కడుపుతో ఉన్నప్పుడు వచ్చే హెర్పిస్ వలన బిడ్డలో ఆటిజం లక్షణాలు వస్తాయా?

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

కడుపుతో ఉన్న సమయంలో ఒక స్త్రీ తన ఆరోగ్యం గురించి జీవితంలో అన్నిటికన్నా ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, మనకి తెలిసిందే, ఆరోగ్యంలో ఒక చిన్నమార్పు కూడా లోపల పెరుగుతున్న బేబీపై నేరుగా ప్రభావం చూపిస్తుంది.

ఒక స్త్రీ కడుపుతో ఉన్నప్పుడు, ఆమె బొడ్డునాళం ద్వారా లోపలి పిండానికి తల్లి నుంచి బిడ్డకి ఆహారం వెళ్తుంది.

ఆహారమే కాక, కొన్ని ఇన్ఫెక్షన్లు కూడా తల్లి రక్తం నుంచి బిడ్డకి ఈ బొడ్డునాళం ద్వారా ప్రసరిస్తాయి.

అందుకని, గర్బవతిగా ఉన్న స్త్రీ తను కడుపుతో ఉన్న సమయంలో చాలా ఆరోగ్యంగా ఉండటానికి అన్ని జాగ్రత్తలూ తీసుకొని తీరాలి.

ప్రపంచవ్యాప్తంగా కడుపుతో ఉన్న స్త్రీలు, పుట్టబోయే పిల్లలలో ఆరోగ్య సమస్యలను తగ్గించటానికి గర్భసమయంలో ఆరోగ్యంపై అనేక పరిశోధనలను జరుగుతున్నాయి.

Can Herpes Infection During Pregnancy Cause Autism Symptoms In Babies?

గర్భసమయంలో వచ్చే వివిధ సమస్యలు, పిండంపై వాటి దుష్ప్రభావాల గురించి శాస్త్రవేత్తలు వాటి సంబంధాల గూర్చి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.

అందుకని కడుపుతో ఉన్నవారు అలాంటి తాజావార్తలపై దృష్టి పెట్టడం మంచిది.

గర్భసమయంలో వచ్చే హెర్పిస్ ఇన్ఫెక్షన్ పిల్లల్లో ఆటిజంకి కారణమవుతుందా అని ఇప్పుడు చూద్దాం.

గర్భసమయంలో హెర్పిస్ మరియు పిల్లలలో ఆటిజం మధ్య సంబంధం

హెర్పిస్ వైరస్ సోకటం వలన వచ్చే ఇన్ఫెక్షన్. ఇది నోరు మరియు జననాంగాల చుట్టూ నొప్పిపుట్టే కురుపులు, నాడీ అవలక్షణాలు , జ్వరం వంటి లక్షణాలతో ఉంటుంది.

Can Herpes Infection During Pregnancy Cause Autism Symptoms In Babies?

రెండు రకాల హెర్పిస్ ఇన్ఫెక్షన్లు రావచ్చు. జననాంగాల హెర్పిస్ లైంగికంగా సంక్రమిస్త్తే, కోల్డ్ సోర్స్ (మరొక రకం హెర్పిస్) నీరు, గాలి లేదా ఏదైనా శారీరక సంపర్కం వలన రావచ్చు.

హెర్పిస్ చాలా వేగంగా వ్యాప్తిచెందే ఇన్ఫెక్షన్ రోగం మరియు దానికి చికిత్స మాత్రమే చేయగలం,నివారించలేం.

ఇక ఆటిజం విషయానికొస్తే, ఇది పిల్లల్లో వచ్చే సీరియస్ ఎదుగుదల లోపం.ఇది నేర్చుకునే, మాట్లాడే, అందరితో కలిసిపోయే లక్షణాలపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది.

కొన్నిసార్లు ఈ ఆటిజం లక్షణాలు కండరాలకి –మెదడుకి సరైన సమాచార వ్యవస్థలోపం వలన సామాజికంగా సరిగా కలవలేకపోవటం, నేర్చుకోలేని లోపం, మాట్లాడలేని లోపం, భావోద్వేగ నియంత్రణ లేకపోవటం వంటి లక్షణాలు వస్తాయి. ఆటిజంకి కూడా చికిత్స లేదు.

Can Herpes Infection During Pregnancy Cause Autism Symptoms In Babies?

కొలంబియా విశ్వవిద్యాలయంలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అండ్ ఇమ్యూనిటీ సంస్థలో ఇటీవల జరిగిన పరిశోధనలో పిల్లల్లో ఆటిజంకి, కడుపుతో ఉన్నప్పుడు వచ్చే హెర్పిస్ ఇన్ఫెక్షన్ కి తప్పక సంబంధం ఉందని తేల్చారు.

ఈ అధ్యయనంలో హెర్పిస్ వైరస్ కి వ్యతిరేకంగా కడుపుతో ఉన్న స్త్రీల రోగనిరోధక వ్యవస్థ రెస్పాన్స్ పిండంలో నాడీవ్యవస్థ పాడవటానికి కారణమై, ఆటిజంకి దారితీస్తుందని తెలిపారు.

అందుకని, కడుపుతో ఉన్న స్త్రీ సురక్షిత సెక్స్ లో పాల్గొంటూ, హెర్పిస్ ఇన్ఫెక్షన్ కి దూరంగా, చాలా జాగ్రత్తగా ఉండాలి.

English summary

Can Herpes Infection During Pregnancy Cause Autism Symptoms In Babies?

Numerous research studies on pregnancy health are being conducted globally in efforts to minimise the health complications in pregnant women and their unborn. Scientists keep trying to find links between certain occurrences during pregnancy, which may affect the foetus negatively. So, it is important for the pregnant women to keep themselves updated about such news. Let us find out if herpes infection during pregnancy can cause autism in the kids.
Subscribe Newsletter