గర్భ నిరోధక మాత్రల గురించి ప్రతి మహిళా తెలుసుకోవాల్సిన విషయాలు....

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

శృంగారం చేసే సమయంలో చాలా మంది గర్భం దాల్చకుండా ఉండటానికి కండోమ్స్ ని వాడుతుంటారు.ఒక్కొక సారి సంభోగం చేసే సమయం లో కండోమ్స్ చిరిగిపోవచ్చు,కొన్ని సార్లు గర్భం దాల్చకూడదు అనుకుంటారు కానీ ప్రమాదవశాత్తు సంభోగించేటప్పుడు వీర్యం యోనిలోకి ప్రవేశించి ఉండొచ్చు,మరికొన్ని సార్లు శృంగారంలో పాల్గొనేటప్పుడు పూర్తి సుఖాన్ని,ఆనందాన్ని పొందాలనే ఉద్దేశంతో కండోమ్స్ ని ఉపయోగించకుండానే శృంగారం లో పాల్గొంటుంటారు.

గర్భ నిరోధక మాత్రల గురించి ప్రతి మహిళా తెలుసుకోవాల్సిన విషయాలు....

పైన చెప్పిన వివిధ సందర్భాలలో జరిగిన సంఘటన ల వల్ల గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువ. ఇలా అసందర్భ గర్భాన్ని నిరోధించాటానికి చాలా మంది ఈ మధ్య కాలంలో టీవీ లలో వచ్చే వాణిజ్య ప్రకటనలకు ఆకర్షితులై ఐపిల్స్ లాంటి గర్భ నిరోధక మాత్రలను ఎక్కువగా వాడుతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే వీటిని వాడటానికి ముందు కొన్ని విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి...

శృంగారం జరిపిన ఎంత సేపటి లోపు గర్భ నిరోధక మాత్రలు వేసుకోవాలి:

శృంగారం జరిపిన ఎంత సేపటి లోపు గర్భ నిరోధక మాత్రలు వేసుకోవాలి:

గర్భ నిరోధక మాత్రలను శృంగారం జరిపిన 72 గంటల లోపు వేసుకోవాలని ఆ టాబ్లెట్ కవర్ పై రాసి ఉంటుంది.సమయం పెరిగేకొద్దీ గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువని కాబట్టి, సంభోగం జరిపిన 24 గంటలు లేదా 12 గంటల లోపు మాత్రను వేసుకుంటే మంచిదని,వెంటనే వేసుకుంటే మరీ మంచిదని ,అప్పుడు గర్భాన్ని రాకుండా నిరోధించే అవకాశాలు ఎక్కువ గా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

ఈ మాత్రలు వేసుకున్న తరువాత రుతుక్రమంలో లో ఏమైనా మార్పులు జరుగుతాయా?

ఈ మాత్రలు వేసుకున్న తరువాత రుతుక్రమంలో లో ఏమైనా మార్పులు జరుగుతాయా?

ఈ మాత్రలు వేసుకున్న మహిళలకు రుతుక్రమం కొద్దిగా మార్పుకి లోనయ్యే అవకాశం ఉంది. హార్మోన్లు సమతుల్యత కొద్దిగా దెబ్బ తినడం మూలంగా ,మాములుగా వచ్చే నెలసరి ఒక వారం ముందు రావచ్చు లేదా ఒక వారం ఆలస్యం కావొచ్చు.ఒక వేళ నెలసరి మాములుగా వచ్చే రోజు కంటే ,వారం దాటినా రాకపోతే వైద్యున్ని కలిసి గర్భ నిర్ధారణ పరీక్ష చేయిచుకోవటం మంచిది.

ఈ మాత్రలను ఎవరు వాడొచ్చు ? ఎవరు వాడకూడదు?

ఈ మాత్రలను ఎవరు వాడొచ్చు ? ఎవరు వాడకూడదు?

అత్యవసర సమయాల్లో మాత్రమే ఈ మాత్రలను వాడాలని వైద్యులు సూచిస్తున్నారు.ఇవి గర్భం రాకుండా ఉపయోగపడతాయి కానీ గర్భం దాల్చిన వాళ్లకు ఇవి పనిచేయవు.వీటిని నెలకు రెండు సార్లకు మించి వాడకూడదు.ఆలా గనుక వాడితే అనారోగ్య సమస్యలు తలెత్తి,ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.25 నుండి 45 సంవత్సరాల వయస్సు గల మహిళలు వీటిని వాడితే దుష్ప్రభావాలు కలిగే అవకాశం తక్కువ.యుక్త వయస్సు లో ఉన్న స్త్రీలు ఈ మాత్రలను వాడితే వాళ్ళ గర్భ సంచితో పాటు,పునరుత్పత్తి వ్యవస్థ దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.

ఎలా వీటిని వేసుకోవాలి?

ఎలా వీటిని వేసుకోవాలి?

ఏదైనా ఆహరం తిన్న తరువాత మాత్రమే ఈ మాత్రను వేసుకోవాలి.గర్భం రాకుండా నిరోధించటంలో గర్భనిరోధక మాత్రలు వందకు వంద శాతం సఫలీకృతమవుతాయ అంటే చెప్పడం కష్టం.95 శాతం ఈ మాత్రలు వేసుకున్న వారికి మంచి ఫలితాలు వచ్చాయి.ఇవి గర్భం రాకుండా ఆపగలవు కానీ సుఖ వ్యాధులు భారి నుండి కాపాడలేవు.

మన శరీరానికి పడకపోతే కలిగే దుష్ప్రభావాలు?

మన శరీరానికి పడకపోతే కలిగే దుష్ప్రభావాలు?

ఇవి కొంత మందికి పడొచ్చు, పడక పోవచ్చు.అది ఆయా వ్యక్తుల శరీరతత్త్వం పై ఆధారపడి ఉంటుంది.ఒక వేళ మాత్ర ఎవరికైనా పడకపోతే తలనొప్పి,నెలసరి సరిగ్గా రాకపోవడం,పొత్తి కడుపులో నొప్పి,వాంతులు లాంటి దుష్ప్రభావాలు వాటిల్లే ప్రమాదం ఉంది.కాబట్టి వైద్యుల సూచన మేరకు వీటిని వేసుకుంటే మంచిది .

అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే గర్భ నిరోధక మాత్రలను వాడాలి

అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే గర్భ నిరోధక మాత్రలను వాడాలి

శృంగారాన్ని జీవిత భాగస్వామితో ఆనందించండి,అసురక్షిత శృంగార కార్యకలాపాల్లో పాల్గొనకండి,సురక్షిత సంభోగం చేయండి,అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే గర్భ నిరోధక మాత్రలను వాడండి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

English summary

Must Things Woman Sholud know about ipill

In India I pill is not the name of an emergency contraceptive pill rather it is the base of ‘Sex Revolution’ among teenagers and youth. It may be a little shocking to read about but it’s a truth. Indian youth started exploring it’s sexuality to the optimum level after the emergence of pills like I pill & Unwa
Story first published: Tuesday, August 29, 2017, 15:17 [IST]
Subscribe Newsletter