For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్ ఫెర్టిలిటి? గర్భధారణ కోసం ఎదురు చూస్తున్న జంటలకు గర్భం పొందే మార్గాలు

By Lakshmi Perumalla
|

ఈ రోజుల్లో జంటలు ఎదుర్కొనే సమస్యల్లో వంధ్యత్వం ప్రధానంగా ఉంది. గర్భధారణ అనేది చాలా పెద్ద సమస్యగా ఉంది. ప్రపంచంలోని సంతానోత్పత్తి క్లినిక్ల సంఖ్య పెరగడంతో ఇది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ సమస్యకు అనేక కారణాలు ఉన్నాయి.

దీనికి పర్యావరణ కారకాలు,జీవనశైలి, ఆరోగ్య సమస్యలు మరియు వయస్సు కారణాలుగా చెప్పవచ్చు. ఇది వంధ్యత్వానికి గురైన మహిళలకు మాత్రమే కాదు. వాస్తవానికి పురుషులు కూడా వర్తిస్తుంది. అనేక సందర్భాలలో స్త్రీ మరియు పురుషుడు ఇద్దరికి కూడా వంధ్యత్వం ఉంటుంది.

సంతానలేమికి గురిచేసే గర్భాశయ వ్యాధులు

గర్భస్రావం చేయటానికి ప్రయత్నించేవారికి వంధ్యత్వం యొక్క వార్త నిరాశాజనకంగా ఉంటుంది. ఈ ప్రక్రియకు కారణాన్ని కనుగొనే వారిపై టోల్ పడుతుంది. కానీ ఇది గర్భధారణకు ముగింపు కాదు.

options for infertility

ఇక్కడ అందుబాటులో అనేక రకాల ఎంపికలు ఉన్నాయి. వీటి కోసం ప్రయత్నాలు చేయవచ్చు. అయితే ముందుగా వైద్యుని సంప్రదించి గర్భధారణకు ఉత్తమమైన మరియు సరైన పద్దతిని నిర్ధారించుకోవాలి. ఈ సమస్య పరిష్కారానికి వైద్యరంగం అందించే ఎంపికలను తెలుసుకోవడానికి ఈ వ్యాసాన్ని చదవండి.

స్త్రీ-పురుషుల్లో సంతానలేమి సమస్యను నిరోధిండం ఎలా

ఫెర్టిలిటీ డ్రగ్స్

ఫెర్టిలిటీ డ్రగ్స్

వంధ్యత్వానికి చికిత్స కొరకు ఇది మొదటి ఎంపిక. ఈ విధానంలో మాత్ర రూపంలో గాని ఇంజెక్ట్ రూపంలో గాని తీసుకుంటారు. ఈ మందులు హార్మోన్లను విడుదల చేసి గుడ్లు ఉత్పత్తి పెంచుతాయి. తద్వారా పిండం మరింత స్వీకార మరియు అమరిక బాగుంటుంది. ఈ పద్దతి ఆశించిన ఫలితం ఇవ్వకపోతే, IVF లేదా కృత్రిమ గర్భధారణకు వెళ్ళవలసి ఉంటుంది.

కృత్రిమ గర్భధారణ

కృత్రిమ గర్భధారణ

ఈ పద్దతి అందుబాటులో ఉన్న అన్ని విధానాల్లో సులభమైనది. ఈ పద్దతిలో ప్రత్యేకంగా సిద్ధం చేసిన స్పెర్మ్ ఒక కాథెటర్ సహాయంతో నేరుగా గర్భాశయం లోకి ఇంజెక్ట్ చేస్తారు. చికిత్స యొక్క ఆరు చక్రాల తర్వాత, ఇతర పద్ధతుల కంటే కృత్రిమ గర్భధారణకు సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రక్రియను హాస్పిటల్ లో చేయటం సులభం. ఇది తక్కువ నాణ్యత స్పెర్మ్ లేదా స్పెర్మ్ ప్రతిరోధకాలు ఉత్పత్తి ఉన్నప్పుడు ఈ పద్దతి మహిళలకు అనుకూలంగా ఉంటుంది.

ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF)

ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF)

ఈ పద్దతి చాలా క్లిష్టమైన మరియు ఖరీదైనది. అందువల్ల చాలా తక్కువ జంటలు మాత్రమే ఈ ప్రక్రియ కొరకు వెళతారు. ఇది గుడ్లు మరియు స్పెర్మ్ కలపడం ద్వారా జరుగుతుంది. ఈ ప్రక్రియ పిండం తయారయ్యే వరకు గర్భాశయం బయట జరుగుతుంది.

