గర్భిణీలు సెక్స్ లో పాల్గొనడంపై అపోహలు..వాస్తవాలు..?

Posted By:
Subscribe to Boldsky

గర్భవతిగా ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొనటం గురించి అనేక సాధారణ,హాస్యాస్పద అపోహలు మీరు వినే ఉంటారు(గర్భంలో ఉన్న శిశువుకు ఎటువంటి అనుభూతి ఉండదు). నిజం ఏమిటంటే వైద్యులు గర్భవతిగా ఉన్నప్పుడు శృంగారంలో పాల్గోనటం వలన ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెపుతున్నారు.

మీరు మానసికంగా జీవిత భాగస్వామి సాన్నిహిత్యం కోరుకుంటున్నా, మీరు గర్భవతిగా ఉన్నారు కాబట్టి, మీకు ఎన్నో సందేహాలు కలుగుతుంటాయి. "లోపలి శిశువు సరిగా ఉంటుందా?" "శిశువుకు గాయాలు ఏమైనా అవుతాయా?" " నాకు నొప్పులు వొచ్చి లేబర్ రూంకు వెళ్ళవలసి ఉంటుందా?" ఇలా ఎన్నో ప్రశ్నలు మీ మస్తిష్కంలో మెదులుతుంటాయి మరియు చివరకు ఒక పెద్ద మూడ్ కిల్లర్ అవుతాయి.

గర్భవతి గా ఉన్నప్పుడు సెక్స్ అనేది చాలా సందర్భాలలో సంపూర్ణ సురక్షితం. మీ వైద్యుడుని సంప్రదింఛి మీకు అధిక హాని ఉన్న ప్రెగ్నెన్సీ ఏమి లేదు అని నిర్ధారించుకోండి. గర్భస్రావం లేదా సమయానికి ముందే లేబర్ రూంకు వెళ్ళే ప్రమాదం ఉందని మీ వైద్యుడు సెక్స్ వ్యతిరేకంగా సలహా ఇస్తే తప్ప, సెక్స్ లో పాల్గొనటం వలన ఎటువంటి ప్రమాదం లేదు.

అపోహ : సెక్స్ శిశువును గాయపరచవచ్చు

అపోహ : సెక్స్ శిశువును గాయపరచవచ్చు

సెక్స్ వలన శిశువు భౌతికంగా గాయపడదు. మార్చ్ ఆఫ్ డైమ్స్ ప్రకారం, మీ డాక్టర్ గర్భవతిగా ఉన్నప్పుడు లైంగిక వాంఛకు వ్యతిరేకంగా సలహా ఇస్తే తప్ప, సెక్స్ గర్భధారణ సమయంలో సంపూర్ణ సురక్షితం అని తెలిపారు-సాధారణంగా మీరు అధిక హాని ఉన్న ప్రెగ్నెన్సీ తో ఉన్నారు అంటే తప్ప. మీరు గర్భస్రావాల చరిత్ర కలిగి ఉంటే,వివరణ లేని యోని స్రావం కలుగుతుంటే, బలహీనమైన గర్భాశయాన్ని కలిగి ఉంటే లేదా ఉమ్మనీరు బహిర్గతం అవుతుంటే, మీ వైద్యుడు సెక్స్ లో పాల్గోనవొద్దని సలహా ఇవ్వవొచ్చు-గర్భాశయం బలహీనంగా ఉంటే, త్వరగా తెరుచుకునే అవకాశం ఉంటుంది.

అపోహ : శిశువుకు ఏమి జరుగుతోందో తెలుస్తుంది

అపోహ : శిశువుకు ఏమి జరుగుతోందో తెలుస్తుంది

శిశువుకు అమ్మ మరియు నాన్న ఏమి చేస్తున్నారో ఏమి తెలియదు. నిజానికి, శిశువు అమ్నియోటిక్ శాక్ మరియు గర్భాశయ కండరాల గట్టి రక్షణలో ఉంటుంది. గర్భాశయ ద్వారం కూడా ఒక మందపాటి మ్యూకస్ ప్లగ్ తో మూసి ఉంటుంది.

