For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలు ఆల్ట్రాసౌండ్ స్కాన్ లు ఎక్కువ చేయించుకోవడం ప్రమాదమా?

By Lakshmi Bai Praharaju
|

అల్ట్రాసౌండ్ ప్రమాదమా? అల్ట్రాసౌండ్ పిండానికి సురక్షితమేనా? గర్భధారణ సమయంలో, మీరు మీరు ప్రతిదీ ఖచ్చితంగా ఉంది అని నిర్ధారించుకోవడానికి రక్త పరీక్షకి, సాధారణ చెకప్, అల్ట్రాసౌండ్ స్కాన్ లకి వెళ్తుంటారు.

గర్భధారణ సమయంలో అల్ట్రాసౌండ్ స్కాన్ ఉపయోగాలుగర్భధారణ సమయంలో అల్ట్రాసౌండ్ స్కాన్ ఉపయోగాలు

మొదటి మూడు నెలలో, పిండం ఆరోగ్యాన్ని తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. కానీ గర్భధారణ సమయంలో అల్ట్రాసౌండ్ స్కాన్ సురక్షితమేనా? అయితే, ఆ స్కాన్ మీకు సురక్షితం కాకపోతే మీ డాక్టర్ మిమ్మల్ని స్కాన్ కు అనుమతించరు.

కానీ ఎక్కువ స్కాన్ లు సురక్షితం కావు ఎందుకు? ఎక్కువ అంటే ఎంత? మీకు కనక ఇటువంటి అనుమానాలు ఉంటే, ఇది చదవండి...

కడుపులోని బిడ్డకు స్కానింగ్ వల్ల కలిగే డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్కడుపులోని బిడ్డకు స్కానింగ్ వల్ల కలిగే డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్

అల్ట్రాసౌండ్ పిండానికి సురక్షితమేనా?

అల్ట్రాసౌండ్ పిండానికి సురక్షితమేనా?

గర్భధారణ సమయంలో అల్ట్రాసౌండ్ బిడ్డకి లేదా తల్లికి ప్రమాదమని ఎటువంటి నిరూపణా లేదు.

అల్ట్రాసౌండ్ అంటే ఏమిటి?

అల్ట్రాసౌండ్ అంటే ఏమిటి?

అధిక పునఃపున్యం కలిగిన ధ్వని తరంగాలను ఉపయోగించడం మాత్రమే అంతకంటే ఏమీ లేదు. ఈ తరంగాలు పిండం పెరుగుదలను, అభివృద్ధిని కనుగొనడానికి సహాయపడతాయి.

ఎంతవరకు ఈ స్కాన్ లు సహాయపడతాయి?

ఎంతవరకు ఈ స్కాన్ లు సహాయపడతాయి?

ఈ స్కాన్ లు అండాశయం, అమ్నియోటిక్ ద్రవం, మాయలో ఏదైనా అసాధారణతను గుర్తించడంలో సహాయపడుతుంది.

ఇది ఎందుకు సురక్షితం?

ఇది ఎందుకు సురక్షితం?

అల్ట్రాసౌండ్ స్కాన్ హానికరమైన రేడియేషన్ ని కలిగి ఉండదు అందుకని గర్భధారణ సమయంలో ఇది ప్రమాదకరం కాదు. ఇది ఎక్సరే లేదా సిటి స్కాన్ కి భిన్నమైనది.

దీనివల్ల పుట్టుకలో లోపాలు ఉంటాయా?

దీనివల్ల పుట్టుకలో లోపాలు ఉంటాయా?

ఉండదు. అల్ట్రాసౌండ్ స్కాన్ వల్ల పుట్టుక లోపాలు, క్యాన్సర్ లేదా పిండంలో ఏవైనా ఇతర అభివృద్ది విషయంలో ఎటువంటి ప్రభావం ఉండదని ప్రస్తుత అధ్యయనాలు చెప్తున్నాయి.

వీటిని ఎక్కువగా ఉపయోగిస్తే?

వీటిని ఎక్కువగా ఉపయోగిస్తే?

అధిక ప్రమాదంతో కూడిన గర్భాలకు ఎక్కువ స్కానింగ్ లు అవసరం. అధిక బిపి లేదా మధుమేహం ఉన్న తల్లుల్లో పిండం పరిస్ధితిని తరచుగా పరిశీలించడానికి అధిక స్కాన్ లు అవసరం.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

ఏదైనా అధిక౦గా తీసుకోవడం మంచిది కాదు, ఇదే అల్ట్రాసౌండ్ స్కాన్ లకు కూడా వర్తిస్తుంది. దీనివల్ల వచ్చే వేడితో సమస్య ఉంటుంది.

ఈ స్కాన్ లు ఎముకలు, అంతర్గత వాతావరణంలోని ఉష్ణోగ్రతను పెంచుతాయి. ఇది అంత ప్రమాదకరం కాదు, మోడరేషన్ టెక్నాలజీని ఉపయోగించడం మంచిదని ప్రస్తుత అధ్యయనాలు చెప్తున్నాయి.

English summary

Are Too Many Ultrasound Scans Harmful?

During the first trimester, ultrasound scans are done mainly to evaluate the health of the foetus. But is ultrasound scan safe in pregnancy? Of course, your doctor won't allow you to go for a scan if it isn't safe.
Desktop Bottom Promotion