ఈ పద్దతిలో పిండం తయారయ్యాక గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఈ విధంగా పుట్టిన శిశువులను "టెస్ట్-ట్యూబ్ బేబీ " అని పిలుస్తారు. సాధారణంగా ఈ IVF పద్ధతిని ఎండోమెట్రియోసిస్, తక్కువ స్పెర్మ్ కౌంట్, అండోత్సర్గము, ఫెలోపియన్ ట్యూబ్ మరియు గర్భాశయ సమస్యలతో బాధపడుతున్న జంటలకు సూచిస్తారు.ఇతర పద్ధతులు పనిచేయనప్పుడు చివరగా IVF ప్రక్రియకు వస్తారు.

సరోగసి

సరోగసి

ఈ ప్రక్రియలో మూడో పార్టీ పాల్గొంటుంది. శిశువు ఒక సర్రోగేట్ తల్లిచే నిర్వహించబడుతుంది. ఒక మహిళకు వ్యాధులు మరియు ఇతర హాని కారకాల కారణంగా శిశువును మోసే పరిస్థితి లేనప్పుడు ఈ పద్దతికి వెళతారు. సర్రోగేట్ తల్లిని గర్భవతి చేయడానికి కృత్రిమ గర్భధారణ లేదా IVF ప్రక్రియలను ఉపయోగిస్తారు.

దాత గుడ్లు మరియు పిండాలు

దాత గుడ్లు మరియు పిండాలు

ఈ ప్రక్రియలో కూడా మూడో వ్యక్తి పాల్గొంటుంది. IVF చేయించుకున్న జంటల నుండి పిండాలను సేకరించి గర్భాశయంలో ప్రవేశపెడతారు. గ్రహీత యొక్క గర్భాశయంలో ఇంప్లాంట్ చేయడానికి ఉపయోగించని పిండాలను ఉపయోగిస్తారు. మహిళ యొక్క అండాశయాల నుండి మాత్రమే గుడ్లు లభిస్తాయి. గ్రహీత యొక్క భాగస్వామి యొక్క స్పెర్మ్ తో కలిపి లాబ్ లో పిండాలను ఏర్పరుస్తారు.

పునరుత్పత్తి శస్త్రచికిత్స

పునరుత్పత్తి శస్త్రచికిత్స

శరీర నిర్మాణ అసాధారణతలు కూడా వంధ్యత్వంనకు కారణం కావచ్చు.ఈ సమస్యను శస్త్రచికిత్సతో సరిదిద్దవచ్చు. ఆ తర్వాత గర్భధారణను కొనసాగవచ్చు.ఎండోమెట్రియోసిస్తో బాధపడుతున్న జంటలు, ఫెలోపియన్ ట్యూబ్లో బ్లాక్ లేదా వృషణాల సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది ఉత్తమైన మార్గం. జంటలు ఎదుర్కొంటున్న సమస్య తీవ్రతను బట్టి విజయాల శాతం ఉంటుంది.

ఇంట్రాఫలోపియన్ ట్రాన్స్ఫర్

ఇంట్రాఫలోపియన్ ట్రాన్స్ఫర్

ఈ పద్ధతిలో గేటాట్ లేదా జైగోట్ ని నేరుగా ఫెలోపియన్ ట్యూబ్లో ఉంచుతారు. గుడ్లు మరియు స్పెర్మ్ మిశ్రమంగా మరియు తరువాత ట్యూబ్లో ఉంచినప్పుడు గామేటే ఇంట్రాఫలోపియన్ బదిలీ జరుగుతుంది. జ్యోగెట్ ఇంట్రాఫలోపియన్ బదిలీ అనేది ట్యూబ్ లో జరుగుతుంది. పూర్వ పద్ధతిలో ఫలదీకరణం సహజ వాతావరణంలో జరిగేది. ప్రస్తుతం ప్రయోగశాలలో జరుగుతుంది.

ఆక్యుపంక్చర్

ఆక్యుపంక్చర్

ఈ విధానం చాలా పూర్వ కాలం నుండి ఉన్నది. ప్రత్యుత్పత్తి నిపుణులు IVF మరియు ఇతర చికిత్సలను అనేక సార్లు విఫలం అయ్యిన జంటలకు ఆక్యుపంక్చర్ ని సూచిస్తారు.

తల నుండి బొటనవేలు వరకు శరీరంలో కీ శక్తి పాయింట్లను ఉద్దీపన చేయడానికి సూదులు ఉపయోగించే ఒక పాత చైనీస్ ఔషధం చికిత్స. ఇలా చేయటం వలన శరీరంలో పనితీరు మెరుగుపడి ఫలదీకరణకు అనుకూలంగా మారుతుంది. ఈ రోజుల్లో, ఆక్యుపంక్చర్ ని IVF చికిత్సతో పాటు గర్భం యొక్క విజయాన్ని మెరుగుపరచడానికి సూచిస్తున్నారు.

English summary

Does Infertility Mean You'll Never Get Pregnant? Pregnancy Options For Infertile Couples

Does Infertility Mean You'll Never Get Pregnant? Pregnancy Options For Infertile Couples, Infertility is a major issue that haunts couples nowadays. It is the inability to conceive or bear a child. Here are some pregnancy options for infertile
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more