అపోహ : సెక్స్ గర్భస్రావం జరగటానికి కారణమవుతుంది

అపోహ : సెక్స్ గర్భస్రావం జరగటానికి కారణమవుతుంది

శృంగార సమయంలో సెక్స్ మరియు ఆర్గస్మ్స్ గర్భస్రావాలు కలిగించవు. నిజానికి, తీవ్రోద్రేకంతో చెందిన సంకోచాలు, లేబర్ నొప్పులకు సంబంధించిన సంకోచాలు, రెండూ వేర్వేరుగా ఉంటాయి. అయినా సరే, మీరు మీ వైద్యుడిని సంప్రదించి, మీరు ప్రమాదరహిత గర్భం ధరించారని నిర్ధారించుకోండి.మేయో క్లినిక్ ప్రకారం, తొలి దశలో జరిగే గర్భస్రావాలు సాధారణంగా లోపలి శిశువు అభివృద్ధి చెందుతున్న దశలో జరిగే క్రోమోజోముల అసాధారణతలు లేదా ఇతర సమస్యల వలన జరుగుతాయి.

అపోహ : గర్భం ధరించటం వలన కామేచ్ఛ చచ్చిపోతుంది

అపోహ : గర్భం ధరించటం వలన కామేచ్ఛ చచ్చిపోతుంది

మార్చ్ ఆఫ్ డైమ్స్ ప్రకారం, నిజానికి గర్భధారణ సమయంలో చాలామంది మహిళలు సెక్స్ పట్ల చాలా కోరికతో ఉంటారని కనుగొన్నారు. ఎందుకు ఈ ఆకస్మిక మార్పు? ఎందుకంటే, హార్మోన్లు మీ గర్భధారణ వివిధ దశల్లో మారుతుంటాయి, కాబట్టి మీ కామేచ్ఛలో కూడా మార్పు వొస్తుంది. ముఖ్యంగా,మొదటి మూడు నెలలు,ఎందుకంటే మొదటిసారి గర్భవతిగా ఉన్న తల్లులు వికారము, తరచుగా బాత్రూమ్ కు వెళ్లి రావటం, ఇబ్బందికరంగా ఉండటం మరియు ఉదయపు అలసటగా ఉండటం వంటి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు.

రెండవ త్రైమాసికంలో, ఆ లక్షణాలు సాధారణంగా తక్కువ స్థాయిలో ఉంటాయి మరియు అప్పుడు మహిళలు సెక్స్ కోసం మరింత కోరిక కలిగి ఉంటారు. మీకు మహిళలు గర్భధారణ సమయంలో మూడు పౌండ్ల బరువున్న రక్తం సమకూర్చుకుంటారని తెలుసా? మార్చ్ ఆఫ్ డైమ్స్ ప్రకారం,ఎక్కువగా రక్త ప్రవాహం వేస్ట్ లైన్ దిగువన ఉంటుందని చెపుతున్నారు.

అపోహ : ప్రెగ్నెన్సీ STDs నుండి రక్షిస్తుంది

అపోహ : ప్రెగ్నెన్సీ STDs నుండి రక్షిస్తుంది

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రకారం, ప్రెగ్నెన్సీ లైంగిక వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షించదు. మీరు గర్భవతిగా ఉన్నప్పుడు ఏదైనా లైంగిక వ్యాధి ఉంటే, అది గర్భంలోని శిశువుకు కూడా బదిలీ అవుతుంది. మీకు గర్భవతిగా ఉన్నప్పుడు ఒక STD సోకే ప్రమాదాన్ని తగ్గించుకునే ఉత్తమ మార్గాలలో ఒకటి ఈ వ్యాధులు లేని వ్యక్తితో శృంగారం జరపటం, రెండవది మీఒక్కరితోనే శృంగారంలో పాల్గోనేవారితో ఉండటం. CDC ప్రకారం,కండోమ్స్ ని సరైన మార్గంలో ఉపయోగించడం వల్ల కూడా కొంతవరకు STDs పొందే అవకాశాలను తగ్గించుకోవొచ్చు.

English summary

Myths About Pregnancy Intercourse

You've probably heard them. Myths about having sex while pregnant are common, and even sometimes comical (no, the baby cannot feel anything). The truth is, doctors say having sex while pregnant is perfectly safe in most cases.
Story first published: Saturday, March 4, 2017, 20:00 [IST]
Subscribe Newsletter