్పుల కాఫీ లేదా టీ తాగవచ్చు ఎందుకంటే కెఫీన్ మీ రక్తపోటును పెంచి గుండె వేగంపై ప్రభావం చూపి, మీ బిడ్డ నిద్రాసమయాలను మార్చేస్తుంది.

ఈ సమస్యను మీరు అల్లం టీ లాంటి హెర్బల్ టీ తాగి దూరం చేసుకోవచ్చు. కొంచెం తేనె, నిమ్మరసాన్ని జతచేయండి చాలు,మీ రోజు శాంతిగా మారిపోతుంది. కానీ తేనె పరిమాణం చాలా తక్కువగా ఉండేట్లు చూసుకోండి. కడుపుతో ఉన్నప్పుడు ఎక్కువ చక్కెర పదార్థాలు తింటే మధుమేహానికి దారితీయవచ్చు.అల్లం టీలో తక్కువ కేలరీలు కూడా ఉంటాయి. అల్లంలో అవసరమైన పోషకాలైన విటమిన్ బి6 మరియు సి మరియు మెగ్నీషియం ఉండటం వలన, అల్లంటీలో కూడా ఈ పోషకాలన్నీ కొంచెం మొత్తంలో ఉంటాయి.

Is It Safe For Pregnant Women To Drink Ginger Tea?

2. వికారాన్ని తగ్గిస్తుంది

కడుపుతో ఉన్నప్పుడు అల్లం టీ తాగితే వికారం తగ్గుతుంది

కడుపుతో ఉన్నప్పుడు వికారాలు వాంతులు (ఎన్ విపి) లేదా పొద్దున్నే వికారం గర్భం దాల్చిన మొదటి రోజుల్లో సాధారణం. హ్యూమన్ కోరియానికి గొనాడోట్రోపిన్ (హెచ్ సిజి) హార్మోన్ స్థాయి పెరగటం వలన ఇలా జరుగుతుంది. నిజానికి 50 నుంచి 90 శాతం వరకూ గర్భవతులకి వాంతులు ఉన్నాలేకపోయినా వికారంగా మాత్రం ఉంటుంది. వాస్తవం ఏంటంటే ; పొద్దున్నే వికారం ఆరోగ్యకరమైన గర్భాన్ని సూచిస్తుంది. కానీ మీకు అలసటగా కూడా ఉంటుంది. ఉపశమనం కోసం ఏం చేయాలి? అల్లం టీ తాగండి.

సంప్రదాయకమైన చైనీస్ వైద్యం మరియు ఆయుర్వేదం ప్రకారం అల్లానికి వికారాన్ని తగ్గించే లక్షణం ఉంటుంది. ఇందులో ఉండే జింజెరోల్స్ అనే రసాయనాల వలన ఇలా జరుగుతుంది. ఇవి జింజెరోన్స్ గా తర్వాత వేడి చేయగానే షోగోవోల్స్ గా మారతాయి.అవి వికారం వాంతులనే కాక విరేచనాలను కూడా తగ్గిస్తుంది. నాడీ వ్యవస్థపై పనిచేసే మందుల లాగా కాకుండా, అల్లం నేరుగా పొట్టపై పనిచేసి జీర్ణక్రియలో సాయపడుతుంది.

విటమిన్ బి6 ను గర్భంతో వచ్చే వికారాన్ని తగ్గించటానికి వాడతారు. కానీ అల్లం కూడా అంత ప్రభావవంతమైనదే. అందుకని మీరు ఒక రుచికర ప్రత్యామ్నాయంకై చూస్తూ ఉంటే అల్లం టీ మీకు మంచిది.

Is It Safe For Pregnant Women To Drink Ginger Tea?

3. సులువుగా జీర్ణం చేస్తుంది

కడుపుతో ఉన్నవారి మరో సమస్య అజీర్తి లేదా మెల్లగా అరగటం. మొదటి మూడు నెలల్లో, గర్భస్థ హార్మోన్లు జీర్ణక్రియ వేగాన్ని మందగించేలా చేస్తాయి. అవి పొట్టలోకి తెరుచుకునే ఆహారనాళపు ద్వారాన్ని మరింత వదులు చేసేస్తాయి. అందువల్ల ఆహారం ఊరికే తిరిగి పొట్టలోంచి వెనక్కు ఆహారనాళంలోకి వస్తూ ఉంటుంది. దానివల్లనే యాసిడ్ మంటగా అన్పిస్తుంది. ఆఖరి నెలల్లో,పిండం పరిమాణం పెరిగి, గర్భాశయం జీర్ణాశయ గోడలపై వత్తిడి కలిగిస్తుంది. ఇది కూడా యాసిడ్ ను వెనక్కి ఆహారనాళంలోకి తన్ని, మీకు ఉబ్బరంగా అన్పిస్తుంది. ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలలో మార్పులు కూడా ఈ అసౌకర్యాలకి దారితీయవచ్చు.

అల్లం టీ మిమ్మల్ని కాపాడుతుంది. ఇది లాలాజలం, జీర్ణరసాలు ఎక్కువ స్రవించబడేలా ప్రేరణనిచ్చి, ఆహారాన్ని బాగా కదుపుతాయి. అది జీర్ణక్రియ మొత్తం వేగాన్ని కూడా పెంచుతుంది.

Is It Safe For Pregnant Women To Drink Ginger Tea?

4 కప్పుల కన్నా రోజుకి ఎక్కువగా తాగకండి

కడుపుతో ఉన్నప్పుడు అల్లం టీ సురక్షితమైన రోజుకి 1 గ్రాము అల్లం కన్నా ఎక్కువ తీసుకోకండి.

1 గ్రాము అల్లాన్ని మరిగే నీళ్ళలో వేసి కొద్దినిమిషాలు మరగనివ్వండి. 4 కప్పులకి సరిపోయేలా మరగనివ్వండి. ఈ కప్పులను రోజు మొత్తంలో వివిధ సమయాలలో తాగండి. కానీ మీ వైద్యుని సంప్రదించి, చిరాకుగా అన్పించినప్పుడే తాగటం మంచిది.

రక్తహీనత, రక్తపోటు, మధుమేహం, గాల్ స్టోన్స్ ఉంటే,సి సెక్షన్ వంటి ఆపరేషన్ దగ్గర్లో ఉంటే,ఇలా దేని వల్ల అయినా మందులు వాడుతున్నట్లయితే అల్లం టీ తాగవద్దు. అందుకని బిడ్డ పుట్టే సమయం దగ్గరపడుతున్నప్పుడు అల్లం తీసుకోవద్దు.

English summary

Is It Safe For Pregnant Women To Drink Ginger Tea?

Surveys show that a lot of women take herbal medicine products, including ginger, during their pregnancy.1 Just be careful not to overdo it. Limit your consumption to 1 gm ginger a day, and always ask your doctor first.
Story first published: Wednesday, December 6, 2017, 10:45 [IST]